'మీది ప్రపంచ కర్మాగారమైతే.. మాది వనరుల క్షేత్రం'
వ్యాపారం చేయడంతోపాటు అందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా శనివారం షాంఘై నగరానికి చేరుకున్న ఆయన.. భారత్- చైనా వ్యాపార వేదికనుద్దేశించి ప్రసంగించారు. చైనాను ప్రపంచ కర్మాగారంగా అభివర్ణించిన ఆయన.. భారత్ వనరులకు కేంద్రమన్నారు.
భారత్ మీకొక చారిత్రక అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ తరుణంలో పరస్పర సహకారం ద్వారా ఇరుదేశాలూ మరింత అభివృద్ధిని సాధించవచ్చు' అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్- చైనా మధ్య 22 బిలియన్ డాలర్ల విలువైన 21 ఒప్పందాల కుదిరాయి. 'ఇండియా- చైనా బిజినెస్ ఫోరంలో 22 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి' అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్టిట్టర్ ద్వారా తెలిపారు.