న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల వార్షిక సదస్సుకు ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారని విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. 9న వర్చువల్ విధానంలో జరగనున్న ఈ సదస్సులో భారత్ నుంచి ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో పాల్గొననున్నారు. ‘అంతర్గత సహకారం’ అనే అంశం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో అఫ్గానిస్తాన్ వ్యవహారం కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని భారత్‌లో రష్యా రాయబారి నికోలే కుదాషెవ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment