దిబ్రూఘడ్: వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు మరోసారి ఖాయమమన్నారు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే మూడోసారి బీజేపీ అధికారం చేపడుతుందని స్పష్టంగా పేర్కొన్నారాయన.
మంగళవారం దిబ్రూఘడ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ 300 పైచిలుకు స్థానాల్లో గెలుపు సాధిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. అలాగే.. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 14 లోక్ సభ సీట్లలో 12 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని తీరుతుందన్నారు అమిత్ షా.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా స్థానాల్లో గెలుస్తుంది. అధికారంలోకి వస్తుంది. నరేంద్ర మోదీనే వరుసగా మూడోసారి ప్రధాని పగ్గాలు చేపడతారంటూ అమిత్ షా ప్రసంగించారు. ఇక ఇదే వేదికగా కాంగ్రెస్‌పై, రాహుల్ గాంధీపైనా ఆయన విమర్శలు గుప్పించారు.
ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటలాగా ఉండేవి. కానీ, రాహుల్ గాంధీ యాత్ర ప్రభావంతో.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నిక్లలో ఆ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. ‘‘అతను(రాహుల్ గాంధీని ఉద్దేశించి) విదేశీ గడ్డపై భారత్‌ను అవమానిస్తాడు. అతను దేశాన్ని ఎంత అవమానిస్తే.. కేంద్రంపై ఎన్ని నిందలు వేస్తే కాంగ్రెస్ దేశం నుంచి అంత కనుమరుగు అవుతుంది. ప్రధాని మోదీపై వాళ్లు ఎంత నోరు పారేసుకుంటే.. అది బీజేపీకి అంతగా కలిసొస్తుంది, పార్టీ అంతగా ఎదుగుతుంది అని షా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment