
ప్యాంగ్యాంగ్: తమ దేశంలో కరోనా నియంత్రణలోనే ఉందని, పరిస్థితులు సురక్షితంగా ఉన్నాయని ఉత్తర కొరియాకు చెందిన అమెరికా రాయబారి కిమ్ సోంగ్ బుధవారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. కరోనాకుం సంబంధించిన వివరాలు, సూచనలు కిమ్ సోంగ్ లైవ్ ద్వారా వివరించడం గమనార్హం. మహమ్మారి కాలంలో విదేశీయులెవరినీ తమ దేశంలోకి రానివ్వలేదని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందిగా అత్యున్నత అలర్ట్ ఇచ్చినట్లు వెల్లడించారు. (చదవండి: కరోనా కట్టడికి ఉ.కొరియా షూట్ ఎట్ సైట్)
ఆయా నిబంధనలు పాటించకపోతే సహించబోయేది లేదని కిమ్ ప్రభుత్వం చెప్పిందని అన్నారు. దీనికి సంబంధించి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పాలక పార్టీ సభ్యులతో మంగళవారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది. అందులో ప్రధానంగా యాంటీ వైరస్ క్యాంపెయిన్‌పై చర్చించినట్లు పేర్కొంది. ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా రాలేదని ఆ దేశం చెబుతుండగా, విదేశీ నిపుణులు దాన్ని కొట్టిపారేస్తున్నారు. (చదవండి: దక్షిణ కొరియా అధికారిపై కాల్పులు : కిమ్ క్షమాపణ)
Comments
Please login to add a commentAdd a comment