హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నారు. వచ్చే నెల (సెప్టెంబరు) 9 న చైనాలో పర్యటిస్తారు. ఆయన అక్కడ ఆరు రోజుల పాటు ఉంటారు. సెప్టెంబరు 9 నుంచి 14 వరకు జరిగే ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. అనంతరం ఇండియాకు వస్తారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.