బాల్యమిత్రుని కుమార్తె వివాహ వేడుకలో సీఎం | kcr attrnd to childhood friend's daughter's wedding ceremony | Sakshi
Sakshi News home page

బాల్యమిత్రుని కుమార్తె వివాహ వేడుకలో సీఎం

Published Fri, Feb 19 2016 4:52 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

బాల్యమిత్రుని కుమార్తె వివాహ వేడుకలో సీఎం - Sakshi

బాల్యమిత్రుని కుమార్తె వివాహ వేడుకలో సీఎం

ములుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాల్య స్నేహితుడైన మహ్మద్ జహంగీర్ కుమార్తె అయేషా వివాహ వేడుకకు గురువారం రాత్రి హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా కొంపల్లిలోని సిద్ధి కన్వెన్షన్ హాల్‌లో అయేషా-జాఫరుద్దీన్‌ల కల్యాణ వేడుక జరిగింది. ఈ వేడుకకు మనవడు హిమాంషు, సతీమణి శోభతో కలిసి సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత హాజరయ్యారు. సీఎం దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలి, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement