China tour
-
ఒక్కరి కోసం రెండు విమానాలు.. అదే వెరైటీ..
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్ హిప్కిన్స్ చైనా పర్యటనలో భాగంగా తన అధికారిక బృందంతో కలిసి రెండు విమానాల్లో బయలుదేరి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ మిత్రదేశమైన చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ తన ప్రతినిధుల బృందంతో కలిసి బయలుదేరారు. అయితే వారంతా ఒక బోయింగ్ 757 విమానంలో వెళుతుండగా వెనుక మరో విమానాన్ని కూడా తమ వెంట తీసుకుని వెళ్లారు. అది ప్రస్తుతం ఫిలిపీన్స్ లోని మనీలా వరకు వారితో పాటు వెళ్ళింది. ఈ నేపథ్యంలో వెల్లింగ్టన్ వర్గాలు దీనిపై వివరణ ఇచ్చాయి. అతిపెద్ద వ్యాపార భాగస్వామి అయిన చైనాతో జరగబోయే చర్చలు ప్రయోజనకరంగా సాగాలని దూరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఒక వేళ ఒక విమానంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయంగా రెండో విమానం ఉపయోగపడుతుందని ఈ విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ బోయింగ్ 757 విమానాలు 30 ఏళ్ల నాటివి. వాటి సర్వీసు ముగింపు దశకు వచ్చింది. 2028 లేదా 2030లో వాటిని మార్చే అవకాశముందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల నాయకులు న్యూజిలాండ్ ప్రధానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదేదో ఒక ఫోన్ చార్జర్ పని చేయకపోతే ఇంకో చార్జర్ వెంట తీసుకుని వెళ్ళినట్టుందని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వెయ్యి ఏళ్ల నాటి మసీదు సందర్శించిన మోదీ.. ప్రత్యేకత ఏంటంటే.. -
చైనాకు వెళ్లకండి..
ఢిల్లీ: చైనాలో ప్రమాదకర ‘నావల్ కరొనా’ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో చైనా వెళ్లే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాక చైనా నుంచి తిరిగివస్తున్న యాత్రికులను కేంద్ర ఆరోగ్య శాఖ థర్మల్ స్కానర్లతో పరీక్షిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల విమానాశ్రయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. చైనాలో ఈ వైరస్ 41 మందికి సోకగా, ఒకరు మృతి చెందారని ఆదేశం ఈ నెల 11న ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ లేనప్పటికీ చైనాలో ఒకరి నుంచి ఒకరికి దగ్గు, తుమ్ముల ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతోందని గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో కలసి నియంత్రణ కోసం కృషి చేస్తోందని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రీతి సుడాన్ చెప్పారు. ఇవీ జాగ్రత్తలు.. ఈ వైరస్ గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ కొన్ని జాగ్రత్తలను కేంద్రం సూచిస్తోంది. పొలాలకు, జంతుశాలలకు, జంతువధ స్థానాలకు వెళ్లవద్దని తెలిపింది. మాంసానికి దూరంగా ఉండాలని, ఒకవేళ తినాల్సి వస్తే బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాల్సిందిగా సూచించింది. -
మమత చైనా పర్యటన రద్దు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి నిమిషంలో తన చైనా పర్యటనను రద్దుచేసుకున్నారు. ఉన్నతస్థాయి నేతలతో రాజకీయ సమావేశాలకుచైనా ప్రభుత్వం అంగీకరించకపోవడంతోనే ఈ భేటీ రద్దు చేసుకున్నట్లు మమత వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం మమత తన బృందంతో కలిసి ఎనిమిదిరోజులపాటు చైనాలో పర్యటించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి వీరంతా బీజింగ్ బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భారత్, చైనా ప్రభుత్వాల ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ పర్యటనను నిర్ధారించారు. అయితే.. చైనా విదేశాంగ మంత్రి సాంగ్ తావో మినహా ఇతర సీనియర్ రాజకీయ నాయకులతో మమత భేటీకి చైనా ప్రభుత్వం అంగీకరించకపోవడంతో చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దయింది. -
చైనా అధ్యక్షుడితో ఉత్తర కొరియా నియంత కిమ్
-
అణు నిరాయుధీకరణకు ఓకే
వాషింగ్టన్/బీజింగ్: ఉత్తరకొరియాలో అణు నిరాయుధీకరణకు సమ్మతంగా ఉన్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం నేపథ్యంలో కిమ్ రహస్య చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రోజుల ఉత్కంఠ అనంతరం కిమ్ బీజింగ్ పర్యటనకు వచ్చి, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపారని చైనా అధికార మీడియా జిన్హువా వెల్లడించింది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆదివారం నుంచి బుధవారం వరకు బీజింగ్‌లో కిమ్ ‘అనధికార పర్యటన’సాగించినట్లు పేర్కొంది. తన భార్యతో కలసి నాలుగు రోజుల పర్యటనకు బీజింగ్ వెళ్లిన కిమ్‌కు చైనా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. ఆద్యంతం రహస్యంగా సాగిన ఈ పర్యటన వివరాలను కిమ్ ఉత్తర కొరియాకు వెళ్లిన తర్వాతే జిన్హువా వెల్లడించింది. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ భవనంలో జిన్‌పింగ్, కిమ్‌లు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను వీరు గుర్తు చేసుకున్నారు. తాను కొరియా ద్వీపకల్పంలో అణ్వాయుధాలు లేకుండా చేస్తానని కిమ్ స్పష్టం చేశారు. కాగా, ఉత్తర కొరియాలోని అణ్వాయుధాలను వదిలిపెట్టేందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు ఇదే మంచి అవకాశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరలో కిమ్‌తో సమావేశమయ్యేందుకు ట్రంప్ అంగీకరించిన విషయం తెలిసిందే. -
‘గురుకుల’ సవరణ నోటిఫికేషన్ ఆలస్యం!
⇒ చైనా పర్యటన నుంచి మంత్రులు తిరిగి వచ్చాకే అర్హతలపై నిర్ణయం ⇒ ఈ నెల 21 తరువాతే తదుపరి చర్యలు ⇒ నెలాఖరుకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన సవరణ నోటిఫికేషన్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. చైనా పర్యటనకు వెళ్లిన మంత్రులు తిరిగి వచ్చాకే.. నోటిఫికేషన్లో విద్యార్హతలు, మార్కుల శాతం, వయో పరిమితి తదితర అంశాలపై తుది నిర్ణయం వెలువడనుంది. ఆ లోగా నోటిఫికేషన్లో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించిన నివేదికను సిద్ధం చేయాలని సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. కొనసాగుతున్న కసరత్తు.. గురుకులాల్లోని టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ నోటి ఫికేషన్లో.. అభ్యర్థులు డిగ్రీ, పీజీల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్న విషయం తెలిసిం దే. అది 50 శాతం మార్కులుంటే చాలన్న జాతీయ ఉపా ధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలకు విరుద్ధ మంటూ అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీనిపై జోక్యం చేసుకున్న సీఎం కేసీఆర్.. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే అర్హతలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లో మార్పులు, చేర్పులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ వర్తించదా?.. ప్రస్తుతం మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే గురుకుల నోటిఫికేషన్ కూడా జారీ అయింది. కానీ ఈ నోటిఫికేషన్‌కు ఎన్నికల కోడ్ వర్తించదని.. టీచర్లకు సంబంధించిన ఎన్నికలకు, కాబోయే టీచర్లకు సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈసారి ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు. వీళ్లంతా గురుకుల టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధ మయ్యారు. దీంతో ఎన్నికల సమయంలో టీచర్ పోస్టుల నోటిఫికేషన్ ద్వారా నేరుగా ప్రయోజనం కల్పించినట్లు అవు తుందని, ఇది ఎన్నికల్ కోడ్ పరిధిలోకి వస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విదేశ పర్యటన నుంచి మంత్రులు తిరిగొచ్చాక, దీనిపై చర్చించాలని భావిస్తున్నారు. వయో పరిమితి సడలించండి.. అర్హతలు, నిబంధనలు, వయో పరిమితి తదితర అంశాలకు సంబంధించి ఉపాధ్యాయ అభ్యర్థులు మంగళవారం ప్రభు త్వ సీఎస్ ఎస్పీ సింగ్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. టీచర్ పోస్టులకు ప్రభుత్వం ఇచ్చిన పదేళ్ల ప్రత్యేక మినహా యింపు కాకుండా సాధారణ గరిష్ట వయోపరిమితి 39 ఏళ్లు గా ఉందని.. కానీ గురుకుల నోటిఫికేషన్లో 34 ఏళ్లుగానే పరిగణనలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. గరిష్ట వయో పరిమితిని 39 ఏళ్లకు పెంచాలని, కనీసం రెండేళ్ల సడలింపు ఇస్తే అనేక మందికి ప్రయోజనం చేకూరుతుందని విజ్ఞప్తి చేశారు. మరోవైపు డిగ్రీ, డీఎడ్ కలిగిన అభ్యర్థులకు టీజీటీ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. విదేశీ పర్యటనలో మంత్రులు మరోవైపు విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగ దీశ్రెడ్డిలు చైనా పర్యటనకు వెళ్లారు. గురుకుల నోటిఫి కేషన్లో ఎస్సీ గురుకులాలతో పాటు విద్యాశాఖ పరిధి లోని గురుకులాల పోస్టులు కూడా ఉన్నాయి. దీంతో మంత్రులు ఈ నెల 21న తిరిగి వచ్చాకే విద్యార్హతలు, ఇతర నిబంధనలపై నిర్ణయం తీసుకోనున్నారు. సంబం« దిత ఫైలుపై గురుకులాలకు సంబంధించిన అన్ని శాఖల మంత్రులు సంతకాలు చేశాక.. సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపుతారు. సీఎం ఆమోదం అనంతరం టీఎస్పీఎస్సీకి ఉత్తర్వులు వెళ్తాయి. తర్వాత నాలుగైదు రోజులకు టీఎస్పీఎస్సీ సవరణ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలాఖరున సవరణ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. -
తుగ్లక్ గుర్తుకొస్తుండు!
కేసీఆర్ పాలనపై కోమటిరెడ్డి విసుర్లు చౌటుప్పల్: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు, పాలన చూస్తుంటే పిచ్చి తుగ్లక్ గుర్తుకొస్తున్నాడని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.10 కోట్లతో బస్సు కొన్నారని, రంగు బాగోలేదని రూ.5 కోట్లు ఖర్చు చేసి కార్లు మార్చారని, చైనా పర్యటన కోసం ప్రత్యేక విమానమే తీసుకెళ్లారని ఇవన్నీ చూస్తుంటే తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు. సచివాలయాన్ని కూలగొట్టి రూ. వెయ్యి కోట్లతో మళ్లీ నిర్మిస్తామని, ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవనం కడతామనడం శోచనీయమని పేర్కొన్నారు. వాస్తు పేరుతో ఎన్ని వేషాలు వేసినా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవలేరన్నారు. మాటలతో గారడి చేయడం కేసీఆర్‌తోపాటు ఆయన కూతురు, కుమారుడు, మేనల్లుడికి దేవుడిచ్చిన వరమని ఎద్దేవా చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే ముఖ్యమంత్రి ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. రైతులను భిక్షగాళ్లుగా మారుస్తున్నారని చెప్పారు. దొరల పాలన అంతమయ్యే రోజు త్వరలోనే ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లతో కాంగ్రెస్ రైతురాజ్యం రాబోతుందని జోస్యం చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకంతో ప్రతి పేద కుటుంబానికి ఉచిత వైద్యం అందించారని, ఈ పథకాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోరుుందని పేర్కొన్నారు. -
ఉదయం హనోయ్.. రాత్రి హంగ్ఝౌలో
హంగ్‌ఝౌ: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు వెళ్లారు. వియత్నాంలో రెండురోజుల పర్యటనను శనివారం ముగించుకున్న మోదీ హనోయ్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి చైనాలోని హంగ్‌ఝౌ నగరానికి చేరుకున్నారు. మోదీకి చైనా ఉన్నత స్థాయి బృందం స్వాగతం పలికింది. చైనా పర్యటనలో మోదీ ఆదివారం ఉదయం ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వ విషయం సహా పలు కీలక విషయాలపై సంప్రదింపులు జరపనున్నారు. గత మూడు నెలల్లో మోదీ, జీ సమావేశం కావడమిది రెండోసారి. గత జూన్‌లో వీరిద్దరూ తాష్కెంట్లో సమావేశమయ్యారు. చైనాలో మోదీ ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, బ్రిటన్, అర్జెంటీనా దేశాధినేతలతో భేటీకానున్నారు. -
చైనాలో దత్తన్న బిజీ బిజీ..
కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ చైనాలో బిజీ బిజీగా ఉన్నారు. జి 20 దేశాల కార్మిక శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు ఆయన చైనా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చైనాలోని వివిధ ప్రాంతాలను కూడా సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, షాంఘై టెంపుల్ తదితర ప్రాంతాలను ఆయన చూశారు. -
అందరికీ శిరోభారంగా అవినీతి ‘బాబు’
రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైనా పర్యటన వివరాలు తెలుపుతూ మీడియా సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా (తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులను ఉద్దేశించి) ‘‘నాకు లేదా నోరు’’ అని డాంబికంగా సమాధానం చెప్పారు. ఈ మాట వినగానే, మర్నాడు పేపర్లలో చదవగానే రాష్ర్ట ప్రజలకు మాత్రం ‘‘అవును! చంద్రబాబుకు నోరు మూతపడింది’’ అనే భావన స్ఫురించింది. ‘‘ఓటుకు కోట్లు కేసు’’లో ప్రత్యక్షంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి కొంత కాలం మేకపోతు గాంభీర్యం నటించినా తెలంగాణ సీఎం చేతిలో కీలుబొమ్మగా మారాల్సిన దుస్థితికి దిగజారారని ప్రజ లందరికీ తెలుసు. కేసీఆర్ పెట్టిన డిమాండ్లకు తలొగ్గిన చంద్రబాబు ఆగమేఘాలమీద హైదరాబాద్ నుంచి అమరావతికి విధిలేక మకాం మార్చేశారని అందరూ భావిస్తున్నారు. మరోవైపు బాబు రెండేళ్ల పాలనలో అవినీతి, దోపిడీ విచ్చలవిడిగా, బాహాటంగా సాగిపోతుందని తనకు మిత్రపక్షమైన కొందరు బీజేపీ నేతలే ఢిల్లీకి బాబు అవినీతిపై కట్టలుకట్టలుగా నివేదికలు అందజేశారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. తనది మచ్చలేని చరిత్ర అని బాబు ప్రతి వేదికపైనా సొంతడబ్బా కొట్టుకుంటున్నప్పటికీ ఇటీవల ‘‘నేషనల్ కౌన్సెల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్’’ (ఎన్.సి.ఎ.ఇ.ఆర్.) జరిపిన సర్వేలో అవినీతిలో ఏపీ రాష్ర్టం మొదటి స్థానంలో ఉందని చెప్పింది. బాబు ప్రభుత్వం చేసుకుం టున్న వ్యాపార ఒప్పందాల్లో అధిక శాతం అవినీతిమయమేనని ఈ సర్వే అభిప్రాయ పడింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం ఇప్పటికే ప్రపంచంలోని తెలుగువారందరికీ చేరిపోయింది. బాబు అటు కేంద్ర ప్రభుత్వం ముందు ఇటు తెలంగాణ ప్రభుత్వం ముందు చేతులు ముడుచుకుని, నోరు మూసుకుని ఉండాల్సిన దుస్థితి తలె త్తిందని రాష్ర్టంలోని ప్రతి ఒక్కరికి అర్థ మవుతూనే ఉంది. బాబు నిస్సహాయత వ్యక్తిగతమైనదైతే ఎవరైనా జాలిపడి వదిలివేయవచ్చు లేదా నిస్సహాయత వలన కలిగే నష్టం ఆయనకే పరిమితమైతే కూడా టీడీపీ శ్రేణులు సహనంతో భరించు కోవచ్చు. కానీ బాబు నిస్సహాయత, అవినీతి బందిఖానాలో చిక్కుకున్న చేతకానితనం, ఫలితంగా నోరు మూత పడాల్సిన స్థితి కోట్లాది ప్రజల ప్రయోజనాలకు భంగకరమైన ప్పుడు కచ్చితంగా ఈ అంశాన్ని చర్చించాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తుతోంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అటు మోదీతో ఇటు కేసీఆర్‌తో పోరాడలేని దుస్థి తికి చేరిన బాబు నాయకత్వం గురించి టీడీపీ శాసనసభా పక్షం అంతర్గతంగా సమీక్షించు కోవడం మంచిదనిపిస్తుంది. టీడీపీ శ్రేణులకు ఈ మాట ఊహించడానికే కొంత ఇబ్బం దిగా అనిపించినా విశాల రాష్ర్ట ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమర్థుడైన, నీతిమంతుడైన మరొక టీడీపీ నేతను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుని సీఎం బాధ్యతలను అప్పగిస్తే రాష్ట్రానికి, టీడీపీకి కూడా మంచి జరుగుతుందని నా సలహా. ప్రత్యక్షంగా, పరోక్షంగా బాబు కారణంగా రాష్ర్ట ప్రజల హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు, రాష్ర్ట ప్రయోజ నాలు దెబ్బతింటున్నప్పుడు ముఖ్యంగా ఆంధ్రుల ఆత్మగౌరవానికి భంగం ఏర్పడుతున్న ప్పుడు టీడీపీ, బాబులాంటి నోరు మూతపడిన నాయకుడి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడపడం చారిత్రక తప్పిదమవుతుంది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది సీనియర్ నేతలు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వీరిలో కొందరు సమర్థులు, నిజాయితీపరులు కూడా ఉన్నారు. అవినీతిలో బందీకాని నేతలు ఇప్పుడు రాష్ట్రానికి ఎంతో అవసరం. అలాంటి వారు మాత్రమే అటు కేంద్రంతోనూ, ఇటు పక్క రాష్ర్టంతోనూ రాజీ లేకుండా పోరాడి రాష్ర్ట ప్రయోజనాలను కాపాడగలరు. కనుక రాష్ర్ట ప్రయోజనాల కోసం టీడీపీ శాసనసభా పక్షం సమిష్టిగా తమ ముఖ్యమంత్రి మార్పు విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి ఎంతో మంచి జరుగుతుంది. రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. దీన్ని కేంద్రం నుంచి సాధించాల్సిన ముఖ్యమంత్రి చైనా ప్రైవేట్ కంపెనీతో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నామని చెబుతుంటే ఆయన సామర్థ్యం కేంద్రంవద్ద ఏవిధంగా ఉందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. సుమారు రూ. 5 లక్షల కోట్ల విలువ చేసే ప్రయోజనాలు పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచినప్పటికీ వీటిని కనీసంగా కూడా సాధించుకోలేని బాబు నాయకత్వంలోని టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో కొనసాగడంవల్ల కానీ, రాష్ర్ట సీఎంగా చంద్రబాబు బాధ్యతలు నడపడంవల్లగానీ ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఏమీ కలగదు. తమ స్వప్రయోజనాల కోసం, అవినీతిని యథేచ్ఛగా కొనసాగించుకునేందు కోసం ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా తాము పాలన సాగించుకుంటామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. వ్యాసకర్త అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 8297199999 - ఎన్. రఘువీరారెడ్డి -
'బాబు పాలనంతా అవినీతిమయం'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి ఎన్ చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ నిప్పులు చెరిగారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే అక్కడ పోర్టు ఏర్పాటు చేసేందుకు చైనా వారికి అనుమతి ఇస్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్క దేశాల్లో తాకట్టు పెడతారా ? అని చంద్రబాబును వేణుగోపాలకృష్ణ నిలదీశారు. ఇది అంతర్గత భద్రతకు ముప్పు కాదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరిని ఈ సందర్భంగా ఆయన ఖండించారు. ఏపీలోని సహజ వనరులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని చంద్రబాబుకు వేణుగోపాలకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసమే పోరాడుతున్నారని విమర్శించారు. విదేశీ పర్యటనల వల్ల ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని చంద్రబాబును వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనంతా అవినీతిమయం అంటు వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన చైనా పర్యటనపై శుక్రవారం సాయంత్రం విజయవాడలో మాట్లాడిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని వేణుగోపాలకృష్ణ అన్నారు. -
పెట్టుబడుల కోసమే చైనా పర్యటన: చంద్రబాబు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన శుక్రవారం చైనా పర్యటన గురించి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వివరించారు. పెట్టుబడులు ఆకర్షించేందుకే తాను చైనా వెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు. చైనాలో పర్యటించడం ఇది రెండోసారని, విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. సంస్కరణలతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ముందుగా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాల్సి వుందన్నారు. రాష్ట్రాభివృద్ధి గురించి తాను నిరంతరం ఆలోచిస్తున్నానని ఆయన తెలిపారు. ఇప్పటికీ ప్రపంచంలో ఆంద్రప్రదేశ్ అంటే హైదరాబాద్ అనే అనుకొంటున్నారన్నారు. పదేళ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారని, అయితే పది సంవత్సరాలు హైదరాబాద్‌లో వుంటే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. మనకంటే 13ఏళ్ల ముందే చైనా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని చంద్రబాబు తెలిపారు. అక్కడ పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించిందని, అందుకే చైనాను మన రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామి చేయాలని చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాలమైన రహదారులు, స్పీడ్ రైళ్లు, అత్యుత్తమ పోర్టుల్లో చైనానే ముందుందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోని వేగవంతమైన రైళ్లలో 60శాతం చైనాలోనే ఉన్నాయన్నారు. 60 అంతస్తుల భవనాన్ని నెల రోజుల్లో కట్టిన సాంకేతికత చైనాకు సొంతమని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే 500 చైనా కంపెనీలు దేశంలో ఉన్నాయన్నారు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే... చైనా పర్యటన గురించి వివరిస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది...భూగర్భజలాలు ఎంతమేర వున్నాయి, ఎంత వర్షపాతం నమోదైంది వంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా తెలుసుకోగలిగానని... ఎందుకంటే టెక్నాలజీనే తన బెస్ట్ ఫ్రెండ్ అని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. టెక్నాలజీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నట్లు చెప్పారు. టెక్నాలజీతో భవిష్యత్‌లో విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన ఎల్ఈడీ బల్బులు, ఫైబర్ గ్రిడ్, సోలార్ పంపు సెట్లు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. గ్రీన్ ఫీల్డ్ కేపిటల్ కట్టే మహత్తర అవకాశం మన రాష్ట్రానికే దక్కిందన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలు దొనకొండలో పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నిస్తున్నానని, దొనకొండలో రూ.44 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకొచ్చాయని చంద్రబాబ తెలిపారు. కాగా తాను ఎవరితోనూ విభేదాలు పడదలచుకోలేదని, సయోధ్యగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్, అమరావతి రెండు బావుండాలన్నారు. తన శక్తిసామర్ధ్యాలను రాష్ట్రాభివృద్ధి కోసమే వినియోగిస్తానని, విభేదాలు, విమర్శల కోసం కాదని ఆయన అన్నారు. పక్క రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలనే కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. జల సమస్యల పరిష్కారం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. ఇక హైకోర్టు ఐకాన్ భవనం అనుకున్నామని, అందుకే కొంత సమయం పడుతుందన్నారు. -
పర్యాటకంలో భారీ పెట్టుబడులకు వీలు
- రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తే సదుపాయాలు కల్పిస్తాం - గిజో-ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఐదు రోజుల చైనా పర్యటన ముగిసింది. గురువారం రాత్రి 11.20 గంటలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబుకు కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేశ్, ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు స్వాగతం పలికారు. చంద్రబాబు శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమవనున్నారు. కేంద్రమంత్రి ఉమాభారతిని కూడా సీఎం కలవనున్నారు. కాగా చైనా పర్యటన చివరిరోజైన గురువారం సీఎం చంద్రబాబు.. గిజో-ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో ప్రసంగించారు. ఏపీ పర్యాటక రంగంలో ప్రస్తుతం 5.2 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులకు అవకాశాలున్నాయని చెప్పారు. ఏపీలో పరిశ్రమలు స్థాపిస్తే సదుపాయాలు కల్పిస్తామన్నారు. చైనా పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈవోలు ఏపీలో పర్యటించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశమున్న రంగాలు, రాష్ట్ర సానుకూలతలు, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. చైనాతో ఆరు ఒప్పందాలు చైనా పర్యటనలో భాగంగా అక్కడి ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలతో రాష్ట్రప్రభుత్వం ఆరు ఒప్పందాలు చేసుకుంది. పవ ర్ చైనా గిజో ఇంజనీరింగ్ కార్పొరేషన్‌తో జరిగిన ఒప్పందం ఇందులో ఒకటి. ఏపీలో రానున్న పదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, విద్యుదుత్పత్తి, ప్రసారం, పారిశ్రామికాభివృద్ధి రంగాల్లో ఈ సంస్థ పెట్టుబడులు పెడుతుంది. కాగా రాజధాని అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, నిర్మాణ పరిశ్రమ అభివృద్ధికి సహకారమందించడంపై చైనా స్టేట్ కన్స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి సహకారంపై సౌత్ హ్యూటన్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. మరోవైపు రాష్ర్టంలో నిర్మించనున్న బిల్డింగ్ మెటీరియల్ మాన్యుఫాక్చర్ పార్క్ నిర్మాణంలో ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టేందుకు గిజో చాంగ్ తైయువాన్ ఎనర్జీ సేవింగ్ బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ లిమిటెడ్ ముందుకొచ్చింది. భవన నిర్మాణరంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానమందించేలా ఎసెడ్రిల్స్ రాక్ టూల్స్ కంపెనీ లిమిటెడ్‌తో, రాష్ట్రంలో ఏర్పాటయ్యే పారిశ్రామిక పార్కుల్లో పెట్టుబడులు పెట్టేలా గిజో మారిటైమ్ సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నేడు అరుణ్‌జైట్లీతో సీఎం భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో జరిపే సమావేశంలో రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, రెవెన్యూ లోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధులు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు నిధుల విడుదల అంశాలపై చర్చించనున్నారు. సీఎం సమావేశం సందర్భంగా రెవెన్యూలోటు భర్తీ కింద మరో రూ.500 కోట్లు విడుదల చేయనున్నట్లు జైట్లీ ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి అదనంగా మంత్రి పదవుల కేటాయింపుల అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు రావచ్చని టీడీపీ వర్గాల సమాచారం. అయితే ఈసారికి కేంద్రమంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి అవకాశం దొరకకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. -
చైనాలో చంద్రబాబు నాలుగో రోజు పర్యటన
గియాన్: చైనాలో చంద్రబాబు నాయుడు పర్యటన నాలుగో రోజుకు చేరింది. బుధవారం ఉదయం ఆయన గిజో ప్రావిన్స్‌లోని గియాన్ నగరంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన వివిధ కార్యక్రమాల్లో తన బృందంతో కలసి పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు గిజో ప్రావిన్స్ వైస్ గవర్నర్ క్విన్ రు పీ తో భేటీ అయ్యారు. అనంతరం చైనా దేశ పర్యటనలో భాగంగా గిజో ప్రావిన్స్ సెక్రటరి సన్జిగాంగ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తమ రాష్ట్రంలో అడుగుపెట్టిన చంద్రబాబు బృందానికి....సన్జిగాంగ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇరు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణానికి సహకరించాలని చంద్రబాబు అభ్యర్ధించారు. ఏపీలో ఉన్న వనరులు, పారిశ్రామిక అవకాశాల గురించి వివరించారు. భారత్ పర్యటనకొచ్చినప్పుడు తప్పనిసరిగా తమ రాజధానిని సందర్శించాలని కోరారు. ఐటీ, ఫార్మా రంగాల్లో గిజో ప్రావిన్స్‌కు సహకారం అందిస్తామని పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో తమతో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు ప్రతిపాదించారు. గిజో ప్రావిన్స్, ఏపీ మధ్య సోదర సంబంధాల కోసం రెండు ప్రభుత్వాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తర్వాత వైస్ గవర్నర్ గిజో ప్రావిన్స్ ప్రభుత్వ నిర్మాణం, పాలనా విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న తపన తమ దృష్టిని ఆకర్షించిందని, ఏపీ అభివృద్ధిలో తమవంతు సహకారం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు
- చైనాలో సీఎం బృందం పరిశీలన - టియాంజిన్ నుంచి బీజింగ్ వరకు ప్రయాణం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. చైనా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మంగళవారం టియాంజిన్ నుంచి బీజింగ్‌కు బుల్లెట్ రైలులో ప్రయాణించినట్లు హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బుల్లెట్ రైలులో సీఎంతో పాటు మంత్రి యనమల రామకృష్ణుడు, మౌలిక సదుపాయాల కల్పన ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులు ప్రయాణించారు. అమరావతి- విశాఖపట్నం, అమరావతి- హైదరాబాద్ మధ్య బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టే అవకాశాలపై టియాంజిన్ నుంచి బీజింగ్ మధ్య 140 కిలోమీటర్లను 31 నిమిషాల్లో ప్రయాణించి పరిశీలించారు. బీజింగ్ నుంచి గుయాన్ చేరుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక పోవడంతో సీఎం ఏడున్నర గంటలు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. పీవీకి నివాళులు: చైనా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో పీవీ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడితే తాను సీఎంగా వాటిని కొనసాగించానని తెలిపారు. ఢిల్లీలో పీవీ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. -
చైనాలో చంద్రబాబు బుల్లెట్ ట్రైన్ జర్నీ
బీజింగ్ : చైనాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ఆయన ఇవాళ టియాంజిన్ నుంచి బీజింగ్ నగరానికి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. బుల్లెట్ రైళ్లు, హైస్పీడు రైళ్ల సర్వీసుల్ని అధ్యయనం చేయడానికి బీజింగ్‌కు బుల్లెట్ రైలులో ప్రయాణించిన చంద్రబాబు అమరావతి-విశాఖ, అమరావతి-హైదరాబాద్ మార్గాల్లో బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలపై పరిశీలన చేశారు. టియాంజిన్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో వున్న బీజింగ్ నగరానికి ముఖ్యమంత్రి కేవలం 31 నిమిషాలలో చేరుకున్నారు. కాగా చైనాలోని బుల్లెట్ రైళ్లు గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అనంతరం బుల్లెట్ రైళ్ళను పరిశీలించిన అనంతరం చంద్రబాబునాయుడు గుయాన్ వెళ్లారు. చంద్రబాబుతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. కాగా బుల్లెట్ ట్రయిన్లో ప్రయాణం చేయడం ఓ మధురానుభూతి అని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు. Elated at the experience of travelling in a Bullet train from Tianjin to Beijing. A memorable experience. #ChinaTrip pic.twitter.com/flyZtuJ80H — N Chandrababu Naidu (@ncbn) 28 June 2016 -
చైనా బ్యాంకర్లతో జైట్లీ సమావేశం
బీజింగ్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఐదు రోజుల చైనా పర్యటన గురువారం ప్రారంభమైంది. భారత మౌలిక వసతుల నిర్మాణంలోకి మరిన్ని విదేశీ నిధులు రాబట్టే దిశగా జైట్లీ తొలిరోజు చైనా అగ్రశ్రేణి బ్యాంకర్లు, ఫండ్ మేనేజర్లతో సంప్రదింపులు జరిపారు. బీజింగ్ చేరుకున్న ఆయన ముందుగా బ్యాంకు ఆఫ్ చైనా చైర్మన్ టియనా గులితో భేటీ అయ్యారు. సావరీన్ వెల్త్ ఫండ్ మేనేజర్లు, సంస్థాగత పెట్టుబడిదారులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలోనూ పాల్గొన్నారు. శుక్రవారం చైనా ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులు, అక్కడి వ్యాపార వేత్తలతో జరగనున్న ‘ఇన్వెస్ట్ ఇన్ ఇండియా’ అనే వ్యాపార సదస్సులో జైట్లీ పాల్గొంటారు. అలాగే, ఈ నెల 25న మూడో రోజు ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) బోర్డ్ గవర్నర్లతో సమావేశం అవుతారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మౌలికరంగ అభివృద్ధి కోసం ఏర్పాటైన ఏఐఐబీలో చైనా 26.6 శాతం వాటాతో అతిపెద్ద భాగస్వామిగా ఉండగా, 7.5 శాతం వాటాతో రెండో అతిపెద్ద భాగస్వామ్య దేశంగా భారత్ ఉంది. రష్యా 5.93 శాతం, జర్మనీ 4.5 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. 57 దేశాలు వ్యవస్థాపక సభ్యదేశాలుగా చేరాయి. 25న జరిగే ఏఐఐబీ సమావేశంలో తొలి విడతగా పలు దేశాలకు రుణాల మంజూరును బ్యాంకు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 26న చైనా సహా పలు దేశాలకు చెందిన ఆర్థిక మంత్రులతో జరిగే ఓ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో జైట్లీ పాల్గొననున్నారు. అలాగే, ఏఐఐబీ నిర్వహించే పర్యావరణ అనుకూల మౌలిక వసతులు అనే సదస్సులోనూ బ్రిక్స్ బ్యాంకు అధిపతి కేవీకామత్, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తదితరులతో కలసి పాల్గొననున్నారు. చివరిగా ఈ నెల 27న చైనా ఆర్థిక మంత్రి లూజివీతో జైట్లీ సమావేశమై రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం సహా పలు అంశాలపై చర్చలు జరుపుతారు. -
చైనా పర్యటనకు రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల చైనా పర్యటనకు మంగళవారం బయల్దేరారు. రాష్ట్రపతి ఈ పర్యటనలో భారత్‌తో చైనాకు ఉన్న వివాదాంశాలతో సహా పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. జైషే ఉగ్రవాద సంస్థ నాయకుడు మసూద్ అజహర్ విషయంలో చైనా అడ్డుపడుతుండటం, అణుశక్తి వ్యాప్తి నిరోధక ఒప్పందంపై తప్పక సంతకం చేయాలనడం తదితర అంశాలపై చర్చ జరుపుతారు. -
చైనా పర్యటనా.. విహారయాత్రా..
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. సీఎం చైనా పర్యటనకు వెళ్లడం..రోమ్ నగరం తగలబడుతోంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చైనాపర్యటన విహార యాత్రను తలపించిందని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా మునిగి ఉన్న చైనా.. తెలంగాణలో పెట్టుబడులు ఎలా పెడుతుందని ప్రశ్నించారు. చైనాకమిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు.. రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు, పర్యటనకు అయిన ఖర్చు వివరాలపై ప్రభుత్వం స్వేతపత్రం విడదల చేయాలని డిమాండ్ చేశారు. వివరాలు వెల్లడించక పోతే అసెంబ్లీలో నిలదీస్తామని హెచ్చరించారు. మరో వైపు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని.. ఏడాది కాలంలో 63 వేల కోట్ల అప్పులు చేశారని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ అన్నారు. అందువల్లే.. ప్రపంచ బ్యాంక్ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం కాదని నివేదిక ఇచ్చిందని విమర్శించారు. చైనా, సింగపూర్ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్రానికి కేసీఆర్
ముగిసిన 10 రోజుల చైనా పర్యటన సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పది రోజుల చైనా, హాంకాంగ్ పర్యటన విజయవంతంగా ముగించుకుని బుధవారం రాష్ట్రానికి చేరుకున్నారు. సీఎం, ఆయనతోపాటు వెళ్లిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల బృందం ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం హాంకాంగ్ నుంచి బయల్దేరి రాత్రి 8.30కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సీఎం బృందానికి ఘన స్వాగతం పలికారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనడంతోపాటు పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా చైనా వెళ్లిన ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అక్కడి వివిధ నగరాలను సందర్శించారు. పలు సదస్సులు, సమావేశాల్లో పాల్గొని తెలంగాణలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానంపై అవగాహన కల్పించారు. పెట్టుబడులు పెట్టాల్సిందిగా చైనా, హాంగ్‌కాంగ్‌లోని పారిశ్రామికవేత్తలను సాదరంగా రాష్ట్రానికి ఆహ్వానించారు. వచ్చే ఏడాది వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం సీఎం నేరుగా అక్కణ్నుంచి ‘మైం హోమ్’ రామేశ్వర్రావు షష్టి పూర్తి కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాత్రి పదింటికి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కుటుంబీకులతో పాటు మంత్రులు కేటీఆర్, జోగు రామన్న, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య, విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, ప్రశాంత్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, సీఎంఓ అధికారులు స్వాగతం పలికారు. -
హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్
హైదరాబాద్: చైనా పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బృందం బుధవారం హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఏయిర్ పోర్టులో కేసీఆర్‌కు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు. పెట్టుబడులే లక్షంగా పది రోజుల పాటు చైనాలో పర్యటించారు. ప్రపంచ ఆర్దిక సదస్సు వేదికగా తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు. ఈ పర్యటనతో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమన్న సంకేతాలిచ్చారు. -
ముగిసిన కేసీఆర్ చైనా పర్యటన
-
సీఎం చైనా పర్యటన సక్సెస్
పరిశ్రమలకు పచ్చజెండా ఊపిన తెలంగాణ * నేడు రాష్ట్రానికి చేరుకోనున్న సీఎం కేసీఆర్ బృందం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ ఇమేజీని ప్రపంచానికి పరిచయం చేయటంతోపాటు రాష్ట్రానికి విదేశీ కంపెనీలు, పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులను ఆహ్వానించే లక్ష్యంతో కొనసాగిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చైనా పర్యటన విజయవంతంగా ముగిసింది. మంగళవారం హాంకాంగ్‌లో ఉన్న సీఎం బృందం బుధవారం ఉదయం అక్కణ్నుంచి బయలుదేరి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనుంది. పది రోజుల ఈ పర్యటనతో చైనాలోని వివిధ కంపెనీలు తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు రావటం శుభ సూచకం. రాష్ట్రంలో కొత్తగా అమలవుతున్న నూతన పారిశ్రామిక విధానానికి ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు ఈ పర్యటన దోహదపడింది. ‘పెట్టుబడులతో తరలి రండి.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది..’ అని స్వయంగా భరోసా ఇవ్వటం ద్వారా పారిశ్రామికవేత్తల దృష్టిని తెలంగాణ వైపు మళ్లించటంలో సీఎం కృతక్యతులయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు చాటిచెప్పటంతోపాటు డేలియన్, బీజింగ్, షాంఘై, షెంజెన్, హాంకాంగ్లలోని పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించటం ఆశించిన ఫలితాలు తెచ్చిపెట్టాయి. చైనాలో పేరొందిన లియో గ్రూపు, షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఒక్కోటి రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులతో విద్యుదుత్పత్తి పరికరాల తయారీకి ముందుకొచ్చాయి. దీంతోపాటు చైనాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో మేటి సంస్థ మకేనా, సెల్కాన్ కంపెనీలు హైదరాబాద్‌లో ఎల్ఈడీ, ఎల్సీడీల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకున్నాయి. అధునాతన సదుపాయాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న షుజు, షెంజెన్ ఇండస్ట్రియల్ పార్కులను ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. హైదరాబాద్‌లోనూ అదే స్థాయి ప్రమాణాలతో పారిశ్రామిక పార్కును నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని బ్రిక్స్ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సంప్రదింపులు జరపటం తో పెట్టుబడుల సమీకరణ దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసినట్లయింది. హాంకాంగ్‌లో బిజినెస్ సెమినార్ తెలంగాణలో పెట్టుబడులకు తరలిరావాలని హాంకాంగ్‌లోని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఐదు నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంది. చైనా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ బృందం సోమవారం హాంకాంగ్ చేరుకుంది. మంగళవారం ఉదయం అక్కడి రెన్యాసెన్స్ హార్బర్ వ్యూ హోటల్లో ఏర్పాటు చేసిన బిజినెస్ సెమినార్లో సీఎం పాల్గొన్నారు. ‘తెలంగాణలో హాంకాంగ్ కంపెనీలకు ఉన్న వ్యాపార అవకాశాలు..’ అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించారు. అక్కడి భారత కాన్సుల్ జనరల్ ప్రశాంత్ అగర్వాల్, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ యూనిట్ చైర్మన్ అరుణాచలం అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన నూతన పారిశ్రామిక విధానం, సింగిల్ విండో అనుమతుల పద్ధతి, నిర్ణీత కాలవ్యవధిలో పరిశ్రమలకు ఇచ్చే క్లియరెన్స్‌లకు సంబంధించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులపై రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రసంగించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సీఎం ముఖాముఖి ముచ్చటించారు. అనంతరం కాన్సుల్ జనరల్ సహా పారిశ్రామికవేత్తలతో కలసి విందులో పాల్గొన్నారు. బుద్ధ విగ్రహం సందర్శన... సెమినార్ అనంతరం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం హాంకాంగ్‌లోని లాంటావ్లో ఉన్న విశ్వవిఖ్యాత ‘తియాన్తాన్ బుద్ధ’ విగ్రహాన్ని సందర్శించింది. దాదాపు 202 టన్నుల కంచు లోహంతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. -
హాంకాంగ్‌లో వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ
హాంకాంగ్ : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాంకాంగ్‌లోని వాణిజ్య, వ్యాపారవేత్తలను కోరారు. మంగళవారం హాంకాంగ్‌లో స్థానిక వాణిజ్య, వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ఈ రోజు సాయంత్రం కేసీఆర్ బృందం హాంకాంగ్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించనుంది. అలాగే హాంకాంగ్‌లోని భారత రాయబారి ఈ రోజు కేసీఆర్ బృందానికి విందు ఇవ్వనున్నారు. ఆ విందుకు కేసీఆర్ బృందం హాజరుకానుంది. చైనా, హాంకాంగ్‌లో సీఎం కేసీఆర్ బృందం పర్యటన నేటితో ముగియనుంది. రేపు కేసీఆర్ బృందం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానుంది. -
కొనసాగుతున్న కేసీఆర్ చైనా పర్యటన
షాంఘై: చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన 8వ రోజు కొనసాగుతోంది. సోమవారం ఉదయం సీఎం కేసీఆర్ బృందం షెంజెన్ నగరానికి చేరుకుంది. అక్కడ ఇండస్ట్రియల్ హైటెక్ పార్కును కేసీఆర్ సందర్శిస్తారు. అనంతరం సాయంత్రానికి చైనా నుంచి హాంకాంగ్ చేరుకోనున్నారు. -
వాహ్... చైనా!
* బీజింగ్‌లోని చారిత్రక స్థలాల్లో కేసీఆర్ పర్యటన * చైనా గ్రేట్ వాల్, తియానన్మెన్ స్క్వేర్ సందర్శన * అక్కడి అందాలను ఆస్వాదించిన ముఖ్యమంత్రి * ఆదివారం సాయంత్రం షెంజెన్ చేరుకున్న సీఎం బృందం * నేడు పారిశ్రామికవాడను సందర్శించనున్న కేసీఆర్ * సాయంత్రం హాంకాంగ్‌కు పయనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం అక్కడి చారిత్రక స్థలాలను సందర్శించి ముగ్ధులయ్యారు. రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని వెంట బెట్టుకొని కేసీఆర్ ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యమిచ్చారు. మూడు వేల సంవత్సరాల చరిత్ర గల బీజింగ్ నగరం ఆధునిక వాస్తుకళ (ఆర్కిటెక్ట్) నైపుణ్యంతోపాటు చారిత్రక ప్రదేశాలకు నిలయంగా కీర్తి గడించింది. నగరంలోని ప్రఖ్యాత తియానన్మెన్ స్క్వేర్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పాటు ఇతర సందర్శనీయ ప్రాంతాల్లో పర్యటించి కేసీఆర్ వాటి అందాలను ఆస్వాదించారు. తొలుత ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద కూడలిలో ఒకటిగా గుర్తింపు పొందిన తియానన్మెన్ స్క్వేర్ను సందర్శించారు. చైనా రాజరిక నగరమైన ‘ఫర్బిడెన్ సిటీ’ని వేరుచేస్తున్న తియానన్మెన్ గేట్‌కు గుర్తుగా ఈ కూడలికి తియానన్మెన్ స్క్వేర్ అనే పేరు స్థిరపడింది. చైనా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించిన విప్లవ వీరుల స్మారక స్తూపాలు, గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్, చైనా జాతీయ మ్యూజి యం, మావో జెడాంగ్ స్మారక హాల్ తదితర చారిత్రక నిర్మాణాలను ఈ స్క్వేర్ వద్ద కేసీఆర్ తిలకించారు. అనంతరం బీజింగ్‌లో మరో ముఖ్య పర్యాటక ప్రదేశమైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించారు. విదేశీ దాడులు, దండయాత్రల నుంచి రక్షణ కోసం దేశ ఉత్తర సరిహద్దుల్లో తూర్పు నుంచి పశ్చిమ దిశ వైపు రక్షణ కవచంగా నిర్మించిన ఈ గోడకు విశేష చరిత్ర ఉంది. రాళ్లు, ఇటుకలు, మట్టి మిశ్రమం, చెక్క ఇతర పదార్థాలను దీని నిర్మాణంలో వినియోగించారు. ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత కట్టడం కూడా ఇదే. గ్రేట్ వాల్లోని సింహ భాగం మింగ్ రాజవంశం హయాంలో నిర్మితమైంది. సరిహద్దుల రక్షణ, వస్తు రవాణాపై పన్నుల విధింపు, విదేశీ వాణిజ్యానికి ప్రోత్సాహంతోపాటు వలసల నియంత్రణ అవసరాల కోసం ఈ గోడ ఉపయోగపడింది. కేసీఆర్ కొన్ని గంటల సమయాన్ని తియానన్మెన్ స్క్వేర్, గ్రేట్ వాల్ సందర్శన కోసం కేటాయించారు. ఈ రెండు చారిత్రక ప్రాంతాల విశేషాలను ఆయన ఆసక్తిగా తెలుసుకున్నారు. సాయంత్రం సీఎంతోపాటు వెంట ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం బీజింగ్ నుంచి షెంజెన్ నగరానికి చేరుకుంది. నేడు పారిశ్రామికవాడ సందర్శన సీఎం కేసీఆర్ బృందం సోమవారం షెంజెన్‌లోని హైటెక్ పారిశ్రామికవాడను సందర్శించనుంది. దాదాపు 4 గంటల పాటు ఈ పారి శ్రామికవాడలో గడిపిన అనంతరం హాంకాంగ్ కు పయనం కానుంది. కేసీఆర్ మంగళవారం హాంకాంగ్‌లో పారిశ్రామికవేత్తలతో చర్చలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం బుధవారం ఉదయం 11 గంటలకు హాంకాంగ్ నుంచి స్వదేశానికి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. -
బీజింగ్‌లో కేసీఆర్ ‘బిజీ’నెస్!
-
బీజింగ్‌లో కేసీఆర్ ‘బిజీ’నెస్!
⇒ వ్యాపార సంస్థలతో వరుస భేటీలు ⇒ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానాలు ⇒ పారిశ్రామికవాడల నిర్మాణం దిశగా చర్చలు ⇒ ఆసక్తి చూపిన ఇన్స్పూర్, చైనా ఫార్చ్యూన్, చాంగ్ క్వింగ్ సంస్థలు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిని ధుల బృందం ఆరో రోజు చైనా పర్యటనలో వ్యాపార ప్రముఖులతో చర్చలతో బిజీబిజీగా గడిపింది. శనివారం బీజింగ్‌లోని ‘రాఫెల్స్ బీజింగ్’ హోటల్లో ఇన్స్పూర్ గ్రూపు, చాంగ్ క్వింగ్, చైనా ఫార్చ్యూన్ సంస్థలతోపాటు చైనా రైల్వే కార్పొరేషన్ (సీఆర్సీ), సానీ గ్రూపు ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించింది. రాష్ట్రంలో నూతన పారిశ్రామికవాడల నిర్మాణంపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చలు జరిగాయి. క్లౌడ్ కంప్యూటింగ్ సేవల రంగంలో చైనాలో అగ్రగామిగా ఉన్న ఇన్స్పూర్ గ్రూపు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తి ప్రదర్శించింది. చాంగ్ క్వింగ్ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ(సీఐసీఓ), చైనా ఫార్చ్యూన్ ల్యాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సీఎఫ్ఎల్డీసీ)లు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపార భాగస్వామ్యం వహించేందుకు ఉత్సాహం చూపాయి. సానుకూల స్పందన... తొలుత చాంగ్ క్వింగ్ సంస్థ ఉపాధ్యక్షుడు, జనరల్ మేనేజర్ డు గ్జియాన్ ఝాంగ్ బృందంతో కేసీఆర్ బృందం సమావేశమైంది. ఈ సంస్థ మౌలిక సదుపాయాల రంగంలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో పెట్టుబడులు పెడుతోంది. బిహార్‌లో వైద్య కళాశాల నిర్మాణం, ఢిల్లీలో లైట్ రైల్వే ప్రాజెక్టును ఈ సంస్థ చేపట్టింది. అనంతరం కేసీఆర్ బృందం అక్కడి ఇన్స్పూర్ గ్రూపు, ఉపాధ్యక్షుడు, ఇన్స్స్పూర్ ఇండియా అధ్యక్షుడు ఝాంగ్ డాంగ్ బృందంతో సమావేశమైంది. ఈ భేటీలో ఇన్స్పూర్ ఇండియా ఆర్థిక, ప్రభుత్వ వ్యవహారాల విభాగాల అధిపతులు టెర్రెన్స్ డు, స్నిఘ్ సుగ్లు సైతం పాల్గొన్నారు. అంతర్జాతీయంగా సర్వర్ల అమ్మకాల్లో ప్రపంచంలో ఐదో స్థానంతోపాటు చైనాలో అగ్ర స్థానంలో ఉన్న ఈ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. మరో సమావేశంలో చైనా ఫార్చ్యూన్ ల్యాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు లియాంగ్ వెన్టావో, ప్లానింగ్ విభాగం డెరైక్టర్ ఝాంగ్ ఖిటాన్, సహాయ ఉపాధ్యక్షుడు యాన్ జింగ్, భారతీయ కన్సల్టెంట్ సొన్ని బాడిగాతో కేసీఆర్ బృందం మంతనాలు జరిపింది. భారత్‌లో కొత్త పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసే అంశంలో ఈ సంస్థ ఆసక్తి చూపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సాధ్యాసాధ్యాలపై ఈ భేటీలో ఇరువర్గాలు చర్చించుకున్నాయి. చైనాలోని పారిశ్రామిక నగరాలకు పెట్టుబడులు, అభివృద్ధి, నిర్వహణ సేవలను సీఎఫ్ఎల్డీసీ అందిస్తోంది. 12 వేల మంది ఉద్యోగులు గల ఈ సంస్థ చైనా లో గ్వాన్ డెవలప్మెంట్ ఏరి యా, డాచాంగ్ చావోబాయి నది అభివృద్ధి ప్రాంతం, జియాషాన్ హెచ్ఎస్ఆర్ న్యూ సిటీ, చైనా ఫార్చ్యూన్ ఇన్నోవేషన్ పార్కు తదితర ప్రాజెక్టులను అభివృద్ధి చేసిం ది. రాష్ట్రంలో సైతం ఇలాంటి నగరాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్చలు జరిపింది. ‘ఫర్బిడెన్ సిటీ’లో తెలంగాణ సీఎం బీజింగ్‌లోని పురాతన రాచరిక నగరం ‘ఫర్బిడెన్ సిటీ’ని కేసీఆర్ బృందం సందర్శించింది. మింగ్ రాజవంశం నుంచి క్వింగ్ పాలన ముగిసేవరకు రాజప్రాసాదంగా సేవలందించిన ఈ పురాతన ప్యాలెస్‌ను ప్రస్తుతం మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు. దాదాపు 500 ఏళ్లకుపైగా చైనా రాజవంశీయులకు రాజప్రాసాదంగా, చైనా ప్రభుత్వానికి రాజకీయ కేంద్రంగా సేవలందించిన చరిత్ర ఈ నగరానికి ఉంది. 1406-1420 మధ్య కాలంలో నిర్మించిన ఈ నగరంలో 180 ఎకరాల విస్తీర్ణంలో 980 భవనాలున్నాయి. ఈ నగరాన్ని యునెస్కో 1987లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. నగర విశేషాలతోపాటు సందర్శకులకు కల్పించే సౌకర్యాలను కేసీఆర్ అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
చైనాలో బిజీబిజీగా గడుపుతున్న కేసీఆర్
-
మా రాష్ట్రానికి రండి:కేసీఆర్
-
రాష్ట్రంలోనూ భూలోక స్వర్గం!
చైనాలోని ‘సుజు’తరహాలో ఏర్పాటుకు సీఎం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: చైనాలో భూలోక స్వర్గంగా ఖ్యాతి గాంచిన సుజు నగరంలోని ప్రఖ్యాత సుజు పారిశ్రామికవాడను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బృందం శుక్రవారం సందర్శించింది. చైనా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ బృందం శుక్రవారం షాంఘై నుంచి బీజింగ్‌కు బయలుదేరే ముందు సుజు పారిశ్రామికవాడను సందర్శించింది. ఈ సందర్భంగా ‘చైనా-సింగపూర్ సుజు పారిశ్రామికవాడ’ పాలకవర్గ కమిటీ సభ్యుడు యుకెజైన్‌తో సీఎం బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆ పారిశ్రామికవాడ పుట్టుపుర్వోత్తరాలు, అభివృద్ధి వివరాలను యుకెజైన్ వివరించారు. అక్కడ ఏడు లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర బృందం సుజు పారిశ్రామికవాడ పాలకవర్గ సభ్యులకు తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం విశేషాలను వివరించింది. తెలంగాణలో సుజు తరహా పారిశ్రామికవాడల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. చైనా-సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఆర్థిక సహకార పథకంలో భాగంగా ఏర్పాటైన సుజు పారిశ్రామికవాడ 288 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఆర్థిక రంగంలో అంతర్జాతీయ సహకారానికి, విజయవంతంగా సంస్కరణలను అమలు చేయడానికి ఒక ఆదర్శ ప్రాంతంగా ఈ పారిశ్రామికవాడను తీర్చిదిద్దారు. అత్యధిక రంగాల్లో అంతర్జాతీయ పోటీకి నిలువెత్తు రూపంగా ఈ పారిశ్రామికవాడ నిలుస్తోంది. విదేశీ పెట్టుబడులతో చైనాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఇది అగ్రస్థానంలో ఉంది. సీఎంకు భారత రాయబారి విందు షాంఘైలో రెండు రోజుల బస అనంతరం సీఎం కేసీఆర్ బృందం శుక్రవారం చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకుంది. సాయంత్రం అక్కడి భారత రాయబారి అశోక్ కె.కాంత ఇచ్చిన విందుకు ఈ బృందం హాజరైంది. ఇక బీజింగ్‌కు బయలుదేరే ముందు షాంఘైలో చైనాకు చెందిన అంజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ డెరైక్టర్ యోగేశ్ వాఘ్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించగా... యోగేష్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణను సందర్శించాల్సిందిగా కేసీఆర్ ఆయనను ఆహ్వానించారు. పెట్టుబడులకు ముందుకొచ్చిన ‘వాండా’ చైనాకు చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థ వాండా గ్రూప్ గ్రేటర్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. చైనా పర్యటనలో ఉన్న రాష్ట్ర ప్రతినిధి బృందంలోని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ శాలినీమిశ్రాలు శుక్రవారం వాండా కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి.. కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్‌లో అత్యంత అనువైన వాతావరణ పరిస్థితులున్న నగరం హైదరాబాద్ అని, అక్కడ రూ.21 వేల కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని సోమేశ్‌కుమార్ వాండా సంస్థ ప్రతినిధులకు వివరించారు. వంద కిలోమీటర్ల మేర స్కైవేలు, 166 కిలోమీటర్ల మేర మేజర్ కారిడార్లు, మరో 1,400 కిలోమీటర్ల రహదారులు, 54 ఫ్లైఓవర్లను నిర్మించనున్నామని తెలిపారు. ఈ రంగంలో తమకు తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా వాండా సంస్థను కోరారు. దీనిపై స్పందించిన వాండా యాజమాన్యం... త్వరలోనే తమ ప్రతినిధి బృందం హైదరాబాద్‌ను సందర్శిస్తుందని హామీ ఇచ్చింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాండా కంపెనీ రియల్ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మీడియా, మాల్స్ తదితర రంగాల్లో ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక షాంఘై మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా ఈ బృందం సందర్శించింది. అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, ఆధునిక యంత్రాల వినియోగం, పార్కులు, ఆటస్థలాల నిర్వహణ, వివిధ సదుపాయాలు, ప్రజల భాగస్వామ్యం, కార్పొరేషన్ ఆదాయ, వ్యయాలు తదితర అంశాలను పరిశీలించింది. -
65 కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చైనా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. షాంఘైలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులతో ఆయన గురువారం భేటీ అయ్యారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులకు ఆయన వివరించారు. పట్టణాభివృద్ధి, నీటి పారుదల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కేసీఆర్ కోరారు. సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొత్తం 65 కంపెనీలకు చెందిన ప్రతినిధులు కేసీఆర్ బృందంతో సమావేశమయ్యారు. వారికి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కేసీఆర్ బృందం ఓ ప్రజంటేషన్ ఇచ్చింది. -
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేసీఆర్ ప్రసంగం
బీజింగ్: భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ గొప్పగా పనిచేస్తోందని, దేశాభివృద్ధిలో రాష్ట్రాలదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. చైనాలో పర్యటిస్తున్న కేసీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు. భారత్‌లో 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని, అభివృద్దిలో నూతన శిఖరాలను అధిరోహించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. పారిశ్రామిక అనుమతుల కోసం తెలంగాణలో ఐపాస్ రూపంలో గొప్ప పాలసీని ప్రవేశపెట్టామని కేసీఆర్ వెల్లడించారు. అసెంబ్లీలో చట్టాన్ని తెచ్చి రెండు వారాల్లో అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి విషయంలో ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని, సంస్కరణల విషయంలో ప్రధాని మోదీ గట్టిగా పనిచేస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. -
కేసీఆర్ చైనా పర్యటన... ఫిడేల్ వాయించినట్లుంది
హైదరాబాద్ : టీఆర్ఎస్ పరిపాలనపై టీ కాంగ్రెస్ నేతలు బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసిందనడం టీఆర్ఎస్ నేతల అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లడం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంలో చేసిందేమిటో బహిరంగ చర్చకు మంత్రుల సిద్ధమేనా అని టీఆర్ఎస్కు పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. అలాగే మాజీ మంత్రి శ్రీధర్ బాబు, కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కె మృత్యుంజయం మాట్లాడుతూ... కరీంనగర్ డైయిరీ ప్రైవేట్ కంపెనీగా మారడంతో 50 వేల మంది పాడి రైతులకు పెరిగిన పాలసేకరణ ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో 10 నెలలుగా జిల్లా పాడి రైతులకు రోజుకు రూ. 8 లక్షల నష్టం వస్తుందన్నారు. విజయ డైయిరీ ద్వారా పాలను సేకరించి కరీంనగర్ పాడి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో కరీంనగర్ డెయిరీ సహకార సంఘంగా ప్రారంభమై ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులను పెంచుకుందని చెప్పారు. రూ.400 కోట్ల విలువైన కరీంనగర్ డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని శ్రీధర్ బాబు, మృత్యుంజయంలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
'సింగం వస్తుందని తెలిసి చైనా పారిపోయాడు'
-
ముందు రైతులను అదుకోవలి:జీవన్‌రెడ్డి
-
నేటి నుంచి కేసీఆర్ చైనా టూర్
-
చైనా టూర్‌కు జగదీశ్‌రెడ్డి
విద్యుత్‌శాఖకు సంబంధించి పెట్టుబడులపై చర్చించే అవకాశం డాంగ్‌ఫెంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ సందర్శించనున్న సీఎం బృందం జిల్లాలో విద్యుత్ రంగంలో పెట్టుబడులకు చైనాను ఆహ్వానించనున్న మంత్రి చైనా దేశంలో మంత్రి పర్యటన వివరాలు సోమవారం ఉదయం సీఎంతో కలిసి చైనా వెళ్తారు. అక్కడ డల్లాన్ నగరానికి చేరుకుంటారు. అక్కడినుంచి 10న షాంగైకి వెళతారు. 11వ తేదీన చైనా రాజధాని బీజింగ్‌లో పర్యటిస్తారు. 12న బీజింగ్ నుంచి షెన్జెన్కు 13న షెన్జెన్ నుంచి హాంగ్‌కాంగ్‌కు 16న హాంకాంగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మరో కీలక విదేశీ పర్యటనకు వెళ్లారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను చైనా దేశంలో ప్రచారం చేసి పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను సీఎం నేతృత్వంలో ఆ దేశానికి వెళ్లిన రాష్ట్ర బృందంలో జగదీశ్‌రెడ్డి ఉన్నారు. ఈనెల ఏడో తేదీ నుంచి 16వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు ఆయన చైనా దేశంలో పర్యటిస్తారు. చైనా పర్యటన కోసం ముఖ్యమంత్రి తయారుచేసిన అధికార, రాజకీయ బృందంలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో పరిశ్రమల మంత్రి జూపల్లితో పాటు జగదీశ్‌రెడ్డి ఉండడం, అదీ విద్యుత్ శాఖ మంత్రి హోదాలో వెళుతుండడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో చైనా కంపెనీల పెట్టుబడుల కోసం వెళుతున్న రాష్ట్ర బృందంలో సభ్యుడిగా ఉన్న మంత్రి జగదీశ్ జిల్లాలో కూడా ఆ దేశ పెట్టుబడులను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యాదాద్రి పవర్.... రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పనున్న పవర్ప్లాంట్లు, ఇతర విద్యుత్ సంబంధ పరిశ్రమలపై చైనా పారిశ్రామిక దిగ్గజాలు, విద్యుత్ కంపెనీలతో చర్చించేందుకు గాను మంత్రి జగదీశ్‌రెడ్డి చైనా వెళ్లినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చైనా పెట్టుబడులతో పాటు ప్రత్యేకించి జిల్లాలో విద్యుత్ రంగ పెట్టుబడుల గురించి ఆయన అక్కడి కంపెనీలను ఆహ్వానించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఖరారైన యాదాద్రి విద్యుత్ ప్లాంట్... లేదంటే రాచకొండ గుట్టల్లో ఏర్పాటు చేయతలపెట్టిన పారిశ్రామిక హబ్‌లో పెట్టుబడుల గురించి మంత్రి చైనా కంపెనీలతో మాట్లాడనున్నట్టు సమాచారం. అయితే, విద్యుత్‌రంగానికి సంబంధించి చైనాలోని డాంగ్‌ఫెంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ప్రతినిధి బృందం ఇటీవలే మన రాష్ట్రాన్ని సంప్రదించింది. ఆ కార్పొరేషన్‌తో రాష్ట్రంలో విద్యుత్ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ పర్యటనలో ఆ దేశ పారిశ్రామిక దిగ్గజాలతో జరిగే చర్చల్లో పాల్గొంటారు. పలు పారిశ్రామికవాడలను సందర్శించనున్నారు. షెంగ్‌వాన్ నగరంలో పారిశ్రామిక వేత్తల భేటీలో మంత్రి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. -
కేసీఆర్ చైనా పర్యటనలో మార్పులు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చైనా పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8న కేసీఆర్ బృందం చైనాకు వెళ్లాల్సి ఉండగా, ఓ రోజు ముందుగా అంటే 7వ తేదీన బయల్దేరి వెళ్లనుంది. కేసీఆర్ వెంట మంత్రులు, అధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం వెళ్లనుంది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్ రెడ్డి తదితరులు చైనా పర్యటనకు వెళతారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సులో కేసీఆర్ బృందం పాల్గొననుంది. చైనాలో బీజింగ్, షాంఘై, షెంజాన్ నగరాల్లో పర్యటిస్తారు. -
వచ్చే నెలలో చైనా వెళ్లనున్న కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నారు. వచ్చే నెల (సెప్టెంబరు) 9 న చైనాలో పర్యటిస్తారు. ఆయన అక్కడ ఆరు రోజుల పాటు ఉంటారు. సెప్టెంబరు 9 నుంచి 14 వరకు జరిగే ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. అనంతరం ఇండియాకు వస్తారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. -
చైనా స్పందనకు కృతజ్ఞతలు
సీఎం ఫడ్నవీస్ - ముగిసిన ముఖ్యమంత్రి పర్యటన - సోమవారం అర్ధరాత్రి ముంబై చేరుకున్న సీఎం - అక్కడి కంపెనీలతో పలు ఒప్పందాలు - రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చైనా కీలకపాత్ర పొషిస్తుందని వెల్లడి ముంబై: నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చైనా వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం అర్ధరాత్రి ముంబై చేరుకున్నారు. ‘చైనా స్పందనకు కృతజ్ఞతలు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చైనా ముఖ్య పాత్ర పోషించనుంది’ అని నగరానికి చేరుకున్న తర్వాత ఆయన ట్వీట్ చేశారు. ప్రధానితో కలసి మే 14 చైనా పర్యటనకు వెళ్లిన సీఎం ఫడ్నవీస్.. బీజింగ్‌లో జరిగిన రాష్ట్రాలు, ప్రావిన్సుల ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ‘స్థిర పట్టణీకరణ, స్మార్ట్ సిటీ, స్మార్ట్ లివింగ్’, అలాగే దేశాల అభివృద్ధిలో రాష్ట్రాల పాత్రపై చర్చించారు. పర్యటనలో భాగంగా ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ కార్యక్రమం గురించి చైనా కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు వివరించారు. పలు చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ టెర్రీ గూ, చైనీస్ ఆటోమోబైల్ సంస్థ బిక్వీ ఫోటాన్ చైర్మన్, సీఈవో జిన్ యూ వాంగ్‌తో సీఎం సమావేశమయ్యారు. బీజింగ్, హాంగ్జూ, చెంగ్డూ నగరాల్లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలతోనూ భేటీ అయ్యారు. అజంతా-ఎల్లోరా గుహలున్న ఔరంగాబాద్ నగరాన్ని ‘సిస్టర్ సిటీ’లో భాగంగా డొంగ్వాన్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. హెయర్, యాప్, సీజీజీసీ, తైవాన్ పరిశ్రమ, గ్రేట్ వాల్ మోటార్స్ ఇతర అతిపెద్ద పారిశ్రామికాధికారులతో ఆయన సమేశమయ్యారు. గత నెలలో కూడా సీఎం జర్మనీ, ఇజ్రాయెల్ దేశాలలో పర్యటించి ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ ప్రయోజనాల గురించి వివరించారు. -
చైనా నైజం మారలేదు
- ముందు మంచిగా నటిస్తూ..వెనకాల గోతులు తవ్వుతోంది - అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ లేని భారత పటం చూపడంపై మండిపడ్డ సేన - టిబెట్ లేని చైనా పటాన్ని చూపిస్తే సహిస్తారా అని ప్రశ్న - సియాచిన్‌పై చైనా ఓ కన్నేసి ఉంచిందని హెచ్చరిక - చైనాకు వ్యతిరేకంగా మాట్లాడిన తొలి ప్రధాని మోదీ అని ప్రశంస ముంబై: చైనా వైఖరిని శివసేన తప్పుపట్టింది. ముందుకు మంచిగా నటిస్తూ వెనకాల గోతుల తవ్వుతోందని తీవ్రంగా విమర్శించింది. ఓ వైపు ప్రధాని మోదీకి చైనా ఘన స్వాగతం పలుకుతూనే మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ లేని భారత పటాన్ని చూపించి చైనా తమ నైజాన్ని మరోసారి బయటపెట్టిందని మండిపడింది. మోదీ చైనా పర్యటన లో ఉన్నప్పుడు ఆ దేశానికి చెందిన ఓ టెలి విజన్ మీడియా సంస్థ అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్లేని భారతదేశ పటాన్ని చూపిం చింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని సేన పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగంగా పేర్కొనడమే కాకుండా జమ్మూ-కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు చైనా సహకరిస్తోందని మండిపడింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనలో ఉన్నప్పుడు టిబెట్ లేని చైనా చిత్రపటాన్ని చూపించినట్లయితే చైనా ప్రజలు సహిస్తారా అని ప్రశ్నించింది. ఆ విధంగా చేసే ధైర్యం మనకు లేదని వ్యంగ్యంగా పేర్కొంది. చైనా పాక్‌ను కట్టడిచేయలేకపోతే తాము పాక్ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని భారత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడ జిన్‌పింగ్‌కు తెలిపాడని చెప్పింది. లక్షల హెక్టార్ల భూమి నష్టపోయాం పాక్‌కు చైనా మందుగుండు సామాగ్రి, అణ్వాయుధాలు, డబ్బు తదితర అంశాల్లో సహాయం చేస్తోందని పేర్కొంది. పాకిస్తాన్లో టైజం తప్ప ఏమీలేదని, ప్రతి విషయానికి చైనా పైన ఆధారపడుతోందని చెప్పింది. 1962లో మనం ‘హిందీ-చైని’ భాయి భాయి అంటే..అకస్మాత్తుగా చైనా మనపై దాడి చేసిం దని, ఆ దాడిలో మన దేశం లక్షల హెక్టార్ల భూమిని కోల్పోయిందని గుర్తుచేసింది. ఇప్పటికీ చైనా సియాచిన్‌పై ఓ కన్నేసి ఉంచిందని చెప్పింది. ముడు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ మే 14న చైనా వెళ్లారు. ఇందులో భాగంగా ఇరుదేశాల సరిహద్దు వివాదంలో రాజకీయ పరిష్కారానికి ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ట్రాన్స్ హార్బర్ లింక్ నిర్మాణంలో చైనా టెక్నాలజీ ముంబై, నవీముంబైలను సముద్రపు లింకుతో కలిపే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చైనా టెక్నాలజీ ఉపయోగించే విషయంలో ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. చైనా పర్యటనలో ఉన్న సీఎం సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. షాన్డాంగ్-మహారాష్ట్ర పరస్పర ఆర్థిక సహకారం దిశగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అన్నారు. ట్రాన్స్ హార్బర్ నిర్మాణంలో చైనా టెక్నాలజీని వాడుకోవడం, మౌలిక సదుపాయాల పెట్టుబడి ఈ ఒప్పందంలో ముఖ్యమైనవని సీఎం ట్వీట్ చేశారు. నవీముంబైలోని సెవ్రీ-చిర్లీ మధ్య ఏర్పాటు చేస్తున్న 22 కిలోమీటర్ల సీలింక్ ముంబై, నవీ ముంబైల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు నుంచి ముంబైకి వచ్చే ట్రాఫిక్‌ను కొంత వరకు తగ్గిస్తుంది. శభాష్ మోదీ మొన్నటి వరకు బీజేపీ ప్రభుత్వంపై విమర్శ అస్త్రాలు సంధించిన శివసేన అకస్మాత్తుగా ప్రశంసలతో ముంచెత్తడం ప్రారంభించింది. చైనా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై సేన సామ్నా సంపాదకీయంలో పొగడ్తలతో ముంచెత్తింది. చైనా-భారత్ సరిహద్దుపై జరుగున్న వివాదం తెలిసి కూడా ఇంతవరకు ఏ ప్రధాని నొరు విప్పలేదని, కాని చైనా నేలపై అడుగుపెట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడిన మోదీ ధైర్యాన్ని మెచ్చుకుంది. నమ్మకద్రోహులతో జాగ్రత్తగా మెలగాలని హెచ్చరించింది. బలమైన ప్రధాని ఉండగా చింతించాల్సిన అవసరం లేదని కొనియాడింది. భూసేకరణ, జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు తదితర అనేక అంశాలపై బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన శివసేన సోమవారం సామ్నా పత్రికలో మోదీని ప్రశంసించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. -
'మీది ప్రపంచ కర్మాగారమైతే.. మాది వనరుల క్షేత్రం'
వ్యాపారం చేయడంతోపాటు అందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా శనివారం షాంఘై నగరానికి చేరుకున్న ఆయన.. భారత్- చైనా వ్యాపార వేదికనుద్దేశించి ప్రసంగించారు. చైనాను ప్రపంచ కర్మాగారంగా అభివర్ణించిన ఆయన.. భారత్ వనరులకు కేంద్రమన్నారు. భారత్ మీకొక చారిత్రక అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ తరుణంలో పరస్పర సహకారం ద్వారా ఇరుదేశాలూ మరింత అభివృద్ధిని సాధించవచ్చు' అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్- చైనా మధ్య 22 బిలియన్ డాలర్ల విలువైన 21 ఒప్పందాల కుదిరాయి. 'ఇండియా- చైనా బిజినెస్ ఫోరంలో 22 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి' అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్టిట్టర్ ద్వారా తెలిపారు. -
'అది చెప్పడానికే మీ దగ్గరికి వచ్చా'
పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా చైనాలో పర్యటిస్తోన్న ప్రధాని మోదీ శనివారం షాంఘై నగరంలో చైనీస్ సీఈవోలతో భేటీ అయ్యారు. 'మేక్ ఇన్ ఇండియా అని మీతో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను' అని మోదీ సీఈవోలతో అన్నారు. ఈ భేటీలో అలీబాబా సంస్థ అధిపతి జాక్ మా సహా చైనాలోని ప్రముఖ కంపెనీల సీఈవోలు పాల్గొన్నారు. ఈ సమావేశం వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి ప్రాజెక్టులు తమను ఆకర్షిస్తున్నాయని, భారత్‌లో పెట్టుబడులకు తాము సానుకూలంగా ఉన్నమని సీఈవోలు ప్రధాని మోదీతో అన్నారు. భారత్ పై తమకు నమ్మకం ఉందని, అద్భుతమైన నిపుణులు, విస్తారమైన మార్కెట్ భారత్ సొంతమని సీఈవోలు పేర్కొన్నారు. కాగా నేటి షాంఘై సందర్శనతో ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటన ముగియనుంది. ఈ రోజు సాయంత్రం ఆయన మంగోలియాకు బయలుదేరుతారు. -
ఆర్థిక విప్లవానికి భారత్ రెడీ!
⇒ విదేశీ పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాం ⇒ అనవసరమైన నియంత్రణలకు ఇక చెల్లు... ⇒ ఆమోదయోగ్య, స్థిరమైన పన్నుల వ్యవస్థ... ⇒ చైనా పర్యటనలో భారత్ ప్రధాని మోదీ వెల్లడి... బీజింగ్: ఆర్థిక విప్లవం దిశగా భారత్ సమరశంఖం పూరించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లకు సానుకూల వాతావరణాన్ని కల్పించడంతోపాటు... అనవసరమైన నియంత్రణలకు చెల్లుచెప్పడం, ఆమోదయోగ్యమైన పన్నుల వ్యవస్థ కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన చెప్పారు. తాము తీసుకొస్తున్న భూసేకరణ చట్టం... వృద్ధికి ఆటంకం కలగకుండా, మరోపక్క రైతులకు భారం కాకుండా ఉంటుందని ఇన్వెస్టర్లకు ఆయన హామీనిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా శుక్రవారం ఇక్కడ చింగ్హువా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను అత్యుత్తమ వ్యాపార కేంద్రంగా మార్చడానికి అనేక నిబంధనలను సరళతరం చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. సాహసోపేతమైన సంస్కరణలు... మరిన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం తమ సర్కారు సాహసోపేతమైన సంస్కరణలను చేపట్టిన విషయాన్ని మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ఇందులో బీమా, నిర్మాణం, రక్షణ రంగం, రైల్వేలు కూడా ఉన్నాయన్నారు. ‘రోడ్లు, పోర్టులు, రైల్వేలు, విమానాశ్రయాలు, టెలికం, డిజిటల్ నెట్‌వర్క్‌లు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భవిష్యత్తు తరం మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా పెట్టుబడుల కోసం భారత్ చర్యలు చేపడుతోంది. వీటి అమలు కోసం గడచిన ఏడాది కాలంలో అనేక వేగవంతమైన నిర్ణయాలను తీసుకున్నాం. స్థిరమైన పన్నుల వ్యవస్థను రూపొందిస్తున్నాం’ అని ప్రధాని వివరించారు. ‘భారత్ వృద్ధి రేటు 7.5%కి ఎగబాకిన విషయాన్ని గుర్తించాలి. దీన్ని మరింత పెంచేందుకు ఎగుమతులను ప్రోత్సహిస్తున్నాం. భారత్, చైనా ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు కొత్తపుంతలు తొక్కనున్నాయని మోదీ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు చైనా ముందుకొచ్చిందన్నారు. రైల్వేల ఆధునీకరణ, రెండు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుతో పాటు మేక్ ఇన్ ఇండియాలో నూ పాలుపంచుకోనుందని పేర్కొన్నారు. వాణిజ్య లోటు కట్టడికి టాస్క్‌ఫోర్స్... చైనా నుంచి భారత్‌కు దిగుమతులు వెల్లువెత్తుతుండటం... ఆ దేశంతో భారత్ వాణిజ్య లోటు భారీగా పెరుగుతుండటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాని లీ కెకియాంగ్లు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాణిజ్యలోటు పెరగకుండా చూసేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పెంపునకు ఒక వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంపైన కూడా టాస్క్‌ఫోర్స్ దృష్టిపెడుతుందని వెల్లడించారు. ఐటీ, ఫార్మా, వ్యవసాయం, ఇతర తయారీ రంగాలకు చెందిన ఉత్పత్తులకు చైనా మార్కెట్లో మరింత అవకాశాలు కల్పించాలని భారత్ కోరుతోంది. భారత్ నుంచి చైనాకు ఎగుమతులను పెంచేందుకు వీలుగా నియంత్రణపరమైన అడ్డుంకులను తొలగించాలని పేర్కొంటోంది. 2013-14లో చైనాతో భారత్ వాణిజ్య లోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 36.21 బిలియన్ డాలర్లు కాగా, 2014-15లో ఇది 34 శాతం ఎగబాకి 48.44 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ప్రాథమిక గణాంకాల ప్రకారం 2013-14లో భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 11.95 బిలియన్ డాలర్లుకాగా, దిగుమతులు 60.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. నేడు 10 బిలియన్ డాలర్ల ఒప్పందాలు... నేడు(శనివారం) ప్రధాని మోదీ... భారత్-చైనా వ్యాపార వేదిక నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపార ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. షాంఘైలో జరిగే ఈ సమావేశానికి భారత్, చైనాలకు చెందిన దిగ్గజ కంపెనీల చీఫ్‌లు హాజరుకానున్నారు. -
మోదీ చైనా పర్యటనలో హైదరాబాద్ కు ప్రాధాన్యత
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనలో హైదరాబాద్ నగరానికి కూడా ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 24 ఒప్పందాలు జరిగాయి. వాటిలో హైదరాబాద్ నగరం కూడా ఉండటం విశేషం. భారత్‌లోని నాలుగు నగరాలతో చైనాలోని నాలుగు నగరాలను అనుసంధానం చేస్తూ ఈ నగరాల మధ్య పరస్పర స్నేహపూర్వక వ్యాపారం నిర్వహించేందుకు ఒప్పందం కూడా ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరాన్ని చైనాలోని కింగ్దావ్ నగరంతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు నగరాల మధ్య స్నేహపూర్వక వర్తకం జరిగే అవకాశం ఏర్పడింది. ఈ విధంగా హైదరాబాద్‌కు మేలు జరిగిందని భావిస్తున్నారు. -
చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు. మోదీ మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. వీరిరువురు ద్వైపాక్షిక సంబంధాలు, శాంతి పునరుద్ధరణ, వివిధ వాణిజ్య ఒప్పందాలతో పాటు, సరిహద్దు సమస్యలు, వీసా తదితర అంశాలపై చర్చించారు. అలాగే జల సమస్యలతో పాటు ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటుపైనా మోదీ ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఇక ఐరాసలో పరస్పరం సహకరించుకునేందుకు చర్చలు జరిపారు. అలాగే చైనా ప్రధాని లికెక్వియాంగ్తో మోదీ సమావేశం కానున్నారు. సరిహద్దు సమస్యలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 20 రకాల వాణిజ్య అంశాలపై ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. -
ద్వైపాక్షిక సంబంధాల్లో మైలురాయి!
-
ద్వైపాక్షిక సంబంధాల్లో మైలురాయి!
* తన చైనా పర్యటనపై మోదీ స్పందన * మూడు రోజుల పర్యటనకు నేడే శ్రీకారం * చైనా అధ్యక్షుడి సొంతనగరంలో దిగనున్న భారత ప్రధాని * సరిహద్దు సమస్యపై డ్రాగన్ నాయకత్వంతో చర్చలు న్యూఢిల్లీ/బీజింగ్: ఆసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సౌహార్ధ్ర సంబంధాల విషయంలో తన చైనా పర్యటన ఒక మైలురాయిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తం చేశారు. తన పర్యటనతో భారత్, చైనా సంబంధాలు మరింత విస్తృతమవుతాయన్నారు. చైనాలో ప్రధాని హోదాలో మోదీ 3 రోజుల తొలి పర్యటన కోసం బుధవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. ప్రొటోకాల్‌కు భిన్నంగా రాజధాని బీజింగ్ నుంచి కాకుండా చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ సొంత నగరమైన గ్జియాన్ (షాంగ్జి రాష్ట్ర రాజధాని) నుంచి మోదీ చైనా పర్యటన ప్రారంభం కావడం విశేషం. అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తరువాత బీజింగ్ వెలుపల ఒక విదేశీ నేతకు జిన్‌పింగ్ స్వాగతం పలకడం ఇదే ప్రథమం. భారత పర్యటన సందర్భంగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో జిన్‌పింగ్‌కు మోదీ ఘనంగా స్వాగతం పలికిన విషయం తెలిసిందే. గ్జియాన్‌లో మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య గురువారం అనధికార చర్చలు జరుగుతాయి. ‘చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నా. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం భారత్, చైనాలు కలసికట్టుగా కృషి చేయాల్సి ఉంది.’ అని చైనా అధికార వార్తా సంస్థ సీసీటీవీతో మోదీ వ్యాఖ్యానించారు. చైనా మీడియాను బుధవారం మోదీ కలిశారు. ‘ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం మరింత లోతుగా పాదుకొనడంపైననే ప్రధానంగా దృష్టి పెట్టనున్నాను. అప్పుడే ద్వైపాక్షిక సంబంధాల వాస్తవ సామర్థ్యాన్ని వెలికితీయడం సాధ్యమవుతుంది.’ అని మోదీ వ్యాఖ్యానించారు. బుద్ధుడు జన్మించిన ఆసియాలో ఈ శతాబ్దాన్ని యుద్ధరహిత శతా బ్దంగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పగోడా సందర్శన: మోదీని ప్రఖ్యాత బౌద్ధ నిర్మాణం పగోడా సందర్శనకు కూడా జిన్‌పింగ్ తీసుకెళ్లనున్నారు. చైనాలో బౌద్ధం వ్యాప్తికి ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి జువాన్ జాంగ్స్ చేసిన కృషికి గుర్తుగా క్రీశ 6వ శతాబ్దంలో ఈ పగోడాను నిర్మించారు. చైనా నుంచి చరిత్రాత్మక సిల్క్ రూట్ ద్వారా క్రీశ 645లో జాంగ్స్ భారత్‌కు వచ్చి, 17 ఏళ్లు ఇక్కడే గడిపారు. మోదీ గౌరవార్ధం జిన్‌పింగ్ ఇచ్చే విందు కు ముందు మోదీకి చైనాను పాలించిన తాంగ్ వంశ సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలుకుతారు. గ్జియాన్ నుంచి మోదీ బీజింగ్ వెళ్లి, చైనా ప్రధాని లి కెక్వియాంగ్తో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతారు. సరిహద్దు సమస్య: చైనాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు సమస్య, పాక్‌కు చైనా అన్ని విధాలుగా అందిస్తున్న సాయం, పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా నిర్మిస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు..! చైనా, భారత్‌ల సంబంధాలను ప్రభావితం చేసే ఈ అంశాలివి. చైనా నాయకత్వంతో మోదీ బృందం జరిపే చర్చల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు ఇరుదేశాలు ఇటీవలి కాలంలో కృషి చేస్తున్నప్పటికీ.. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్సాయిచిన్ ప్రాం తంలోని 2 వేల కిమీలకే సరిహద్దు సమస్య పరిమితమని చైనా వాదిస్తుండగా, 1962 యుద్ధం సమయంలో చైనా ఆక్రమించుకున్న పశ్చిమ ప్రాంతంలోని 4 వేల కిమీలు సమస్యాత్మకమేనని భారత్ పేర్కొంటున్నది. కాగా, భారత్‌తో సరిహద్దు సమస్య ఒక్కరోజులో పరిష్కారమయ్యేది కాదని చైనా పేర్కొంది. మోదీ పాల్గొనే కార్యక్రమాలు - బీజింగ్‌లో భారత్, చైనాల రాష్ట్రాధినేతల సమావేశంలో మోదీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ఆనందిబెన్ పటేల్‌లు పాల్గొంటారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ.. ఆయన పర్యటన రద్దయింది. - టెంపుల్ ఆఫ్ హెవెన్ వద్ద యోగా-తాయిల సమ్మిళిత కార్యక్రమంలోనూ మోదీ పాల్గొంటారు. సింఘ్వా యూనివర్సిటీలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. షాంఘైలో వ్యాపార సంస్థలసీఈఓల భేటీలో పాల్గొంటారు. మంగోలియాలో.. - మే 17న మంగోలియా చేరుకుంటారు. అక్కడి పార్లమెంట్లో ప్రసంగిస్తారు. - మంగోలియా అధ్యక్షుడు సఖియాగ్జిన్ ఎల్బెగ్‌డోర్జ్‌తో చర్చలు జరుపుతారు. - చివరగా, మంగోలియా నుంచి దక్షిణ కొరియా వెళ్లి, ఆ దేశాధ్యక్షుడు పార్క్ గ్వెన్‌హైతో చర్చలు జరుపుతారు. -
14 నుంచి చైనా పర్యటన
- 3 రోజులపాటు బిజీబిజీ..స్వయంగా తెలిపిన మోదీ - 17న మంగోలియా,18న ద.కొరియాలో పర్యటన న్యూఢిల్లీ: ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం స్వయంగా ప్రకటించారు. చైనీస్ మైక్రోబ్లాగ్ వెబ్సైట్ ‘వీబో’లో ఇటీవలే ఖాతా తెరిచిన మోదీ అందులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆసియాలో శాంతి, సుస్థిరతను పెంపొందించే దిశగా చైనా నాయకత్వంతో చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. చైనాతో స్నేహ బంధాన్ని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మూడు దేశాలు.. ఆరు రోజులు మోదీ విదేశీ పర్యటనపై విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14 నుంచి మొదలయ్యే ఆరు రోజుల పర్యటనలో భాగంగా మోదీ మొదట చైనాలో తర్వాత మంగోలియా, దక్షిణ కొరియాలో పర్యటిస్తారని పేర్కొంది. 3 రోజుల చైనా పర్యటనలో భాగంగా అక్కడి భారతీయ సమాజం షాంఘైలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారని తెలిపింది. దీనికి 45 వేల మంది భారతీయులు హాజరవుతారని అంచనా. 17న మోదీ మంగోలియా వెళతారు. ఆ దేశంలో అడుగుపెడుతున్న తొలి భారత ప్రధాని మోదీనే. ఆయన 18న దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. -
చైనా టూర్ సక్సెస్ అయింది
-
ముగిసిన చంద్రబాబు చైనా పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరు రోజుల చైనా పర్యటన ముగిసింది. శుక్రవారం చంద్రబాబు చైనా నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. చైనా పర్యటనలో ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. చంద్రబాబు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లేక్ వ్యూ అతిధి గృహంలో టీడీపీ ప్రజాప్రతినిధులతో సమావేశంకానున్నారు. -
'చైనా భాగస్వామ్యం చారిత్రక అవసరం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం చైనా పర్యటనలో చివరి రోజున శుక్రవారం అక్కడి వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు అయ్యారు. ఈ సమావేశాల్లో ఏపీలో సహజ వనరుల గురించి చైనా కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. 10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్, 24గంటల నీటివనరులను ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో చైనా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం చారిత్రక అవసరమని చంద్రబాబు ఉద్ఘాటించారు. కాగా, ఈ నెల 12న చంద్రబాబు బృందం చైనా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. -
ఏపీలో భారీ 'భూ' బ్యాంక్ : చంద్రబాబు
చైనా: చైనా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెంగ్డూలో చైనా పారిశ్రామికవేత్తలతో గురువారం సమావేశమైయ్యారు. ఈ సమావేశానికి చంద్రబాబు బృందంతో పాటు పలవురు చైనా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో భారీ ల్యాండ్ బ్యాంక్ ఉందని, దాంతో భూ కేటాయింపులకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. అదేవిధంగా తాము పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తామనీ, ప్రజల నుంచి పూర్తి సహకారం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 12న చంద్రబాబు బృందం చైనా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రాభివృద్ధికి సహకరించండి
⇒ చైనా మంత్రులు, కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతలతో చంద్రబాబు భేటీ ⇒ సీఎంకు సిచువాన్ గవర్నర్ విందు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన చైనా పర్యటనలో నాలుగోరోజు.. బుధవారం బీజింగ్‌లో ఆ దేశ మంత్రులు, కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న మౌలిక వసతులను ఆయన వారికి వివరించారు. అనంతరం చంద్రబాబు బృందం చెంగ్డో నగరానికి చేరుకుంది. చంద్రబాబు గౌరవార్థం సిచువాన్ ప్రావిన్స్ గవర్నర్ వుయ్ హంగ్ విందు ఇచ్చారు. ఆయనతో భేటీ అయిన చంద్రబాబు మాట్లాడుతూ.. చైనా స్వల్ప కాలంలో గణనీయంగా అభివృద్ధి సాధించిందని, ఇదెలా సాధ్యమైందో పరిశీలించేందుకు తాను చైనా వచ్చానని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో పరస్పరం సహకరించుకుందామన్నారు. విద్యారంగంలో సిచువాన్ అగ్రగామిగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీని ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చాలన్న తమ లక్ష్యసాధనకు సహకరించాలని హంగ్‌ను కోరారు. ఏపీలో ఉన్న సహజ సంపదలను చంద్రబాబు వివరించారు. వుయ్ హంగ్ మాట్లాడుతూ.. ఐటీ, వ్యవసాయ రంగంలో ఏపీ బాగున్నప్పటికీ నిర్మాణ రంగంలో మౌలికసదుపాయాల్లో మెరుగుపడాల్సి ఉందని అన్నారు. సిచువాన్, ఏపీలు సోదర భావంతో కలసి పని చేయాలని చెప్పారు. గురువారం నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి 130 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు హాజరవుతారని తెలిపారు. చంద్రబాబు గవర్నర్ హంగ్‌ను భారత్ పర్యటనకు ఆహ్వానించి.. ఏపీలో కొన్ని రోజులు ఉండాలని కోరారు. భారతదేశానికి వస్తే మొదట ఏపీకి వస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.. చెంగ్డో నగరంలోని రహదారుల సందర్శనకు చంద్రబాబు బృందం ఆసక్తి చూపించడంతో అందుకు గురువారం వేకువజామున ఏర్పాట్లు చేస్తామని హంగ్ చెప్పారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సతీష్ చంద్ర, పీవీ రమేష్, ఎస్.ఎస్.రావత్, అజయ్ జైన్, కార్తికేయ మిశ్రా, సీహెచ్. వెంకయ్య చౌదరి తదితరులున్నారు. పంట, ఆస్తి నష్టంపై ఆరా.. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో వాటిల్లిన పంట, ఆస్తి నష్టంపై ముఖ్యమంత్రి బుధవారం ఇక్కడి అధికారులతో సమీక్షించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని మంత్రులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇతర అధికారులను ఆదేశించారు. పంట, ఆస్తి నష్టంపై సమగ్ర నివేదికను రూపొందించేందుకు వెంటనే సర్వే ప్రారంభించాలని ఆదేశించినట్టు సమాచార సలహాదారు కార్యాలయం పేర్కొంది. -
12 నుంచి సీఎం చంద్రబాబు చైనా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12 నుంచి 17 వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరుతారని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా సాగనున్న ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట తనతో సహా మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, పలువురు ఉన్నతాధికారులు వెళతామని పరకాల తెలిపారు. చైనా ఆర్థిక రాజధాని షాంగై తోపాటు బీజింగ్, చింగ్డో నగరాల్లో చంద్రబాబు బృందం పర్యటించనుంది. -
నేడు చైనాకు బీజేపీ ప్రతినిధి బృందం
న్యూఢిల్లీ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కేంద్ర కమిటీ ఆహ్వానం మేరకు బీజేపీ ప్రతినిధి బృందం శనివారం చైనా పర్యటనకు వెళ్లనుంది. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, ఎంపీ భగత్‌సింగ్ కోషియారి నేతృత్వంలో 13 మంది సభ్యుల బృందం వారంపాటు చైనాలో పర్యటించనుంది. ఈ బృందానికి బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం కన్వీనర్‌గా ఉన్నారు. సీపీసీ, బీజేపీ రాజకీయ వ్యవహారాలు, ఎజెండాలపై అవగాహన సహా పలు అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. -
నవంబర్‌లో బాబు చైనా పర్యటన!
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే నవంబర్‌లో చైనా పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. అక్క డ ఎస్ఈజెడ్, పట్టణాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అనుమతి కోసం సీఎం కార్యాలయ అధికారి బీజింగ్‌లోని భారత దౌత్యాధికారికి లేఖ రాసిన విషయం తెలిసిందే. -
బాబు చైనా పర్యటనకు వస్తారు!
* బీజింగ్‌లో భారత దౌత్యాధికారికి లేఖ రాసిన సీఎం పేషీ * కేంద్రం ద్వారా కోరాలంటూ తిప్పి పంపిన దౌత్యాధికారి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం తప్పటడుగు వేసింది. సీఎం చైనాలో పర్యటించాలనుకుంటున్నారని, అందుకు అనువైన కార్యక్రమాన్ని తెలియజేయాల్సిందిగా బీజింగ్‌లోని భారత దౌత్యాధికారికి నేరుగా సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి అజయ్‌సహాని లేఖ రాశారు. అయితే ఆ విధంగా లేఖ రాయడాన్ని బీజింగ్‌లోని భారత దౌత్యాధికారికి తప్పుబట్టారు. నేరుగా భారత దౌత్యాధికారికి లేఖ రాయకూడదని, తొలుత కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారానే చైనా పర్యటనకు ప్రయత్నించాలని భారత దౌత్యాధికారి స్పష్టం చేస్తూ తిరిగి సీఎం కార్యాలయానికి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.