
చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్తో సమావేశం అయ్యారు. మోదీ మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ అయ్యారు. వీరిరువురు ద్వైపాక్షిక సంబంధాలు, శాంతి పునరుద్ధరణ, వివిధ వాణిజ్య ఒప్పందాలతో పాటు, సరిహద్దు సమస్యలు, వీసా తదితర అంశాలపై చర్చించారు. అలాగే జల సమస్యలతో పాటు ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటుపైనా మోదీ ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఇక ఐరాసలో పరస్పరం సహకరించుకునేందుకు చర్చలు జరిపారు.
అలాగే చైనా ప్రధాని లికెక్వియాంగ్తో మోదీ సమావేశం కానున్నారు. సరిహద్దు సమస్యలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 20 రకాల వాణిజ్య అంశాలపై ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది.