Union Labour Minister
-
ఈపీఎఫ్‌వో సభ్యులకు ఈ పాస్‌బుక్
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో చందాదారులకు ఈ–పాస్‌బుక్ సదుపాయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు. దీంతో సభ్యులు తమ ఖాతా వివరాలను మరింత గ్రాఫికల్‌గా చూసుకోవచ్చని ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈపీఎఫ్‌వోకు సంబంధించి 63 ప్రాంతీయ కార్యాలయాల్లో (100కు పైగా ఉద్యోగులు ఉన్న) క్రెచే సదుపాయాలను సైతం మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు. ఉద్యోగులు తమ పిల్లలను ఇక్కడ విడిచి విధులు నిర్వహించుకోవచ్చు. పిల్లల సంరక్షణ బాధ్యతను అక్కడి సిబ్బంది చూసుకుంటారు. -
'డొనేట్-ఏ-పెన్షన్' కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నేడు(ఫిబ్రవరి 07) ప్రధానమంత్రి శ్రమ ఆధ్వర్యంలో 'డొనేట్-ఏ-పెన్షన్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసంఘటిత రంగాల కార్మికుల కోసం పెన్షన్ నిధిని సృష్టించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేస్తూ.. "తోటమాలికి విరాళం ఇవ్వడం ద్వారా నా నివాసంలో 'డొనేట్-ఎ-పెన్షన్' కార్యక్రమాన్ని ప్రారంభించాను. పీఎం ఎస్వైఎం పెన్షన్ పథకం కింద ఒక చొరవ, ఇక్కడ పౌరులు గృహ కార్మికులు, డ్రైవర్లు, సహాయకులు మొదలైన వారి తక్షణ సహాయక సిబ్బందికి ప్రీమియం కంట్రిబ్యూషన్'ను విరాళంగా ఇవ్వవచ్చు"అని అన్నారు. కార్మిక మంత్రిత్వ శాఖ ఇలా.. "డొనేట్-ఎ-పెన్షన్ పథకానికి చిన్న సహకారం అందించడం ద్వారా అసంఘటిత కార్మికుల భవిష్యత్తును సురక్షితం చేయండి. ఈ రోజు పీఎం ఎస్వైఎం కింద ప్రారంభించిన ఒక గొప్ప కార్యక్రమం, ఇది పెద్ద తేడాను కలిగిస్తుంది" అని ట్వీట్ చేసింది. Launched ‘Donate-a-Pension’ programme at my residence by donating to the gardener. It is an initiative under (PM-SYM) pension scheme where citizens can donate the premium contribution of their immediate support staff such as domestic workers, drivers, helpers etc.#AmritMahotsav pic.twitter.com/4R5laKnIul — Bhupender Yadav (@byadavbjp) March 7, 2022 పీఎం ఎస్వైఎం ఇదొక పెన్షన్ పథకం పేదలను, ఆదాయం తక్కువగా ఉన్న కార్మికులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం "ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన" పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. 18 సంవత్సరాల వయసు గల వారి నుండి 40 సంవత్సరాల వయసు గల వారు ఈ పథకానికి అర్హులు. పథకాన్ని ఎనుకున్న వ్యక్తి/ వ్యక్తురాలు వయసును బట్టి మీరు చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ పథకంలో మీరు నెలకు రూ.55 చెల్లిస్తే 60 సంవత్సరాలు దాటిన తరువాత నెలకు రూ. 3 వేల చొప్పున సంవత్సరానికి 36 వేల రూపాయలు మీకు లభిస్తాయి. అన్ని రకాల సాధారణ సేవా కేంద్రాల ద్వారా ఈ పథకంలో చేరవచ్చు అంతేకాకుండా దేశంలోని ప్రతి రాష్ట్రాలలో ఈ పథకం అందుబాటులో ఉంటుంది. (చదవండి: జాక్‌పాట్!! అమెరికా ప్రెసిడెంట్‌గా ఎలన్ మస్క్?) -
వారంలో 4 రోజుల పని.. మూడు వీకాఫ్‌లు!
2022-23 ఆర్ధిక సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం కార్మిక శాఖ తన ప్రతి పాదనల్ని కేంద్రానికి పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే మనదేశంలో వారానికి నాలుగు రోజులు వర్కింగ్ డేస్, మూడు వీక్ ఆఫ్‌లు వర్తించనున్నాయి. పీటీఐ కథనం ప్రకారం..కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ప్రారంభం నుంచి నాలుగు కొత్త లేబర్ కోడ్లను అమలు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు పీటీఐ తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా వేతనాలు, సోషల్ సెక్యూరిటీ, ఇండస్ట్రీయల్ రిలేషన్స్, ఆక్యుపంక్షనల్ సేఫ్టీ అనే ఈ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయనుంది. ఎంప్లాయిమెంట్, వర్క్ కల్చర్, టేక్ హోమ్ శాలరీ, వర్కింగ్ అవర్స్, నెంబర్ ఆఫ్ వీక్ ఆఫ్ అంశాలు లేబర్ కోడ్ కిందకి రానున్నాయి. కొత్త లేబర్ కోడ్ అమలైతే.. కేంద్రం లేబర్ కోడ్లను అమలు చేస్తే దేశంలో ఉద్యోగులు వారానికి ఐదురోజులకు బదులు 4 రోజుల పనితో పాటు 3రోజులు వీక్ ఆఫ్ తీసుకునే అవకాశం రానుంది. అయితే నాలుగురోజుల పనిదినాలతో పాటు 3రోజుల వీక్ ఆఫ్ తీసుకోనే సౌలభ్యం పొందాలంటే రోజుకు 12గంటల పనిచేయాల్సి ఉంటుంది. అంటే నాలుగు రోజుల పాటు 48గంటలు పనిచేసేలా కేంద్ర కార్మికశాఖ ప్రతిపాదనలతో వస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ జీతం, ఎక్కువ పీఎఫ్ కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదిస్తున్న నాలుగు కొత్త లేబర్ కోడ్ల కారణంగా శాలరీ, పీఎఫ్‌లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా ఉద్యోగి చేతికి వచ్చే జీతం తక్కువ, పీఎఫ్ ఎక్కువ కట్ అవుతుందని అంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే అవకాశం..!? కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు లేబర్ కోడ్ల క్రింద నియమాలను ఖరారు చేసినట్లు సమాచారం.ఈ నాలుగు లేబర్ కోడ్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2022-23లో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఈ కోడ్లకు సంబంధించిన ముసాయిదా నిబంధనల కేంద్రం పూర్తి చేసింది. అయితే ఈ అంశం కార్మిక విభాగానికి చెందింది కాబట్టి రాష్ట్రాలు కూడా వీటిని ఒకేసారి అమలు చేయాలని కేంద్రం కోరుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ఏం చెప్పారు కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ఈ వారం ప్రారంభంలో రాజ్యసభకు ఇచ్చిన ప్రత్యుత్తరంలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల గురించే ఈ లేబర్ కోడ్ ను అమలు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: భారతీయ విద్యార్ధులకు జాక్ పాట్, ఏడాదికి శాలరీ రూ.2.16 కోట్లు..! -
చైనాలో దత్తన్న బిజీ బిజీ..
కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ చైనాలో బిజీ బిజీగా ఉన్నారు. జి 20 దేశాల కార్మిక శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు ఆయన చైనా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చైనాలోని వివిధ ప్రాంతాలను కూడా సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, షాంఘై టెంపుల్ తదితర ప్రాంతాలను ఆయన చూశారు. -
ఏపీకి కార్మిక ట్రిబ్యునల్
ప్రతిపాదనలు పంపితే ఏర్పాటుకు సిద్ధం: దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: విభజన జరిగిన రాష్ట్రాల్లో కార్మిక ట్రిబ్యునళ్లు లేవని, ప్రతిపాదనలు వస్తే వాటి ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. కార్మికుల కేసుల పరిష్కారమై మంగళవారం ఆయన సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విభజన అనంతరం బిహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ట్రిబ్యునళ్లు లేవన్నారు. ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పంపాలని లేఖ రాయనున్నట్టు తెలిపారు. -
కేంద్ర కార్మిక మంత్రి శీష్ రామ్ కన్నుమూత