
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో చైనా రాయబారి డ్యు వీయ్ అనుమానాస్పద స్థితిలో తన నివాసంలో శవమై కనిపించారు. 57 సంవత్సరాల డ్యు వీయ్ గత ఫిబ్రవరి నెలలోనే ఇజ్రాయెల్‌లో చైనా రాయబారిగా నియమితులయ్యారు. టెల్ అవీవ్ నగరంలో తన నివాసంలో విగతజీవిగా పడిఉండటంతో.. సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మృతికి కారణాలు తెలియలేదని, అనుమానాస్పద మృతిగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. కరోనా ఆంక్షల కారణంగా వీరు చైనాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: చైనాకు మరో ముప్పు తప్పదా..!
Comments
Please login to add a commentAdd a comment