చైనా పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బృందం బుధవారం హైదరాబాద్ చేరుకుంది.
హైదరాబాద్: చైనా పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బృందం బుధవారం హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఏయిర్ పోర్టులో కేసీఆర్కు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు. పెట్టుబడులే లక్షంగా పది రోజుల పాటు చైనాలో పర్యటించారు. ప్రపంచ ఆర్దిక సదస్సు వేదికగా తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు. ఈ పర్యటనతో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమన్న సంకేతాలిచ్చారు.