బాబు చైనా పర్యటనకు వస్తారు! | Chandrababu naidu go to China tour, says Ajay sahani | Sakshi
Sakshi News home page

బాబు చైనా పర్యటనకు వస్తారు!

Published Wed, Aug 13 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

బాబు చైనా పర్యటనకు వస్తారు!

బాబు చైనా పర్యటనకు వస్తారు!

* బీజింగ్‌లో భారత దౌత్యాధికారికి లేఖ రాసిన సీఎం పేషీ
* కేంద్రం ద్వారా కోరాలంటూ తిప్పి పంపిన దౌత్యాధికారి


 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం తప్పటడుగు వేసింది. సీఎం చైనాలో పర్యటించాలనుకుంటున్నారని, అందుకు అనువైన కార్యక్రమాన్ని తెలియజేయాల్సిందిగా బీజింగ్‌లోని భారత దౌత్యాధికారికి నేరుగా సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి అజయ్‌సహాని లేఖ రాశారు. అయితే ఆ విధంగా లేఖ రాయడాన్ని బీజింగ్‌లోని భారత దౌత్యాధికారికి తప్పుబట్టారు. నేరుగా భారత దౌత్యాధికారికి లేఖ రాయకూడదని, తొలుత కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారానే చైనా పర్యటనకు ప్రయత్నించాలని భారత దౌత్యాధికారి స్పష్టం చేస్తూ తిరిగి సీఎం కార్యాలయానికి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement