న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ యువతలో అద్భుత ప్రతిభాపాటవాలు దాగున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందడంలో తమ వంతు కృషిచేయాలని వారికి పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ప్రతి జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు చెందిన దాదాపు 250 మంది విద్యార్థులతో మోదీ ఆదివారం ఢిల్లీలో మాట్లాడారు.
క్రీడల పట్ల కశ్మీర్ ప్రజలు చూపే అమితాసక్తిపై విద్యార్థులను ఆయన అడిగి తెల్సుకున్నారు. హంగ్జూలో ఆసియాన్ పారా గేమ్స్‌లో కశ్మీర్ యువత ఆర్చర్ శీతల్ దేవి సాధించిన మూడు మెడల్స్ గురించి వారితో మాట్లాడారు. ‘‘రోజూ యోగా చేయండి. మీరంతా బాగా చదివి, కష్టపడి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయండి. 2047 కల్లా వికసిత భారత్ కలను నిజం చేయండి’’ అని వారికి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment