క్యాంపస్ అంబాసిడర్స్ - ఆర్. భరత్‌సింహా రెడ్డి | campus-ambassadors Bharatsinha Reddy | Sakshi
Sakshi News home page

క్యాంపస్ అంబాసిడర్స్ - ఆర్. భరత్‌సింహా రెడ్డి

Published Mon, Oct 13 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

క్యాంపస్ అంబాసిడర్స్ - ఆర్. భరత్‌సింహా రెడ్డి

క్యాంపస్ అంబాసిడర్స్ - ఆర్. భరత్‌సింహా రెడ్డి

ఆర్. భరత్‌సింహా రెడ్డి ఎంఏఎన్‌ఐటీ / భోపాల్

మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - భోపాల్.. దేశంలోనే మంచిపేరున్న విద్యా సంస్థ. అక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువు తున్న ఆర్. భరత్ సింహా రెడ్డి తన క్యాంపస్ లైఫ్‌ను పంచుకుంటున్నారిలా..
 
నో ర్యాగింగ్ : క్యాంపస్‌లో అందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్యాంటీన్‌లో రుచికరమైన ఆహారం దొరుకుతోంది. రాత్రిళ్లు ఎక్కువ సేపు చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా క్యాంటీన్ కూడా ఏర్పాటైంది. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. అన్ని హాస్టల్స్ దగ్గర పటిష్ట మైన రక్షణ ఏర్పాట్లు చేశారు.
 
ఎన్నో కోర్సులు: క్యాంపస్ వాతావరణం చాలా బాగుంటుంది. హైస్పీడ్‌తో క్యాంపస్ అంతా వై-ఫై ఉంది. బీటెక్, బీఆర్‌‌క, బీప్లానింగ్ లతోపాటు పీజీ కోర్సుల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, పీహెచ్‌డీ వంటివాటిని ఆఫర్ చేస్తున్నారు. బీటెక్‌లో జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా, ఎంటెక్‌లో గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులంతా ఎంతో స్నేహంగా ఉంటారు. ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా క్యాంపస్‌లోనే ఉంటారు. సబ్జెక్టుల పరంగా వివిధ సందేహాలను నివృత్తి చేస్తారు.
 
అత్యుత్తమ సదుపాయాలు: విశాలమైన తరగతి గదులు, అన్ని వసతులతో కూడిన లేబొరేటరీలు, డిస్పెన్సరీ, కంప్యూ టర్ సెంటర్, క్రీడా మైదానాలు ఉన్నాయి. ప్రస్తుతం అత్యాధునిక శైలిలో షాపింగ్ కాంప్లెక్స్, లైబ్రరీని నిర్మిస్తున్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు వసతి.. ఇలా చదువుకోవ డానికి కావాల్సిన చక్కటి వాతావర ణం, సదుపాయాలు ఉన్నాయి. రీసెర్‌‌చ చేసే విద్యార్థు లను ప్రోత్సహించడానికి ఇటీవలే ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇది పరిశోధకు లకు ఆర్థిక సహాయం చేస్తుంది.
 
ప్రాక్టికల్స్‌కు పెద్దపీట: బోధనలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వినియోగిస్తారు. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారు. ఇండస్ట్రీ ఓరియెంటేషన్‌తో క్లాసులు నిర్వహిస్తారు. అన్ని బ్రాంచ్‌ల విభాగాల ఆధ్వర్యంలో పరిశోధనపరమైన కార్యక్రమాలు ఎక్కువగా జరుగు తుంటాయి. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు సొంతంగా ల్యాబ్‌లు ఉన్నాయి. అదేవిధంగా అత్యాధునిక పరిశోధన పరికరాలను సమకూర్చారు. విద్యార్థులను కూడా పరిశోధనల వైపు ప్రోత్సహిస్తారు. ఇన్‌స్టి ట్యూట్‌కు.. సీఎస్‌ఐఆర్, డీఎస్‌టీ, యూజీసీ, ఇస్రో, ఐసీఎంఆర్‌ల నుంచి భారీగా నిధులు అందుతున్నాయి.
 
క్విజర్ క్లబ్ ఎన్‌ఐటీల్లోనే మొదటిది: క్యాంపస్ విద్యార్థులందరూ వివిధ సొసైటీలు, క్లబుల్లో సభ్యులుగా ఉంటారు. ఈ క్రమంలో ఏర్పడిన క్విజర్ క్లబ్.. దేశంలో ఉన్న 30 ఎన్‌ఐటీల్లో మొదటిగా ఏర్పడింది. ఇంకా ఎన్‌ఐటీబీ వెబ్ క్లబ్ కూడా ఉంది. దీని ద్వారా విద్యార్థులంతా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటారు. వారి కార్యకలాపాలను, బ్రాంచ్, డిపార్ట్‌మెంట్ ఈవెంట్స్‌ను అందరితో పంచుకుంటారు. అంతేకాకుండా వెబ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, గో గ్రీన్ ఫోరమ్, పర్యావరణ పరిరక్షణ సొసైటీ వంటివాటిని ఏర్పాటు చేశాం. రోటరీ ఇంటర్నేషనల్ ఆధ్యర్యంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.
 
వివిధ విద్యా సంస్థలతో ఒప్పందాలు: క్యాంపస్‌లో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు మంచి ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నా యి. ఇంటర్న్‌షిప్స్, ప్లేస్‌మెంట్స్ కోసం ఇన్‌స్టిట్యూట్.. వివిధ ప్రముఖ సంస్థలు, కంపెనీల సహకారం, ఒప్పందాలతో ముందడుగు వేస్తోంది. ప్రీ ప్లేస్‌మెం ట్స్ ఆఫర్స్ లోనూ ఇన్‌స్టిట్యూట్ ముం దుంటోంది. గతేడాది ఏడాదికి కనీసం రూ. 4 లక్షల నుంచి గరిష్టంగా ఏడాదికి రూ.10 లక్షల వరకు వేతనాలు అందిం చాయి.
 
కంపెనీలివే: ఫేస్‌బుక్, పవర్‌గ్రిడ్, హోండా మోటార్స్, మహీంద్రా, అమెజాన్, డేటా 64 వంటి కంపెనీలు క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement