
‘సెప్టెంబర్ 25 లోపు తిరిగొచ్చేయండి’
న్యూఢిల్లీ: సౌదీ లో ఉద్యోగాలు కోల్పోయిన భారత కార్మికులంతా సెప్టెంబర్ 25 లోపు స్వదేశానికి తిరిగి రావాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కోరారు. అలాంటి వారు ఎలాంటి చార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆ తరువాత వచ్చే వారు బస, తిరుగు ప్రయాణం వంటి ఏర్పాట్లు సొంతంగా చేసుకోవాల్సి ఉంటుందని సుష్మా తన ట్విటర్‌లో స్పష్టం చేశారు.
సౌదీలో కంపెనీలు మూసివేయడంతో వేల మంది భారత కార్మికులు ఉద్యోగాలు పోయి, పాత బకాయిలు రాక అక్కడ తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంకా అక్కడ వేచివుండటంలో అర్థం లేదని, వెంటనే స్వదేశానికి వచ్చేయాలని కార్మికులకు సుష్మ విజ్ఞప్తి చేశారు.