భారత వంటకాలను ఇష్టపడే విదేశీయలు ఎందరో ఉన్నారు. ఇప్పుడూ ఆ లిస్ట్‌లోకి జపాన్ వచ్చింది. సాక్షాత్తు జపాన్ అంబాసిడర్ మన భారతీయ వంటకాలను రుచి చుడటమే గాక వాటిని వండిని చెఫ్‌ని కూడా ప్రశంసలతో ముంచెత్తాడు. కచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో మీరు వంటకాలను ప్రదర్శించగలరని కితాబు కూడా ఇచ్చేశాడు. ఇంతకీ ఆయన రుచిన చూసిన వంటకం ఏంటీ? ఆ అదృష్టాన్ని దక్కించుకున్న చెఫ్ ఎవరంటే..?
భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తన సతీమణితో కలిసి ఢిల్లీలోని ప్రముఖ సరోజినీ నగర్ మార్కెట్‌ని సందర్శించారు. అక్కడ ఆలు టిక్కాను ఆస్వాదించినప్పుడూ ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీని రుచి జపాన్ రాయబారి హిరోషికి ఎంతగానో నచ్చింది. దీంతో దాన్ని తయారు చేసిన నాగాలాండ్ చెఫ్ జోయెల్ బసుమతారిని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేగాదు అతడి చేతితో తయారు చేసిన భోజనాన్ని కూడా ఆస్వాదించాడు. చాలా రుచికరంగా ఉందని మెచ్చుకోవడమే గాక భవిష్యత్తులో మంచి పాక నిపుణుడిగా పేరొస్తుందని ప్రశంసించారు.
అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. పైగా ఆ చెఫ్‌ని కూడా తన వంటకాల గురించి మాట్లాడమని కూడా చెప్పారు. ఆ చెఫ్ తాను భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈశాన్య వంటకాలను ఎలా ప్రచారం చేయాలనుకుంటున్నారో వివరించారు. మీరు చేసిన ఈశాన్య వంటకాలు చాలా రుచిగా ఉన్నాయి. కచ్చితం మీరు ఈ విషయంలో సక్సెస్ అవుతారని మెచ్చుకున్నారు జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి . అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది చూడండి.
Enjoyed wonderful dinner prepared by Nagaland’s star chef Mr. Joel Basumatari.
— Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 7, 2023
Chef Joel promotes North Eastern cuisine around the world.
Wish him great success in the future !! pic.twitter.com/FLNHWvcoex
(చదవండి: 'సైంటిస్ట్‌గా ఓ భార్యగా గెలిచింది'!..భర్త ప్రాణాలను కాపాడిన నవయుగ సావిత్రి ఆమె!)
Comments
Please login to add a commentAdd a comment