india develop
-
PM Narendra Modi: పెట్టుబడులకు గమ్యస్థానం భారత్
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని విదేశీ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా మారడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ద వరల్డ్’ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆహా్వనించారు. నేడు ప్రపంచ వ్యాపార, వాణిజ్య, తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. పెట్టుబడులకు భారత్ కంటే మెరుగైన దేశం మరొకటి లేదని స్పష్టంచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘18వ ఆసియా–పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్–2024’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు జరగడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్తోపాటు భారత్, జర్మనీ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన సమయమని విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాని సూచించారు. నైపుణ్యం కలిగిన భారతీయ కారి్మకులపై జర్మనీ ఎంతగానో ఆసక్తి చూపుతోందని, వారికి ప్రతిఏటా ఇచ్చే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని నిర్ణయించిందని తెలిపారు. దీనివల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని ఉద్ఘాటించారు. సదస్సులో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ‘ఫోకస్ ఆన్ ఇండియా’ హర్షణీయం ‘‘ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, డేటా అనే నాలుగు బలమైన మూలస్తంభాలపై భారత్ నేడు సగర్వంగా నిల్చుంది. రహదారులు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల అభివృద్ధికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాం. 2047 నాటికి ఇండియాను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేశాం. ఇది చాలా కీలక సమయం. అందుకే ఇండియాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా జర్మనీ కేబినెట్ ‘ఫోకస్ ఆన్ ఇండియా’ అనే డాక్యుమెంట్ విడుదల చేసింది. ఇది నిజంగా హర్షణీయం. జర్మనీ సంస్థలకు ఇండియాలో ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు భారత్ కంటే మెరుగైన దేశం ఇంకెక్కడైనా ఉందా? లేదని కచి్చతంగా చెప్పగలను. భారతదేశ ప్రగతికి టాలెంట్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి నాలుగు అంశాలు. వీటిని ముందుకు నడిపించడానికి మా వద్ద ‘ఆకాంక్షలతో కూడిన భారత్’ అనే ఇంధనం ఉంది. నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత ప్రజాస్వామీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్ష సాంకేతికత అనేవి మాకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు, ఒప్పందాలకు అద్భుతమైన అవకాశాలున్నాయి. వాటిని విదేశీ వ్యాపారవేత్తలు.. ముఖ్యంగా జర్మనీ వ్యాపారవేత్తలు ఉపయోగించుకోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శాంతి స్థాపనకు సహకరిస్తాం ఉక్రెయిన్, పశి్చమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఏడో ఇంటర్–గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(ఐజీసీ)లో భాగంగా మోదీ శుక్రవారం ఢిల్లీలో జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో సమావేశమయ్యారు. భారత్–జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికేలా రాజకీయ పరిష్కారం కోసం భారత్ కృషి చేయాలని స్కోల్జ్ కోరారు. మోదీ బదులిస్తూ.. యుద్ధాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్యమార్గాల్లో ప్రయతి్నంచాలన్నదే భారత్ విధానమని తేలి్చచెప్పారు. -
వికసిత భారత్ దిశగా సంస్కరణలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా తదుపరి సంస్కరణలను అమలు చేయగలదని కార్పొరేట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పలువురు కార్పొరేట్ దిగ్గజాలు ఎక్స్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత పురోగతి వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీజీకి శుభాకాంక్షలు. మీ దార్శనిక సారథ్యంలో భారత్ అనేక మైలురాళ్లను అధిగమించింది. ఇకపైనా దేశం వృద్ధి బాటలో ముందుకు దూసుకెడుతుందని విశ్వసిస్తున్నాం.– అనిల్ అగర్వాల్, చైర్మన్, వేదాంత గ్రూప్దేశాభివృద్ధి కొనసాగుతుంది నెహ్రూజీ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన మోదీజీకి శుభాకాంక్షలు. కొత్త కేబినెట్ ఏర్పాటుతో దేశ అభివృద్ధి, పురోగతి కొనసాగగలదని ఆశిస్తున్నాను.– సజ్జన్ జిందాల్, సీఎండీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్కీలక సమయం భారతదేశ అభివృద్ధి, శ్రేయస్సుకు ఈ విడత మరింత కీలకం కాగలదని ఆశిస్తున్నాను. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్లక్ష్యానికి పటిష్ట పునాదులు ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది సంస్కరణల ఎజెండా కొనసాగింపునకు దోహదపడగలదు. ఆర్థిక, సామాజికాభివృద్ధికి తోడ్పడుతూ, వికసిత భారత్ లక్ష్యానికి గట్టి పునాదులు వేసే పురోగామి విధానాలు, చర్యలను కొత్త ప్రభుత్వం తీసుకోగలదని ఆశిస్తున్నాము. – అనీష్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీసంస్కరణల అమలు లక్ష్యం అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌ను పటిష్టపర్చేందుకు మోదీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం తదుపరి విడత సంస్కరణలు అమలు చేయగలదని ఆశిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్, సీఐఐఎకానమీ మరింత స్పీడ్ కీలక దేశాలకు మించి అత్యధిక వృద్ధి రేటును కొనసాగిస్తూ, దేశ నాయకత్వం భారత్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలదని కార్పొరేట్లు విశ్వసిస్తున్నారు.– దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం -
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
బారక్పూర్/హుగ్లీ: ‘‘నాకు వారసులెవరూ లేరు. దేశ ప్రజలే నా వారసులు. అభివృద్ధి చెందిన భారత్‌ను వారి చేతికి ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ప్రజలను లూటీ చేసి, వారసుల కోసం కోటలు కట్టాలన్నదే ప్రతిపక్షాల అసలు లక్ష్యం. విపక్ష కూటమిలో కనిపించే ఉమ్మడి లక్షణం అవినీతి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను బతికి ఉన్నంతకాలం పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఎవరూ రద్దు చేయలేరని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గతంలో ఎన్నడూ లేనన్ని తక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ) వయసు కంటే తక్కువ సీట్లతో ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సిందేనని అన్నారు. పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బెంగాల్‌లోని బారక్పూర్, హుగ్లీ, హౌరా, పుర్సురాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. బిహార్ రాజధాని పాటా్నలో రోడ్ షోలో పాల్గొన్నారు. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ గూండాలు సందేశ్‌ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ నిందితులను తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం నిస్సిగ్గుగా కాపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ అరాచకాలను ఎదిరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలపై హేయమైన నేరాలకు పాల్పడిన దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... పౌరసత్వం ఇవ్వడానికే సీఏఏ తృణమూల్ కాంగ్రెస్ పాలనలో బెంగాల్ రాష్ట్రం అవినీతి కేంద్రంగా, బాంబుల తయారీ పరిశ్రమగా మారిపోయింది. చొరబాట్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇక్కడి స్థానికులు మైనారీ్టలుగా మారిపోతున్నారు. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు దాసోహం అంటోంది. ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా గురించి నేను మాట్లాడితే తృణమూల్ నాయకులు బాంబుల బాష మాట్లాడుతున్నారు. హిందువులను బాగీరథీ నదిలో విసిరేస్తామంటున్నారు. వారికి ఆ అధికారం, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి? బెంగాల్లో శ్రీరాముడి పేరు పలికే పరిస్థితి లేదు. జనం శ్రీరామనవమి జరుపుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి పార్టీలు ఓటు జిహాద్ పిలుపులకు మద్దతిస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకుంటున్నాయి. పొరుగు దేశాల్లో మత వివక్షకు గురైన బాధితులకు భారతదేశ పౌరసత్వం కలి్పంచేందుకు పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ చట్టాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. చట్టంపై అబద్ధాల రంగు చల్లుతున్నాయి. ఈ చట్టం పౌరసత్వం ఇవ్వడానికే తప్ప లాక్కోవడానికి కాదు. 400కు పై సీట్లు.. నినాదం కాదు, తీర్మానం లోక్‌సభ ఎన్నికల్లో మూడు దశల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ బీజేపీ కూటమి పట్ల సానుకూలంగా జరిగింది. ఈసారి ఎన్నికల్లో మాకు 400కు పైగా సీట్లు వస్తాయనేది నినాదం కాదు. అది ప్రజల తీర్మానం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. కేంద్రంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే సాధ్యం. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన ప్రతిపక్షాలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నాయి’ అని మోదీ స్పష్ట్టం చేశారు. -
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే..
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏటా మన ఆర్థిక వ్యవస్థ 7-8శాతం వృద్ధి చెందాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. అనుకున్న విధంగా అది అభివృద్ధి చెందితే తలసరి ఆదాయం 13000 డాలర్లకు (సుమారు రూ.10.80 లక్షలు) చేరుతుందని చెప్పారు. దాంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని భావించారు. సమాజంలో తీవ్ర ఆర్థిక అసమానతలున్నాయని, దాంతోపాటు పేదరికాన్ని తగ్గించేందుకు నూతన ఆవిష్కరణలు మాత్రమే పరిష్కారం కాదన్నారు. వృద్ధి రేటుతో పాటు సామాజిక భద్రత, సబ్సిడీల వంటివీ అవసరమని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే తలసరి ఆదాయం రూ.10.80లక్షలుగా ఉండాలన్నారు. అయితే ప్రస్తుతం మన తలసరి ఆదాయం రూ.2.25 లక్షలుగా ఉందన్నారు. ఇదీ చదవండి: ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగాలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, మారకపు రేటుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ‘మారకపు విలువను తక్కువ స్థాయిలో ఉంచి, కరెన్సీ విలువ పెంచితే ఆదాయం పెరుగుతుంది. అప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అవకాశం ఉంటుంది’ అన్నారు. -
వికసిత్ భారత్‌ను నిజం చేయండి: మోదీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ యువతలో అద్భుత ప్రతిభాపాటవాలు దాగున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందడంలో తమ వంతు కృషిచేయాలని వారికి పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ప్రతి జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు చెందిన దాదాపు 250 మంది విద్యార్థులతో మోదీ ఆదివారం ఢిల్లీలో మాట్లాడారు. క్రీడల పట్ల కశ్మీర్ ప్రజలు చూపే అమితాసక్తిపై విద్యార్థులను ఆయన అడిగి తెల్సుకున్నారు. హంగ్జూలో ఆసియాన్ పారా గేమ్స్‌లో కశ్మీర్ యువత ఆర్చర్ శీతల్ దేవి సాధించిన మూడు మెడల్స్ గురించి వారితో మాట్లాడారు. ‘‘రోజూ యోగా చేయండి. మీరంతా బాగా చదివి, కష్టపడి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయండి. 2047 కల్లా వికసిత భారత్ కలను నిజం చేయండి’’ అని వారికి పిలుపునిచ్చారు. -
చిన్న నగరాలే కీలకం
న్యూఢిల్లీ: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న తన దీక్ష సాకారానికి దేశంలోని చిన్న నగరాలు అభివృద్ధి చెందడం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప్ లబ్ధిదారులనుద్దేశించి శనివారం ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే దేశంలోని వేలాది గ్రామాలు, నగరాలకు చేరిందని, ఇందులో చిన్న నగరాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ‘పేదలు, రైతులు, చిన్న వ్యాపారులు, ఇంకా సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారికి మా ప్రభుత్వం సాయంగా నిలుస్తోంది. అందరి నుండి ఆశ ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచే మోదీ గ్యారెంటీ మొదలవుతుంది’అని ప్రధాని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల ను ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవాల న్నారు. ప్రతి ఒక్కరి కష్టాలను దూరం చేసేందుకు తమ ప్రభుత్వం కుటుంబ సభ్యుడి మాదిరిగా ప్రయత్నాలు సాగిస్తోందని చెప్పారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు అభివృద్ధి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితంగా మారింది. మా ప్రభుత్వం చిన్న నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అభివృద్ధి చెందిన భారత్ బలమైన పునాదులను వేసింది’అని అన్నారు. ‘ఈ యాత్రను జెండా ఊపి మోదీ ప్రారంభించినప్పటికీ నిజానికి ప్రజలే ముందుండి నడిపారు. మధ్యమధ్యలో అంతరాయం కలిగిన చోట్ల, ప్రజలే చొరవ తీసుకుని ఇతర నగరాలు, పల్లెలకు యాత్రను కొనసాగించారు’అని చెప్పారు. మన దేశ మహిళలు స్వావలంబన సాధించడమే కాకుండా, ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఇటువంటి అంకితభావం, కష్టించే తత్వం ఉన్న వారి కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. దేశవ్యాప్తంగా ఉన్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో సాగే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలను జెండా ఊపి ప్రారంభించారు. మిగతా రాష్ట్రాల్లో నవంబర్ 15వ తేదీనే యాత్రలు మొదలుకాగా, ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో ఈ అయిదు రాష్ట్రాల్లో యాత్ర ఆలస్యమైంది. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ నిర్ణీత గడువులోగా పూర్తి స్థాయిలో అందించడమే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యం. -
భారత్ వేగంగా అభివృద్ది చెందుతోంది
విశాఖపట్నం: భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందని, ఆర్థికాభివృద్ధి కూడ వేగంగా దూసుకెళ్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో బుధవారం బ్రిక్స్ దేశాల సదస్సులో చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటిస్తూ దేశాభావృద్ధికి కృషిచేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని కేంద్రం స్వచ్ఛభారత్‌ను తీసుకొచ్చిందని చెప్పారు. పట్టణాల్లో మురికివాడలను బాగు చేయడం సవాలని, పట్టణ జనాభా వేగంగా పెరుగుతోందని తెలిపారు. 2022నాటికి టాప్-3 రాష్ట్రాల్లో ఏపీ ఉండాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.