ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. అక్కడ సామాన్యులకే కాదూ.. వీవీఐపీలకు అక్కడ రక్షణ లేకుండా పోయింది. తాజాగా, పాక్ మాజీ దౌత్యవేత్తగా కుమార్తెను కొంత మంది దుండగులు అతికిరాతకంగా హతమార్చారు. ప్రస్తుతం ఈ వార్త దేశంలో సంచలనంగా మారింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన శౌకత్ ముకద్దమ్ గతంలో దక్షిణ కొరియా, కజికిస్తాన్‌లకు దౌత్యావేత్తగా పనిచేశారు.
ఈ క్రమంలో కొంత మంది దుండగులు.. ఆయన కుమార్తె నూర్ ముకద్దమ్‌ను కిడ్నాప్‌చేసి అతి దారుణంగా చంపేశారు. ఆమె మృతదేహన్ని ఇస్లామాబాద్‌లోని ఎఫ్ 4 సెక్టార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. దీంతో, పాక్ పోలీసులు ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, కుటుంబ సభ్యులు ఈ హత్య కేసులో ఆమె మిత్రుడిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జహీర్ జఫ్పర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటనతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
కొన్ని రోజుల క్రితమే.. పాక్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్తగా పనిచేసిన నజిబుల్లా అలిఖిల్ కుమార్తె సిల్‌సిలా అలిఖిల్‌ను ఇస్లామాబాద్‌లో దుండగులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైనా సిల్‌సిలా.. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటుంది. ఈ చర్యలను పలుదేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తక్షణమే దీనివెనుక ఉన్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. పాక్ మద్దతుతోననే తాలిబన్లు దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని పలుదేశాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment