ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిపై చైనాలో దాడి జరిగింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుల చేసింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్ దౌత్యవేత్తను కత్తితో పొడిచినట్లు తెలిపింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చిక్సి అందిస్తున్నారని.. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొంది.
అయితే ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడికి గల కారణాలు తెలియరాలేదు. దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఎవరూ ఏ విధమైన ప్రకటన చేయలేదు. బీజింగ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో కాకుండా మరోచోట ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఓ వైపు హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇజ్రాయిలీలు, యూదులు అలెర్ట్‌గా ఉండాలని సూచించింది.
ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడి ఇజ్రాయెల్, చైనా మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసింది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడులను చైనా ఖండించకపోవడంపై బీజింగ్‌లోని ఇజ్రాయెల్ రాయబారి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ప్రస్తుతం యుద్ధ పరిణామాల పట్ల చైనా వైఖరికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
చదవండి: తల్లి కడుపు చీల్చి మరీ.. వెలుగులోకి హమాస్ అరాచకాలు
మరోవైపు వారం రోజులుగా గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గాజా సరిహద్దు వెంట ఇజ్రాయెల్‌లోకి చొరబడి కాల్పులు జరుపుతున్న హమాస్ ఉగ్రవాదులపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. బాంబ్, వైమానిక దాడులతో విరుచుపడుతోంది. ఇప్పటి వరకు 6 వేల బాంబులను గాజాపై ప్రయోగించింది. గాజాస్ట్రిప్‌లోని ఇళ్ల కింద ఉన్న టన్నెల్స్‌లో హమాస్ టెర్రరిస్టులు దాక్కుడటంతో ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది.
24 గంటల్లో సిటీ వదిలి దక్షిణం వైపు వెళ్లాలని, ఉగ్రవాదులకు దూరంగా ఉండాలని గాజా పౌరులకు ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఆశ్రయం పొందుతున్న వారికి కూడా హెచ్చరికలు జారీ చేసిందిమరోవైపు ఆహారం, ఇంధనం, నీరు, కరెంట్ నిలిపివేయడంతో గాజాలో పరిస్థితి అధ్వానంగా మారింది. అయితే ఇజ్రాయెల్ ఆదేశాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళ వ్యక్తం చేసింది. పౌరుల తరలి వెళ్లాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది.
చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో ఇజ్రాయెల్ పౌరులు, విదేశీ బందీల మృతి
Comments
Please login to add a commentAdd a comment