2022-23 ఆర్ధిక సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్‌లను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం కార్మిక శాఖ తన ప్రతి పాదనల్ని కేంద్రానికి పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే మనదేశంలో వారానికి నాలుగు రోజులు వర్కింగ్ డేస్, మూడు వీక్ ఆఫ్‌లు వర్తించనున్నాయి.
పీటీఐ కథనం ప్రకారం..కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ప్రారంభం నుంచి నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు పీటీఐ తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా వేతనాలు, సోషల్ సెక్యూరిటీ, ఇండస్ట్రీయల్ రిలేషన్స్, ఆక్యుపంక్షనల్ సేఫ్టీ అనే ఈ నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయనుంది. ఎంప్లాయిమెంట్, వర్క్ కల్చర్, టేక్ హోమ్ శాలరీ, వర్కింగ్ అవర్స్, నెంబర్ ఆఫ్ వీక్ ఆఫ్ అంశాలు లేబర్ కోడ్ కిందకి రానున్నాయి.
కొత్త లేబర్ కోడ్ అమలైతే..
కేంద్రం లేబర్ కోడ్‌లను అమలు చేస్తే దేశంలో ఉద్యోగులు వారానికి ఐదురోజులకు బదులు 4 రోజుల పనితో పాటు 3రోజులు వీక్ ఆఫ్ తీసుకునే అవకాశం రానుంది. అయితే నాలుగురోజుల పనిదినాలతో పాటు 3రోజుల వీక్ ఆఫ్ తీసుకోనే సౌలభ్యం పొందాలంటే రోజుకు 12గంటల పనిచేయాల్సి ఉంటుంది. అంటే నాలుగు రోజుల పాటు 48గంటలు పనిచేసేలా కేంద్ర కార్మికశాఖ ప్రతిపాదనలతో వస్తున్నట్లు తెలుస్తోంది.
తక్కువ జీతం, ఎక్కువ పీఎఫ్
కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదిస్తున్న నాలుగు కొత్త లేబర్ కోడ్‌ల కారణంగా శాలరీ, పీఎఫ్‌లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా ఉద్యోగి చేతికి వచ్చే జీతం తక్కువ, పీఎఫ్ ఎక్కువ కట్ అవుతుందని అంటున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే అవకాశం..!?
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు లేబర్ కోడ్‌ల క్రింద నియమాలను ఖరారు చేసినట్లు సమాచారం.ఈ నాలుగు లేబర్ కోడ్‌లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2022-23లో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఈ కోడ్‌లకు సంబంధించిన ముసాయిదా నిబంధనల కేంద్రం పూర్తి చేసింది. అయితే ఈ అంశం కార్మిక విభాగానికి చెందింది కాబట్టి రాష్ట్రాలు కూడా వీటిని ఒకేసారి అమలు చేయాలని కేంద్రం కోరుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది.
కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ఏం చెప్పారు
కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ఈ వారం ప్రారంభంలో రాజ్యసభకు ఇచ్చిన ప్రత్యుత్తరంలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల గురించే ఈ లేబర్ కోడ్ ను అమలు చేయనున్నట్లు తెలిపారు.
చదవండి: భారతీయ విద్యార్ధులకు జాక్ పాట్, ఏడాదికి శాలరీ రూ.2.16 కోట్లు..!
Comments
Please login to add a commentAdd a comment