
ముగిసిన చంద్రబాబు చైనా పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరు రోజుల చైనా పర్యటన ముగిసింది. శుక్రవారం చంద్రబాబు చైనా నుంచి హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. చైనా పర్యటనలో ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. చంద్రబాబు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లేక్ వ్యూ అతిధి గృహంలో టీడీపీ ప్రజాప్రతినిధులతో సమావేశంకానున్నారు.