హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చైనా పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8న కేసీఆర్ బృందం చైనాకు వెళ్లాల్సి ఉండగా, ఓ రోజు ముందుగా అంటే 7వ తేదీన బయల్దేరి వెళ్లనుంది.
కేసీఆర్ వెంట మంత్రులు, అధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం వెళ్లనుంది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్ రెడ్డి తదితరులు చైనా పర్యటనకు వెళతారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సులో కేసీఆర్ బృందం పాల్గొననుంది. చైనాలో బీజింగ్, షాంఘై, షెంజాన్ నగరాల్లో పర్యటిస్తారు.
కేసీఆర్ చైనా పర్యటనలో మార్పులు
Published Sat, Sep 5 2015 4:57 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement