యువత ఉపాధికే ‘స్కిల్ ఇండియా’
నెహ్రూ యువకేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు
చంద్రశేఖరరావు
శ్రీరాంనగర్‌లో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం
మొయినాబాద్: యువతకు ఉపాధి కల్పించడం కోసమే ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్కిల్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, నెహ్రూ యువకేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖరరావు అన్నారు. మండల పరిధిలోని శ్రీరాంనగర్‌లో గ్రామ పంచాయతీ పాలకవర్గం మూడో వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత అన్నిరంగాల్లో నైపుణ్యం పెంచుకోవాలన్నారు. యువతలో వృత్తి నైపుణ్యం పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అనేక రకాల పథకాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తుందన్నారు. యువత క్రీడల్లోనూ రాణించాలన్నారు. ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం ఎన్నో నిధులు ఖర్చు పెడుతుందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర నాయకుడు కంజర్ల ప్రకాష్, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ బి.జంగారెడ్డి, మండల అధ్యక్షుడు క్యామ పద్మనాభం, మాజీ అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ మహిపాల్, మాజీ సర్పంచ్ భిక్షపతి, వార్డు సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.