
12 నుంచి సీఎం చంద్రబాబు చైనా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12 నుంచి 17 వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరుతారని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు.
పెట్టుబడులను ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా సాగనున్న ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట తనతో సహా మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, పలువురు ఉన్నతాధికారులు వెళతామని పరకాల తెలిపారు. చైనా ఆర్థిక రాజధాని షాంగై తోపాటు బీజింగ్, చింగ్డో నగరాల్లో చంద్రబాబు బృందం పర్యటించనుంది.