Computer Science and Engineering
-
కంప్యూటర్ సైన్స్‌కే.. సై
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో భర్తీకి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) ప్రవేశాల కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)కే జై కొట్టారు. రెండో స్థానంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మూడో స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ), నాలుగో స్థానంలో మెకానికల్ ఇంజనీరింగ్ నిలిచాయి. కొత్తగా ప్రవేశపెట్టిన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), డిజైన్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఆటోమేషన్ తదితర కోర్సుల్లోనూ చేరికలు గతంలో కంటే పెరిగాయి. అయితే ఇంకా భర్తీ కాని సీట్లు కొన్ని విభాగాల్లో ఎక్కువగానే ఉన్నాయి. తొలిసారి ‘బీ’ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు గతంలో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కళాశాలలే భర్తీ చేసుకునేవి. రిజర్వేషన్లు, మెరిట్‌తో సంబంధం లేకుండా తాము నిర్దేశించిన ఫీజును చెల్లించిన వారికి ఈ సీట్లను కేటాయించేవి. తద్వారా ప్రవేశ పరీక్షలో మెరిట్ ర్యాంకు వచ్చిన వారికి మొండిచేయి చూపేవి. పైగా రిజర్వేషన్లను కూడా అమలు చేసేవి కావు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల కేటగిరీల్లో ఆయా వర్గాలకు దక్కాల్సిన సీట్లు బయట విద్యార్థులకు దక్కేవి. ఫలితంగా నిరుపేద మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయేవారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ‘బీ’ కేటగిరీ సీట్లను సైతం ప్రభుత్వం కన్వీనర్ కోటాలో భర్తీ చేయించింది. ‘బీ’ కేటగిరీలోని ఎన్ఆర్ఐ కోటాలో మిగులు సీట్లు, నాన్ ఎన్ఆర్ఐ కోటాలో సీట్లకు కలిపి కన్వీనరే కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో ఈసారి ఆయా కళాశాలల్లో రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు అవకా>శం దక్కింది. ‘బీ’ కేటగిరీలో 13,564 మందికి సీట్లను కేటాయించారు. మొత్తం 1,12,699 సీట్లు.. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం ఇన్‌టేక్ 1,12,699 సీట్లుండగా 80,935 సీట్లు తొలి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. ఈ సీట్లలో అత్యధికం కంప్యూటర్ సైన్స్‌లోనే ఉండగా భర్తీలోనూ ఇదే అగ్రస్థానంలో నిలిచింది. సీఎస్ఈలో మొత్తం 24,904 సీట్లుండగా తొలి విడతలోనే 23,835 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా కేవలం 1,069 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఈసీఈలో 23,977 సీట్లుండగా 20,275 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 3,702 సీట్లు మిగిలాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొత్తం 12,678 సీట్లకు 4,760 భర్తీ కాగా 7,918 మిగిలిపోయాయి. అదేవిధంగా ఈఈఈలో 10,931లో 6,410 సీట్లు భర్తీ కాగా 4,521 సీట్లు మిగిలాయి. ఇక సివిల్ ఇంజనీరింగ్‌లో 9,904 సీట్లకు 4,455 సీట్లు భర్తీ కాగా 5,449 సీట్లు ఖాళీగా ఉన్నాయి. -
బీఎస్సీ డేటా సైన్స్ ఈ కోర్సు కిరాక్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో డేటా సైన్స్ కోసం విద్యార్థులు విపరీతంగా పోటీ పడుతున్నారు. మెరుగైన ఉపాధి కల్పించే కోర్సుగా దీనిని భావిస్తుండటమే ఇందుకు కారణం. తాజాగా చేపట్టిన మొదటి దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 3,229 డేటా సైన్స్ సీట్ల భర్తీకి దాదాపు 20 వేల మందికి పైగా ఆప్షన్లు ఇవ్వడం దీని డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. దీంతో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సీటుకు రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంజనీరింగ్ డేటా సైన్స్ కన్నా బీఎస్సీ డేటా సైన్స్ మెరుగైనదని ఉన్నత విద్యామండలి స్పష్టం చేస్తోంది. గతేడాదే డిగ్రీలో దీన్ని ప్రవేశపెట్టగా ఈ సంవత్సరం దీనికి మరిన్ని మెరుగులు దిద్దారు. అప్పట్లోనే దాదాపు 7 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ సరైన ప్రచారం లేకపోవడంతో విద్యార్థులు ఈ కోర్సును పట్టించుకోవడం లేదని, ప్రాధాన్యతను గుర్తించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌పై తరగని మోజు కూడా ఇందుకు కారణమవుతోందని అంటున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఇంజనీరింగ్ చేసే బదులు బీఎస్సీ డేటా సైన్స్ చేస్తే మెరుగైన ఉపాధి పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఎంఎన్సీల ప్రత్యేక శిక్షణ ఇంజనీరింగ్ డేటా సైన్స్ నాలుగేళ్ల కోర్సు అయితే బీఎస్సీ డేటా సైన్స్ మూడేళ్ల కోర్సే. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత విద్యార్థి మార్కెట్‌కు తగినవిధంగా ఇతర అప్లికేషన్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ సాధ్యం కాకపోతే ఈ దిశగా విద్యార్థి కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. బీఎస్సీ డేటా సైన్స్ కోర్సులో మొదటి సంవత్సరం నుంచే బహుళజాతి సంస్థల ప్రతినిధులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ మేరకు పలు సంస్థలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ సహా మొత్తం 25 కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఆ సంస్థల్లో పనిచేసేందుకు ఎలాంటి శిక్షణ కావాలో ఆ శిక్షణను విద్యార్థి దశ నుంచే ఆయా కంపెనీలు అందిస్తాయి. మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి మాడ్యూల్స్ మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి సరికొత్త మాడ్యూల్స్‌ను కార్పొరేట్ కంపెనీలు రూపొందించి బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థులకు పంపుతాయి. జావా, పైతాన్‌తో పాటు పలు రకాల టూల్స్‌ను ఆయా సంస్థలు నేర్పిస్తాయి. వీటిపై లేబొరేటరీల్లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తారు. దీంతో పాటు సంస్థల నేతృత్వంలోనే మూడేళ్ళ పాటు మినీ ప్రాజెక్టులు చేపడతారు. దీంతో బీఎస్సీ డేటా సైన్స్ కోర్సు పూర్తయ్యే నాటికే విద్యార్థికి పూర్తి స్థాయి నైపుణ్యం ఉంటుందని ఉన్నత విద్యా మండలి తెలిపింది. కంపెనీల అవసరాలకు సరిపడే కోర్సు బీఎస్సీ డేటా సైన్స్ కోర్సును కంపెనీల అవసరాలకు అనుగుణంగా రూపొందిం చాం. డిగ్రీని చులకన చేసే పరిస్థితులను మార్చాలన్నదే లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులను గుర్తించి, వాటిపై బహుళజాతి కంపెనీలు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తాయి. దీంతో డిగ్రీ పూర్తవ్వడంతోనే మెరుగైన వేతనాలతో విద్యార్థులు స్థిరపడే వీలుంది. – లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బీఎస్సీ విద్యార్థుల్లో విశ్వాసం పెరిగింది గతంతో పోలిస్తే బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థుల్లో విశ్వాసం పెరిగింది. తొలిదశ నుంచే పైతాన్, జావాతో పాటు అనేక కొత్త అప్లికేషన్లపై అవగాహన పెంచుకుంటున్నారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ఏమాత్రం తీసిపోని రీతిలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటున్నారు. – ప్రొఫెసర్ శ్యామల, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు, ఓయూ క్యాంపస్ నియామకాల్లో వీళ్లకే చోటు బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థులను కన్సార్షియం సంస్థలు పూర్తిగా తాము తయారు చేసుకున్న మానవ వనరులుగానే భావిస్తాయి. ఉమ్మడి ప్రణాళికతో తమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక శిక్షణ ఇవ్వడం వల్ల ఉమ్మడిగా జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఒక్క పరీక్షలో ర్యాంకు సాధిస్తే 25 కంపెనీల్లో ఇతర పరీక్షలు లేకుండా ఉపాధి పొందే వీలుంది. డిగ్రీ విద్యార్థులు స్థిరంగా ఒకే కంపెనీలో ఎక్కువ కాలం ఉండే వీలుందని ఇటీవలి విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని పరిగణనలోనికి తీసుకుని క్యాంపస్ నియామకాల్లో ఇంజనీరింగ్ డేటా సైన్స్ కన్నా, బీఎస్సీ డేటా సైన్స్ పూర్తి చేసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీల ప్రతినిధులు భావిస్తున్నారు. -
క్యాంపస్ అంబాసిడర్స్ - ఆర్. భరత్‌సింహా రెడ్డి
ఆర్. భరత్‌సింహా రెడ్డి ఎంఏఎన్ఐటీ / భోపాల్ మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - భోపాల్.. దేశంలోనే మంచిపేరున్న విద్యా సంస్థ. అక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువు తున్న ఆర్. భరత్ సింహా రెడ్డి తన క్యాంపస్ లైఫ్‌ను పంచుకుంటున్నారిలా.. నో ర్యాగింగ్ : క్యాంపస్‌లో అందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్యాంటీన్లో రుచికరమైన ఆహారం దొరుకుతోంది. రాత్రిళ్లు ఎక్కువ సేపు చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా క్యాంటీన్ కూడా ఏర్పాటైంది. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. అన్ని హాస్టల్స్ దగ్గర పటిష్ట మైన రక్షణ ఏర్పాట్లు చేశారు. ఎన్నో కోర్సులు: క్యాంపస్ వాతావరణం చాలా బాగుంటుంది. హైస్పీడ్‌తో క్యాంపస్ అంతా వై-ఫై ఉంది. బీటెక్, బీఆర్‌క, బీప్లానింగ్ లతోపాటు పీజీ కోర్సుల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, పీహెచ్డీ వంటివాటిని ఆఫర్ చేస్తున్నారు. బీటెక్‌లో జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా, ఎంటెక్‌లో గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులంతా ఎంతో స్నేహంగా ఉంటారు. ఎంటెక్, పీహెచ్డీ విద్యార్థులు కూడా క్యాంపస్‌లోనే ఉంటారు. సబ్జెక్టుల పరంగా వివిధ సందేహాలను నివృత్తి చేస్తారు. అత్యుత్తమ సదుపాయాలు: విశాలమైన తరగతి గదులు, అన్ని వసతులతో కూడిన లేబొరేటరీలు, డిస్పెన్సరీ, కంప్యూ టర్ సెంటర్, క్రీడా మైదానాలు ఉన్నాయి. ప్రస్తుతం అత్యాధునిక శైలిలో షాపింగ్ కాంప్లెక్స్, లైబ్రరీని నిర్మిస్తున్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు వసతి.. ఇలా చదువుకోవ డానికి కావాల్సిన చక్కటి వాతావర ణం, సదుపాయాలు ఉన్నాయి. రీసెర్చ చేసే విద్యార్థు లను ప్రోత్సహించడానికి ఇటీవలే ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇది పరిశోధకు లకు ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట: బోధనలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వినియోగిస్తారు. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారు. ఇండస్ట్రీ ఓరియెంటేషన్‌తో క్లాసులు నిర్వహిస్తారు. అన్ని బ్రాంచ్‌ల విభాగాల ఆధ్వర్యంలో పరిశోధనపరమైన కార్యక్రమాలు ఎక్కువగా జరుగు తుంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కు సొంతంగా ల్యాబ్‌లు ఉన్నాయి. అదేవిధంగా అత్యాధునిక పరిశోధన పరికరాలను సమకూర్చారు. విద్యార్థులను కూడా పరిశోధనల వైపు ప్రోత్సహిస్తారు. ఇన్స్టి ట్యూట్‌కు.. సీఎస్ఐఆర్, డీఎస్టీ, యూజీసీ, ఇస్రో, ఐసీఎంఆర్‌ల నుంచి భారీగా నిధులు అందుతున్నాయి. క్విజర్ క్లబ్ ఎన్ఐటీల్లోనే మొదటిది: క్యాంపస్ విద్యార్థులందరూ వివిధ సొసైటీలు, క్లబుల్లో సభ్యులుగా ఉంటారు. ఈ క్రమంలో ఏర్పడిన క్విజర్ క్లబ్.. దేశంలో ఉన్న 30 ఎన్ఐటీల్లో మొదటిగా ఏర్పడింది. ఇంకా ఎన్ఐటీబీ వెబ్ క్లబ్ కూడా ఉంది. దీని ద్వారా విద్యార్థులంతా ఆన్లైన్లో అందుబాటులో ఉంటారు. వారి కార్యకలాపాలను, బ్రాంచ్, డిపార్ట్మెంట్ ఈవెంట్స్‌ను అందరితో పంచుకుంటారు. అంతేకాకుండా వెబ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, గో గ్రీన్ ఫోరమ్, పర్యావరణ పరిరక్షణ సొసైటీ వంటివాటిని ఏర్పాటు చేశాం. రోటరీ ఇంటర్నేషనల్ ఆధ్యర్యంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వివిధ విద్యా సంస్థలతో ఒప్పందాలు: క్యాంపస్‌లో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు మంచి ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నా యి. ఇంటర్న్షిప్స్, ప్లేస్‌మెంట్స్ కోసం ఇన్స్టిట్యూట్.. వివిధ ప్రముఖ సంస్థలు, కంపెనీల సహకారం, ఒప్పందాలతో ముందడుగు వేస్తోంది. ప్రీ ప్లేస్మెం ట్స్ ఆఫర్స్ లోనూ ఇన్స్టిట్యూట్ ముం దుంటోంది. గతేడాది ఏడాదికి కనీసం రూ. 4 లక్షల నుంచి గరిష్టంగా ఏడాదికి రూ.10 లక్షల వరకు వేతనాలు అందిం చాయి. కంపెనీలివే: ఫేస్బుక్, పవర్‌గ్రిడ్, హోండా మోటార్స్, మహీంద్రా, అమెజాన్, డేటా 64 వంటి కంపెనీలు క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. -
ఎడ్యూ న్యూస్
ఐఐఐటీడీ అండ్ ఎంలో పీహెచ్డీ కాంచీపురంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీ అండ్ ఎం) ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సు: పీహెచ్డీ స్పెషలైజేషన్లు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. ఇంజనీరింగ్ అర్హత: మంచి అకడెమిక్ రికార్డ్‌తో ఎంఈ/ఎంటెక్/ఎండీఈఎస్ ఉత్తీర్ణత లేదా ఎంఎస్ రీసెర్చ్ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్ స్కోర్ సాధించి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అర్హత: సంబంధిత/అనుబంధ సబ్జెక్టుల్లో ఎంఎస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్/సీఎస్ఐఆర్/ఎన్బీహెచ్ఎం ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ: మే 2, 2014 వెబ్సైట్: www.iiitdm.ac.in/files/phdbro.pdf నైపర్‌లో ఫార్మా కోర్సులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్).. ఎంఎస్ (ఫార్మా), ఎంఫార్మ్, ఎంటెక్ (ఫార్మా), ఎంబీఏ (ఫార్మా), పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఫార్మా సంబంధిత కోర్సులను అందించడంలో దేశంలోనే అగ్ర స్థాయీ విద్యా సంస్థగా నైపర్‌కు పేరుంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో క్యాంపస్‌లున్నాయి. అవి.. అహ్మదాబాద్, గువహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్ఏఎస్ నగర్ (మొహాలి). ఈ సంస్థ జాతీయస్థాయిలో జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తోంది. స్పెషలైజేషన్లు: ఎంఎస్ ఫార్మా: బయోటెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడిసినల్ డివెసైస్, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ ఎనాలిసిస్, ఫార్మాస్యూటిక్స్, ట్రెడిషినల్ మెడిసిన్, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మకోఇన్ఫర్మేటిక్స్ ఎంఫార్మ్: క్లినికల్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్ములేషన్స్), ఫార్మసీ ప్రాక్టీస్. ఎంటెక్ (ఫార్మా): ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ), ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ). ఎంబీఏ (ఫార్మ్): ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ అర్హతలు: అన్ని కోర్సులకు 60 శాతం మార్కులతో బీఫార్మ్, మరికొన్ని కోర్సులకు ఎంఎస్సీ బయోలాజికల్ సెన్సైస్, లైఫ్‌సెన్సైస్/ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు జీప్యాట్/సీఎస్ఐఆర్-నెట్/గేట్ స్కోర్‌ను కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడొచ్చు. ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా, దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 12, 2014 నైపర్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్: జూన్ 8, 2014 పీహెచ్డీ (మెడిసినల్ కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాకోఇన్ఫర్మేటిక్స్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఎనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మసీ ప్రాక్టీస్, బయోటెక్నాలజీ). దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2014 వెబ్సైట్: www.niper.nic.in