భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏటా మన ఆర్థిక వ్యవస్థ 7-8శాతం వృద్ధి చెందాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. అనుకున్న విధంగా అది అభివృద్ధి చెందితే తలసరి ఆదాయం 13000 డాలర్లకు (సుమారు రూ.10.80 లక్షలు) చేరుతుందని చెప్పారు. దాంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని భావించారు.
సమాజంలో తీవ్ర ఆర్థిక అసమానతలున్నాయని, దాంతోపాటు పేదరికాన్ని తగ్గించేందుకు నూతన ఆవిష్కరణలు మాత్రమే పరిష్కారం కాదన్నారు. వృద్ధి రేటుతో పాటు సామాజిక భద్రత, సబ్సిడీల వంటివీ అవసరమని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే తలసరి ఆదాయం రూ.10.80లక్షలుగా ఉండాలన్నారు. అయితే ప్రస్తుతం మన తలసరి ఆదాయం రూ.2.25 లక్షలుగా ఉందన్నారు.
ఇదీ చదవండి: ట్రాన్స్‌జెండర్లకు ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగాలు
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, మారకపు రేటుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ‘మారకపు విలువను తక్కువ స్థాయిలో ఉంచి, కరెన్సీ విలువ పెంచితే ఆదాయం పెరుగుతుంది. అప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అవకాశం ఉంటుంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment