బీజింగ్ : చైనాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ఆయన ఇవాళ టియాంజిన్ నుంచి బీజింగ్ నగరానికి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. బుల్లెట్ రైళ్లు, హైస్పీడు రైళ్ల సర్వీసుల్ని అధ్యయనం చేయడానికి బీజింగ్‌కు బుల్లెట్ రైలులో ప్రయాణించిన చంద్రబాబు అమరావతి-విశాఖ, అమరావతి-హైదరాబాద్ మార్గాల్లో బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలపై పరిశీలన చేశారు.
టియాంజిన్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో వున్న బీజింగ్ నగరానికి ముఖ్యమంత్రి కేవలం 31 నిమిషాలలో చేరుకున్నారు. కాగా చైనాలోని బుల్లెట్ రైళ్లు గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అనంతరం బుల్లెట్ రైళ్ళను పరిశీలించిన అనంతరం చంద్రబాబునాయుడు గుయాన్ వెళ్లారు. చంద్రబాబుతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. కాగా బుల్లెట్ ట్రయిన్లో ప్రయాణం చేయడం ఓ మధురానుభూతి అని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు.
Elated at the experience of travelling in a Bullet train from Tianjin to Beijing. A memorable experience. #ChinaTrip pic.twitter.com/flyZtuJ80H
— N Chandrababu Naidu (@ncbn) 28 June 2016