
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఆయన కుటుంబసభ్యులు, ఆదేశ సీనియర్ అధికారులు, నేతలపై చైనా కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగం చేసినట్లు సమాచారం. వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ ది నేషనల్ ఇంట్రెస్ట్ థింక్ ట్యాంక్‌లో ఉత్తర కొరియా వ్యవహారాల నిపుణుడు హారీ కజియానిస్ ఈ విషయంతెలిపారు. జపాన్‌కి చెందిన ఇంటెలిజెన్స్ వార్తల ఆధారంగా ప్రయోగాత్మక కరోనా వైరస్ వ్యాక్సిన్‌ని కిమ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు అందించినట్లు ఆయన తెలిపారు.
ఆ వ్యాక్సిన్‌ని ఏ కంపెనీ సరఫరా చేసింది? అది ఎంత సురక్షితమైనది స్పష్టంగా తెలియదని ఆయన అన్నారు. చైనాకు చెందిన మూడు కంపెనీలు సినోవాక్ బయోటెక్ లిమిటెడ్, కాన్‌సినోబయో, సినోఫ్రాం గ్రూప్ కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ని అభివృద్ధి పరుస్తున్నాయని కజియానిస్ తెలిపారు. ఇప్పటికే చైనాలో పది లక్షల మందికి వ్యాక్సిన్ అందజేసినట్లు సినోఫ్రాం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment