
చైనాలో దత్తన్న బిజీ బిజీ..
కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ చైనాలో బిజీ బిజీగా ఉన్నారు. జి 20 దేశాల కార్మిక శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు ఆయన చైనా వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన చైనాలోని వివిధ ప్రాంతాలను కూడా సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, షాంఘై టెంపుల్ తదితర ప్రాంతాలను ఆయన చూశారు.