China industrialists
-
కేసీఆర్‌తో చైనా పారిశ్రామికవేత్తల భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో శుక్రవారం చైనా పారిశ్రామికవేత్తల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై సీఎం సమక్షంలో అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం, చైనా కంపెనీల మధ్య రెండు ఎంవోయూలు కుదిరాయి. తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటుకు చైనాకు చెందిన సాని గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రీ ఫ్యాబ్ కాంక్రీట్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు సాని గ్రూపు ముందుకువచ్చింది. -
'చైనా భాగస్వామ్యం చారిత్రక అవసరం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం చైనా పర్యటనలో చివరి రోజున శుక్రవారం అక్కడి వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు అయ్యారు. ఈ సమావేశాల్లో ఏపీలో సహజ వనరుల గురించి చైనా కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. 10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్, 24గంటల నీటివనరులను ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో చైనా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం చారిత్రక అవసరమని చంద్రబాబు ఉద్ఘాటించారు. కాగా, ఈ నెల 12న చంద్రబాబు బృందం చైనా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. -
రండి.. భూకేటాయింపు తేలికే!
ఏపీలో మీకోసం.. ప్రత్యేక డెస్కు ఏర్పాటు చేస్తా ‘అమరావతి’ నిర్మాణంలో మీరూ ఓచేయి కలపండి చెంగ్డు పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు రెడ్ కార్పెట్ చైనాలో ఐదోరోజు పర్యటనలో బాబు బృందం బిజీ సిచువాన్ నుంచి షాంఘైకి పయనమైన సీఎం బృందం సాక్షి, హైదరాబాద్: ఏపీలో పెట్టుబడులు పెట్టే చైనా పారిశ్రామికవేత్తల సౌలభ్యం కోసం ఒక ప్రత్యేక డెస్కును ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలంటూ పారిశ్రామిక వేత్తలకు ఎర్ర తివాచీ పరిచారు. చైనా పర్యటనలో ఉన్న సీఎం బృందం 5వ రోజు గురువారం సిచువాన్ రాజధాని చెంగ్డులో ఏర్పాటైన పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంది. తమ రాష్ట్రంలో భారీ ల్యాండ్ బ్యాంకు ఉందని, భూ కేటాయింపుల్లో ఎలాంటి సమస్యలూ ఉండబోవని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్, జపాన్ తరహాలో చైనా కూడా సహకరించాలని కోరారు. చెంగ్డును తమ రెండో మజిలీగా చేసుకుంటామని, కొత్త రాజధాని అమరావతిని చైనా అలాగే చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇండియానే తమ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా సిచువాన్ ప్రావిన్షియల్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ వైస్ చైర్మన్ యాంగ్ చింగ్ పింగ్ చెప్పారు. తాము ‘వన్ బెల్ట్-వన్ బ్రెడ్ పాలసీ’ని అనుసరిస్తున్నామన్నారు. తమకు నిర్మాణ రంగంలో గొప్ప నైపుణ్యం ఉందని, పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో తమకు మొదటి అవకాశం లభించిందన్నారు. పెట్టుబడులకు 4 కారణాలు! తమ పెట్టుబడులకు ఏపీని కేంద్రంగా చేసుకునేందుకు చైనాకి, సిచువాన్ రాష్ట్రానికి 4 కారణాలున్నాయని చైనాలో భారత రాయబారి అశోక్ కాంతా వాటిని సవివరంగా చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం ఎంవోయులు కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రు లు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, ఉన్నతాధికారులు సతీష్ చంద్ర, పీవీ రమేష్, రావత్, అజయ్ జైన్, కార్తికేయ మిశ్రా, వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. మేం సహకరిస్తాం: చెంగ్డు మేయర్ లియాంగ్జీ ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని చెంగ్డు మేయర్ టాంగ్ లియాంగ్జీ అన్నారు. భారత్ వచ్చినప్పడు తప్పకుండా ఏపీని సందర్శిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు బృందంతో ఆయన భేటీ అయి మాట్లాడుతూ.. ఏపీలో ఉన్నత విద్యా సంస్థల్లో, వర్సిటీల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు సహకరిస్తామన్నారు. అనంతరం సీఎం గౌరవార్ధం బాబు బృందానికి లియాంగ్జీ విందునిచ్చారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఏపీలో హార్డ్‌వేర్ అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని కోరారు. అనంతరం ఏపీ బృందం సభ్యులు చెంగ్డు నుంచి షాంఘై వెళ్లినట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం..
* ఏపీలో పరిశ్రమలు స్థాపించండి * చైనా పారిశ్రామికవేత్తలు, అధికారులతో సీఎం చంద్రబాబు * రెండోరోజు వ్యాపారవేత్తలతో బాబు బృందం భేటీ * సీసీఈసీసీ, ఏపీ ప్రభుత్వాల ఒప్పందం * 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఫ్యాక్స్‌కాన్ సిద్ధం * ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని చైనా పారిశ్రామిక, వ్యాపారవేత్తలను సీఎం చంద్రబాబు కోరారు. * చైనాలో పర్యటిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రెండోరోజు పలువురు పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో పాటు అధికార, అనధికార ప్రముఖులతో సమావేశమైంది. * పరిశ్రమలకు అన్ని వసతులు కల్పిస్తామని, 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని సీఎం వారికి చెప్పారు. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టడంతో పాటు పరిశ్రమలు స్థాపించాలని చైనా పారిశ్రామిక, వ్యాపారవేత్తలను సీఎం చంద్రబాబు కోరారు. చైనాలో పర్యటిస్తున్న బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రెండోరోజు పలువురు పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో పాటు అధికార, అనధికార ప్రముఖులతో సమావేశమైంది. పరిశ్రమలకు అన్ని వసతులు కల్పిస్తామని, 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని సీఎం వారికి చెప్పారు. సీఎం బృందం సమావేశాల వివరాలను హైదరాబాద్‌లోని రాష్ర్ట ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం పత్రికలకు విడుదల చేసింది. * ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రసిద్ధి చెందిన జియోమీ సంస్థ అధ్యక్షుడు లిన్బెన్, ఉపాధ్యక్షుడు హ్యుగో బర్రా, ఫ్యాక్స్‌కాన్ ప్రతినిధి మైక్ఛాంగ్లతో బాబు భేటీ అయ్యారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. * వచ్చే మూడు నాలుగేళ్లలో 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని, 1.2 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తామని ఫ్యాక్స్‌కాన్ ఉపాధ్యక్షుడు ఫాగ్లర్ చెప్పారు. * ఐదు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సుమెక్ సంస్థ ఎండీ క్రిస్టఫర్ టాన్ చెప్పారు. దీనిపై మే నెలలో ప్రధాని మోదీ చైనా పర్యటన సందర్భంగా ఒప్పందాలు చేసుకోవచ్చని సీఎం పేర్కొన్నారు. * రాజధాని అమరావతి నగరంలో ట్రాఫిక్ మేనేజిమెంట్‌లో ఈ-మొబిలిటీ సొల్యూషన్స్, శాటిలైట్ సొల్యూషన్స్, సొల్యూషన్స్ ఫర్ ఎయిర్‌పోర్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుతో త్వరలో కలుస్తామని సీమన్స్ కంపెనీ ఉపాధ్యక్షుడు మస్లమ్ యాకిసన్ చెప్పారు.10-15 కి.మీ. పరిధిలో పెలైట్ ప్రాజెక్టు చేపట్టాలని, పీపీపీ పద్ధతిలో ముందుకెళ్లాలని బాబు సూచించారు. * ఏపీలో ఇండస్ట్రియల్ పార్కులు నెలకొల్పే ప్రతిపాదన ఉందని, జూన్, జూలై నెలల్లో సమగ్ర ప్రతిపాదనలతో కలుస్తామని సినోమా ఇంటర్నేషనల్ ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. * రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్నుగానీ, అసెంబ్లింగ్ యూనిట్నుగానీ ఏర్పాటు చేయాలని ఎల్ఇడీ డిస్ప్లేల తయారీలో కంపెనీ షెన్ జెన్ మేరీ ఫొటో ఎలక్ట్రిక్ సంస్థ ప్రతినిధులను సీఎం కోరారు. * బీజింగ్‌లో హవాయీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను సందర్శించిన బాబు రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసీటీ)ని పరిపాలనలో సమర్థంగా వినియోగించుకునే అవకాశాలపై ఆ కంపెనీ సాంకేతిక నిపుణులతో చర్చించారు. రాష్ట్రంలో హార్టువేర్ మ్యాన్ఫ్రాక్చరింగ్ అభివద్ధికి సహకరించాలని సీఎం కోరారు. * ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పెట్టుబడులకు సౌకర్యం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం, చైనా సివిల్ ఇంజినీరింగ్ కనస్ట్రక్షన్ కార్పొరేషన్ (సీసీఈసీసీ) ఒప్పందం చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వ ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కల్పన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, సీసీఈసీసీ ఏజీఎం వాంగ్ క్సియాడాంగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. * చైనా వైస్ ప్రీమియర్ వాంగ్ యాంగ్తో, బీజింగ్ మేయర్ వాంగ్ అన్ శున్తో చంద్రబాబు వేర్వేరుగా భేటీ అయ్యారు. చైనాలో పెట్టుబడులకు భారతీయులను తాము ఆహ్వానిస్తున్నామని, భారత్‌కు వెళ్లాలని చైనా కంపెనీలకు సూచిస్తున్నామని వాంగ్ అన్ శున్ చెప్పారు. ఏపీ పర్యటనకు రావాలని వారిని సీఎం ఆహ్వానించారు.