hangzhou
-
వికసిత్ భారత్‌ను నిజం చేయండి: మోదీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ యువతలో అద్భుత ప్రతిభాపాటవాలు దాగున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందడంలో తమ వంతు కృషిచేయాలని వారికి పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ప్రతి జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు చెందిన దాదాపు 250 మంది విద్యార్థులతో మోదీ ఆదివారం ఢిల్లీలో మాట్లాడారు. క్రీడల పట్ల కశ్మీర్ ప్రజలు చూపే అమితాసక్తిపై విద్యార్థులను ఆయన అడిగి తెల్సుకున్నారు. హంగ్జూలో ఆసియాన్ పారా గేమ్స్‌లో కశ్మీర్ యువత ఆర్చర్ శీతల్ దేవి సాధించిన మూడు మెడల్స్ గురించి వారితో మాట్లాడారు. ‘‘రోజూ యోగా చేయండి. మీరంతా బాగా చదివి, కష్టపడి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయండి. 2047 కల్లా వికసిత భారత్ కలను నిజం చేయండి’’ అని వారికి పిలుపునిచ్చారు. -
ఇదేం క్రికెట్ స్టేడియం.. చైనాపై పెదవి విరుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్
ఏషియన్ గేమ్స్ 2023కి ఈసారి చైనా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ నగరం వేదిక కానుంది. ఈసారి గేమ్స్‌లో క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ టీమిండియా పరుషుల, మహిళల జట్లను పంపనుంది. ఇప్పటికే ఆసియా గేమ్స్‌లో పాల్గొనే టీమిండియా జట్లను ప్రకటించింది. పురుషుల జట్టును రుతురాజ్ గైక్వాడ్ నడిపించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారధ్యం వహించనుంది. ఇక చైనాలో క్రికెట్ ఆడడం చాలా తక్కువ. అక్కడి వాళ్లు ఎక్కువగా ఇండోర్ గేమ్స్ సహా ఇతర క్రీడలు ఎక్కువగా ఆడుతుంటారు. అందుకే చైనాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు లేవు. ఉన్నా ఏదో మొక్కుబడిగా నిర్మించినట్లుగా అనిపిస్తుంది. అయితే తాజాగా ఆసియా గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడంతో హాంగ్జూ నగరంలో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. మాములుగా క్రికెట్ ఆడే మైదానాలు గుండ్రంగా ఉండడమే లేదంటే కాస్త స్క్కేర్ షేప్‌లో ఉండడం చూస్తాం. కానీ ఆసియా గేమ్స్ కోసం హాంగ్ఝౌలో నిర్మించిన క్రికెట్ స్టేడియం కాస్త వింతగా అనిపిస్తుంది. హాకీ మైదానాన్ని తలపించేలా ఉన్న స్టేడియంలో స్ట్రెయిట్స్ ఎక్కువ దూరం ఉంటే.. ఆఫ్‌సైడ్, లెగ్ సైడ్ బౌండరీలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. దీంతో క్రికెట్ స్టేడియాలు ఇలా కూడా ఉంటాయా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. స్టేడియం షేపు వింతగా ఉన్నా.. ఇక్కడి అత్యాధునిక సౌకర్యాలు మాత్రం ప్రేక్షకులకు ఓ కొత్త క్రికెట్ మ్యాచ్ అనుభవాన్ని అందించనున్నాయి. హాంగ్జూలోని ఈ క్రికెట్ స్టేడియంలో 12 వేల మంది కూర్చొని మ్యాచ్ చూడొచ్చు. దీని అద్భుతమైన డిజైన్, చుట్టూ పచ్చదనం, అత్యాధునిక సౌకర్యాలు ఫ్యాన్స్ ను ఆకర్షిస్తున్నాయి. పైగా బౌండరీలు కూడా దగ్గరగా ఉండటంతో ఆసియా గేమ్స్ లో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. చైనాలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే కావడం విశేషం. ఇక ఐదేళ్ల తర్వాత ఏషియన్ గేమ్స్‌లోకి క్రికెట్ తిరిగి వస్తుండటంతో ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2010 ఏషియన్ గేమ్స్ లో తొలిసారి క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. అయితే 2018లో జకార్తాలో జరిగిన గేమ్స్ నుంచి క్రికెట్ ను తొలగించారు. 2010, 2014లలో టి20 ఫార్మాట్ లో క్రికెట్ గేమ్స్ నిర్వహించారు. చివరిసారి ఆసియా గేమ్స్ జరిగినప్పుడు ఇండియా జట్టును పంపలేదు. ఈసారి రుతురాజ్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ను పంపిస్తోంది. ఈసారి ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావడమే తన లక్ష్యమని రుతురాజ్ అన్నాడు. గతంలో బంగ్లాదేశ్, శ్రీలంకలు గోల్డ్ మెడల్స్ గెలిచాయి. వుమెన్స్ కేటగిరీలో రెండుసార్లూ పాకిస్థాన్ ఖాతాలోకే మెడల్స్ వెళ్లాయి. The Cricket Stadium for Asian Games in Hangzhou, China. Massive Score on Cards..! pic.twitter.com/38AgLsZP6U — Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2023 చదవండి: Lionel Messi: సీజన్‌కు రూ.492 కోట్ల చొప్పున.. మియామి క్లబ్‌కు మెస్సీ -
చైనా వేదికగా పాకిస్థాన్‌పై..
-
చైనా వేదికగా పాకిస్థాన్‌పై..
చైనా వేదికగా దాయాది పాకిస్థాన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణాసియాలో 'ఒకే దేశం' ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నదని దుయ్యబట్టారు. పాకిస్థాన్ పేరును మోదీ నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఆయన దాయాది దేశాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది సుస్పష్టం. హాంగ్ఝౌ నగరంలో జరుగుతున్న జీ20 సదస్సు ముగింపు సమావేశంలో ప్రపంచ అగ్రరాజ్యధినేతలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. 'దక్షిణాసియాలో ఒకే దేశం తన ఉగ్రవాద ఏజెంట్లను వివిధ దేశాల్లోకి పంపుతోంది' అని పేర్కొన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ జాతీయ పాలసీకి సాధనంగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పనిచేస్తూ, గళమెత్తుతూ ఉగ్రవాదంపై సత్వరమే పోరాడాల్సిందిగా భారత్ కోరుతున్నదని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాలను ఏకాకులను చేసి, వాటిపై ఆంక్షలు విధించాలని, అంతేకానీ వాటికి రివార్డులు ఇవ్వొద్దని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించకపోవడమే భారత్ విధానమని, మాకు ఉగ్రవాదంటే ఉగ్రవాదేనని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు, పాకిస్థాన్‌ను ఏకాకి చేసేందుకు అంతర్జాతీయ సమ్మతిని పొందాల్సిన అవసరముందని మోదీ ఇప్పటికే చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బల్‌తో జరిపిన భేటీల్లో కోరిన సంగతి తెలిసిందే. -
'గౌరవించుకుందాం.. దూసుకెళదాం'
న్యూఢిల్లీ: ఆశయాలు, ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఇరు దేశాలు చాలా సున్నితంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో అన్నారు. చైనాలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ఆయన హాంగ్ఝౌలో ఆదివారం చైనా అధ్యక్షుడిని కలిసి కాసేపు మాట్లాడారు. భారత్, చైనాల మద్య ఉన్న పలు ఉద్రిక్త పరిస్థితులు, జరగాల్సిన ఒప్పందాలకు సంబంధించి వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. 'ఇరు దేశాల ఆకాంక్షలను పరస్పరం గౌరవించుకోవాలని, సున్నితంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు' అని భారత విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. ఇండియా-చైనాల మధ్య సంబంధం ఒక్క ఇరు దేశాలకే కాకుండా మొత్తం ఆసియానికి, ప్రపంచానికి చాలా ముఖ్యం అని కూడా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడికి చెప్పారు. దీనికి స్పందించిన చైనా అధ్యక్షుడు కూడా తాము తప్పకుండా ఇరు దేశాల మధ్య సంబంధాలను, ఆకాంక్షలను గౌరవిస్తామని బదులిచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు, సమస్యలకు కారణమైన ప్రశ్నలకు సమాధానం కనుగొని వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ అధికారిక ప్రతినిధి ఒకరు ఈ విషయం స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై కలిసి ఉమ్మడి పోరు చేయాలని కూడా మోదీ గట్టిగా చెప్పారు. గత మూడు నెలల్లో చైనా అధ్యక్షుడితో మోదీ భేటీ అవడం ఇది రెండోసారి. -
ఒబామాకు చుక్కలు చూపించిన చైనా!
-
ఒబామాకు చుక్కలు చూపించిన చైనా!
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చివరి ఆసియా పర్యటన సజావుగా సాగుతుందని అంతా భావించి ఉంటారు కానీ. అలా జరగలేదు. జీ-20 సదస్సు కోసం చైనాలో అడుగుపెట్టింది మొదలు ఆయనను ఘర్షణలు స్వాగతం పలికాయి. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో హాంగ్ఝౌ నగరంలో ఒబామా అడుగుపెట్టిన వెంటనే వైట్‌హౌస్ సిబ్బంది, చైనా అధికారుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య ఉన్న దౌత్య సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. విమానాశ్రయంలో ఒబామాకు చైనా అధికారులు రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకలేదు. సరికదా విమానం నుంచి ఆయన దిగేందుకు 'స్టెయిర్‌కేస్' (మెట్లు) కూడా ఏర్పాటుచేయలేదు. దీంతో ప్రత్యామ్నాయ ఎగ్జిట్ నుంచి ఒబామా దిగాల్సి వచ్చింది. దీనికితోడు ఒబామా సహాయకుడికి, చైనా అధికారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒబామా వెంట వచ్చిన జర్నలిస్టులను, ఆయన వెంట ఎక్కడికంటే అక్కడికి పంపించబోమని, వారిపై నిషేధం ఉంటుందని చైనా అధికారులు చెప్పడం వైట్‌హౌస్ సిబ్బందికి ఆగ్రహం తెప్పించింది. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు అమెరికా అధ్యక్షుడి వెంట మీడియా సిబ్బంది ఉంటారని, ఈ నిబంధనలను ఉల్లంఘించే ప్రసక్తే ఉండదని వైట్‌హౌస్ సిబ్బంది గట్టిగా వాదించగా.. 'ఇది మా దేశం. మా ఎయిర్పోర్ట్'.. మీ నిబంధనలు చెల్లవంటూ చైనా అధికారులు గట్టిగా తిప్పికొట్టారు. అమెరికా ప్రభుత్వంలో అత్యున్నత ర్యాంకు అధికారి అయిన సుసాన్ రైస్‌ను ఒబామా వెంట వెళ్లనిచ్చేందుకు చైనా అధికారులు అనుమతించలేదు. ఒబామాకు రైస్ జాతీయ భద్రతా సలహాదారు. చైనా అధికారుల ప్రవర్తనపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. వారు ఇలా చేస్తారని తాము అనుకోలేదని పేర్కొంది. ఒబామా కూడా చైనా అధికారుల అత్యుత్సాహంపై స్పందించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. అమెరికా-చైనా అనుసరించే విలువల మధ్య అగాధాన్ని ఈ గొడవ చూపిస్తున్నదని, అయినా జీ20 వంటి పెద్ద సదస్సులు జరుగుతున్నప్పుడు ఇలాంటివి పెద్ద విషయం కాదని ఒబామా పేర్కొన్నారు. -
జీ20 సదస్సు ఎందుకు?
హాంగ్ ఝౌ: జీ20 సదస్సు ఆదివారం చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా తమ సత్తాను ప్రపంచదేశాలకు తెలిపే మరో సువర్ణావకాశం చైనీయులకు దక్కింది. ఇందుకోసం చైనా ప్రభుత్వం నగరంలోని ఫ్యాక్టరీలన్నింటికి సెలవులు ప్రకటించింది. దీంతో మేఘాలు సహజవర్ణంలో కనిపించే అవకాశం పెరుగుతుంది. దాంతో పాటు పశ్చిమాన ఉన్న సరస్సును కూడా సుందరంగా ముస్తాబు చేసింది. జీ20 అంటే ఏంటి? ప్రపంచంలోని మొదటి 19 పెద్ద ఆర్ధికంగా శక్తిమంతమైన దేశాలు, యూరోపియన్ యూనియన్(ఈయూ)ల సమ్మేళనమే జీ20 సదస్సు. మొత్తం ప్రపంచ దేశాల జీడీపీలో ఈ దేశాల జీడీపీ 85శాతంగా ఉంది. కాగా ప్రతి ఏటా వార్షిక సదస్సును ఆర్ధిక పాలసీల గురించి చర్చించేందుకు నిర్వహిస్తారు. అయితే, సదస్సు నిర్వహిస్తున్న సమయంలో ప్రభావితం చేస్తున్న అంశాలను కూడా చర్చకు తీసుకురావచ్చు. ఎలా మొదలైంది? 1999లో ఆసియా ఆర్ధికసంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా సహకరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తొలుత ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏడు దేశాలు కలిసి జీ20ని ఏర్పాటుచేశాయి. ఆ తర్వాత క్రమేపి సభ్యుల సంఖ్య 20కు చేరుకుంది. ఇప్పటివరకు ఏం చేసింది? జీ20 సదస్సు గురించి నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కొంతమంది ఆర్ధికపరమైన విషయాల్లో సదస్సు కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. మరికొందరు గత ఏడాది టర్కీలో జరిగిన సదస్సులో దేశాలు అంగీకరించిన వాటిని అమలు చేయలేదని అంటున్నారు. మొత్తం 113 అంశాలకు ఆమోదం వేసిన వాటిలో శిలాజ ఇంధనాల నుంచి వలసలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అయితే, వీటన్నింటిలో కేవలం 77 శాతం అంశాలను మాత్రమే సభ్యత్వ దేశాలు నెరవేర్చాయి. దీంతో సదస్సు ప్రతిష్ట మసకబారే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఏం జరగొచ్చు ప్రపంచదేశాల అభివృద్ధి తక్కువగా ఉండొచ్చని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డె వ్యాఖ్యానించడంతో ఈ ఏడాది సభ్యత్వదేశాలు కొత్తహామీలను ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. చైనాకు ఎందుకు ముఖ్యం? 2008 సంక్షోభం తర్వాత ప్రపంచం మొత్తం చైనా సాయం కోసం తిరిగి చూసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్ధికవ్యవస్థగా ఉన్న చైనా మరింత ప్రాముఖ్యత కలిగిన పాత్ర పోషించడానికి ఆరాటపడుతోంది. చైనా ఇప్పటివరకూ నిర్వహించిన సదస్సుల్లో జీ20నే అతిపెద్దది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రత్యర్థులకు, ప్రపంచదేశాలకు తమ శక్తిని చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. -
ఉదయం హనోయ్.. రాత్రి హంగ్ఝౌలో
హంగ్‌ఝౌ: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు వెళ్లారు. వియత్నాంలో రెండురోజుల పర్యటనను శనివారం ముగించుకున్న మోదీ హనోయ్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి చైనాలోని హంగ్‌ఝౌ నగరానికి చేరుకున్నారు. మోదీకి చైనా ఉన్నత స్థాయి బృందం స్వాగతం పలికింది. చైనా పర్యటనలో మోదీ ఆదివారం ఉదయం ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వ విషయం సహా పలు కీలక విషయాలపై సంప్రదింపులు జరపనున్నారు. గత మూడు నెలల్లో మోదీ, జీ సమావేశం కావడమిది రెండోసారి. గత జూన్‌లో వీరిద్దరూ తాష్కెంట్లో సమావేశమయ్యారు. చైనాలో మోదీ ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, బ్రిటన్, అర్జెంటీనా దేశాధినేతలతో భేటీకానున్నారు. -
ట్రాఫిక్ అధికారి ముందే పసిగట్టాడు..హీరో అయ్యాడు
అది నాలుగు కూడళ్ల రోడ్డు. సరిగ్గా నాలుగు నిమిషాల ముందు వాహనాలు రాకపోకలతో రద్దీగా ఉన్న ప్రాంతం. వాహనాలను నియంత్రిస్తూ విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారి రోడ్డుపై అటూ ఇటూగా నడుస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నాడు. ఎంతో ఒత్తిడితో చేసే పని అయినా, బిజీగా తన పనిలో ఉన్నా కూడా నాలుగు కూడళ్ల వద్ద రోడ్డు బీటలు రావడాన్ని ఆ అధికారి గమనించాడు. వెంటనే రోడ్డు పై అటూ ఇటూగా నడిచి ఎంత మేర వరకు ప్రమాదకరమో గుర్తించి ఆ ప్రాంతంలోకి వాహనాలు రాకుండా చుట్టూ మూసివేశాడు. సరిగ్గా కొద్ది నిమిషాల్లోనే ఆ అధికారి గుర్తించిన ప్రాంతం మొత్తం కుంగిపోయింది. ఈ సంఘటన జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హోంగ్జూలో చోటుచేసుకుంది. ఈ వీడియో అక్కడే ఉన్న సీసీకెమరాకు చిక్కింది. ప్రమాదాన్ని గుర్తించడం కొద్దిగా ఆలస్యమైతే పెను ప్రమాదం సంభవించిఉండేదని, సదరు అధికారిని ప్రపంచ మీడియాతో పాటూ, వీడియో చూసిన వారంతా రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
ఇదేమి బరువురా బాబోయ్!
బీజింగ్: చైనా అనగానే మనకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమని గుర్తుకు వస్తుంది. అంతంత మాత్రపు జీతాలపై బతుకు బండి లాగించే కార్మికులు గుర్తొస్తారు. అత్యంత బరువు బండి లాగే బతుకులు కూడా వాళ్లవే. ఒక సైకిల్‌పై నలుగురు, ఒక మోటార్ సైకిల్‌పై ఐదుగురు ప్రయాణించడం అక్కడ నిత్యం కన్పించే దృశ్యాలే. ట్రక్కులపై తీసుకెళ్లాల్సిన సరకులను సైకిల్‌పై లాక్కుపోవడం. వరుసగా మోటారు సైకిల్‌కు ఐదారు వాహనాలను కట్టుకొని తరలించుకుపోవడం, టన్నులకొద్ది బరువుగల భారీ పైపులను రిక్షాలపై లాగించడం, 20 టన్నులకు మించని లోడ్‌ను తీసుకెళ్లాల్సిన వాహనాలపై వంద టన్నుల సరకులను తరలించడం కూడా మామూలే. చైనాలో దాదాపు 66 లక్షల వంతెనలు ఉన్నాయన్నది ఓ అంచనా. వాటిలో దాదాపు పావు వంతు వంతెనలు అధిక బరువును తీసుకెళ్లే ట్రక్కుల వల్లనే కూలిపోయాయట. హాంగ్జౌలోని క్వియాన్టాంగ్ నదిపై నిర్మించిన వంతెన కూడా అలాగే కూలింది. ఆ వంతెన సామర్థ్యం ప్రకారం 30 టన్నులకు మించి సరకులను తీసుకెళ్లరాదు. ఓ రోజు 129 టన్నుల బరవును తీసుకెళుతున్న ట్రక్కు వల్ల కూలిపోయిందట. 2004లోనే రోడ్డు భద్రతా నిబంధనలను తీసుకొచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదట. అందుకే కూలిన వంతెనల చోట కొత్త వంతెనలను కడుతూ పోతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతి పొడవైన, బలమైన, అబ్బురపరచే వంతెనలు కడుతున్న చైనాకు ఈ దుస్థితి ఏమిటో మరి!