'చైనా భాగస్వామ్యం చారిత్రక అవసరం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం చైనా పర్యటనలో చివరి రోజున శుక్రవారం అక్కడి వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు అయ్యారు. ఈ సమావేశాల్లో ఏపీలో సహజ వనరుల గురించి చైనా కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు.
10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్, 24గంటల నీటివనరులను ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో చైనా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం చారిత్రక అవసరమని చంద్రబాబు ఉద్ఘాటించారు. కాగా, ఈ నెల 12న చంద్రబాబు బృందం చైనా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.