బీజింగ్‌లో జిన్‌పింగ్ దంపతులతో కిమ్, ఆయన భార్య
వాషింగ్టన్/బీజింగ్: ఉత్తరకొరియాలో అణు నిరాయుధీకరణకు సమ్మతంగా ఉన్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం నేపథ్యంలో కిమ్ రహస్య చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రోజుల ఉత్కంఠ అనంతరం కిమ్ బీజింగ్ పర్యటనకు వచ్చి, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపారని చైనా అధికార మీడియా జిన్హువా వెల్లడించింది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆదివారం నుంచి బుధవారం వరకు బీజింగ్‌లో కిమ్ ‘అనధికార పర్యటన’సాగించినట్లు పేర్కొంది.
తన భార్యతో కలసి నాలుగు రోజుల పర్యటనకు బీజింగ్ వెళ్లిన కిమ్‌కు చైనా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. ఆద్యంతం రహస్యంగా సాగిన ఈ పర్యటన వివరాలను కిమ్ ఉత్తర కొరియాకు వెళ్లిన తర్వాతే జిన్హువా వెల్లడించింది. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ భవనంలో జిన్‌పింగ్, కిమ్‌లు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను వీరు గుర్తు చేసుకున్నారు. తాను కొరియా ద్వీపకల్పంలో అణ్వాయుధాలు లేకుండా చేస్తానని కిమ్ స్పష్టం చేశారు. కాగా, ఉత్తర కొరియాలోని అణ్వాయుధాలను వదిలిపెట్టేందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు ఇదే మంచి అవకాశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరలో కిమ్‌తో సమావేశమయ్యేందుకు ట్రంప్ అంగీకరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment