హాంకాంగ్లో వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ | kcr meeting with businessmen in hong kong | Sakshi
Sakshi News home page

హాంకాంగ్లో వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ

Published Tue, Sep 15 2015 10:08 AM | Last Updated on Sun, Sep 2 2018 3:17 PM

హాంకాంగ్లో వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ - Sakshi

హాంకాంగ్లో వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ

హాంకాంగ్ : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాంకాంగ్లోని వాణిజ్య, వ్యాపారవేత్తలను కోరారు. మంగళవారం హాంకాంగ్లో స్థానిక వాణిజ్య, వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ఈ రోజు సాయంత్రం కేసీఆర్ బృందం  హాంకాంగ్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించనుంది. అలాగే హాంకాంగ్లోని భారత రాయబారి ఈ రోజు కేసీఆర్ బృందానికి విందు ఇవ్వనున్నారు. ఆ విందుకు కేసీఆర్ బృందం హాజరుకానుంది. చైనా, హాంకాంగ్లో సీఎం కేసీఆర్ బృందం పర్యటన నేటితో ముగియనుంది. రేపు కేసీఆర్ బృందం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement