ఉదయం హనోయ్.. రాత్రి హంగ్ఝౌలో
హంగ్ఝౌ: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు వెళ్లారు. వియత్నాంలో రెండురోజుల పర్యటనను శనివారం ముగించుకున్న మోదీ హనోయ్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి చైనాలోని హంగ్ఝౌ నగరానికి చేరుకున్నారు. మోదీకి చైనా ఉన్నత స్థాయి బృందం స్వాగతం పలికింది.
చైనా పర్యటనలో మోదీ ఆదివారం ఉదయం ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వ విషయం సహా పలు కీలక విషయాలపై సంప్రదింపులు జరపనున్నారు. గత మూడు నెలల్లో మోదీ, జీ సమావేశం కావడమిది రెండోసారి. గత జూన్లో వీరిద్దరూ తాష్కెంట్లో సమావేశమయ్యారు. చైనాలో మోదీ ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, బ్రిటన్, అర్జెంటీనా దేశాధినేతలతో భేటీకానున్నారు.