ఎడ్యూ న్యూస్ | Edyu News | Sakshi
Sakshi News home page

ఎడ్యూ న్యూస్

Published Sun, Apr 13 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM

ఎడ్యూ న్యూస్

ఎడ్యూ న్యూస్

ఐఐఐటీడీ అండ్ ఎంలో పీహెచ్‌డీ
కాంచీపురంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీ అండ్ ఎం) ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

 కోర్సు: పీహెచ్‌డీ

 స్పెషలైజేషన్లు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

 ఇంజనీరింగ్ అర్హత: మంచి అకడెమిక్ రికార్డ్‌తో ఎంఈ/ఎంటెక్/ఎండీఈఎస్ ఉత్తీర్ణత లేదా ఎంఎస్ రీసెర్చ్ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్ స్కోర్ సాధించి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్

అర్హత: సంబంధిత/అనుబంధ సబ్జెక్టుల్లో ఎంఎస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్/సీఎస్‌ఐఆర్/ఎన్‌బీహెచ్‌ఎం ఉత్తీర్ణత.

 ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

 దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 దరఖాస్తులకు చివరి తేదీ: మే 2, 2014

 వెబ్‌సైట్: www.iiitdm.ac.in/files/phdbro.pdf
 
 
 నైపర్‌లో ఫార్మా కోర్సులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్).. ఎంఎస్ (ఫార్మా), ఎంఫార్మ్, ఎంటెక్ (ఫార్మా), ఎంబీఏ (ఫార్మా), పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఫార్మా సంబంధిత కోర్సులను అందించడంలో దేశంలోనే అగ్ర స్థాయీ విద్యా సంస్థగా నైపర్‌కు పేరుంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో క్యాంపస్‌లున్నాయి. అవి.. అహ్మదాబాద్, గువహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌ఏఎస్ నగర్ (మొహాలి). ఈ సంస్థ జాతీయస్థాయిలో జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తోంది.
 
స్పెషలైజేషన్లు:
ఎంఎస్ ఫార్మా: బయోటెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడిసినల్ డివెసైస్, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ ఎనాలిసిస్, ఫార్మాస్యూటిక్స్, ట్రెడిషినల్ మెడిసిన్, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మకోఇన్ఫర్మేటిక్స్
 
ఎంఫార్మ్: క్లినికల్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్ములేషన్స్), ఫార్మసీ ప్రాక్టీస్.


 ఎంటెక్ (ఫార్మా): ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ), ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ).
 
ఎంబీఏ (ఫార్మ్): ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్
 
అర్హతలు: అన్ని కోర్సులకు 60 శాతం మార్కులతో బీఫార్మ్, మరికొన్ని కోర్సులకు ఎంఎస్సీ బయోలాజికల్ సెన్సైస్, లైఫ్‌సెన్సైస్/ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు జీప్యాట్/సీఎస్‌ఐఆర్-నెట్/గేట్ స్కోర్‌ను కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడొచ్చు.
 
ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా,
 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
 
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 12, 2014

 నైపర్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్: జూన్ 8, 2014
 పీహెచ్‌డీ (మెడిసినల్ కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాకోఇన్ఫర్మేటిక్స్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఎనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మసీ ప్రాక్టీస్, బయోటెక్నాలజీ).
 
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
 
దరఖాస్తులకు చివరి తేదీ:
ఏప్రిల్ 28, 2014
 
వెబ్‌సైట్: www.niper.nic.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement