రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. సీఎం చైనా పర్యటనకు వెళ్లడం..రోమ్ నగరం తగలబడుతోంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. సీఎం చైనా పర్యటనకు వెళ్లడం..రోమ్ నగరం తగలబడుతోంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చైనాపర్యటన విహార యాత్రను తలపించిందని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా మునిగి ఉన్న చైనా.. తెలంగాణలో పెట్టుబడులు ఎలా పెడుతుందని ప్రశ్నించారు. చైనాకమిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు.. రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు, పర్యటనకు అయిన ఖర్చు వివరాలపై ప్రభుత్వం స్వేతపత్రం విడదల చేయాలని డిమాండ్ చేశారు. వివరాలు వెల్లడించక పోతే అసెంబ్లీలో నిలదీస్తామని హెచ్చరించారు. మరో వైపు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని.. ఏడాది కాలంలో 63 వేల కోట్ల అప్పులు చేశారని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ అన్నారు. అందువల్లే.. ప్రపంచ బ్యాంక్ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం కాదని నివేదిక ఇచ్చిందని విమర్శించారు. చైనా, సింగపూర్ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.