తైవాన్: బీజింగ్ ఎంత ఒత్తిడికి గురి చేసిన తైవాన్ తలొగ్గదని ప్రజాస్వామ్య జీవన విధానాన్ని రక్షించుకోగలదంటూ తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ తన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తైవాన్ ప్రజలు నిరంతరం తమ దేశంపై చైనా ఎప్పుడు దాడి చేసి ఆక్రమించేస్తోందేమో అన్న భయంతోనే జీవిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ కూడా తాము ఏదో ఒక రోజు తైవాన్‌ని ఆక్రమించుకుంటామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి: బుడిబుడి నడకల బుడతడు డ్యాన్స్ చేసి అదరగొడుతున్నాడు)
ఈ మేరకు తైవాన్ అధ్యక్షురాలు మాట్లాడుతూ..."మనం ఎంత ఎక్కువ సాధిస్తే చైనా నుంచి మనం అంత ఒత్తిడి ఎదుర్కొంటాం. చైనా నిర్దేశించిన మార్గంలో పయనించమని మనల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. తైవాన్ ఎప్పుడూ ప్రజాస్వామ్య రక్షణకే మొదటి ప్రాధాన్యతనిస్తుంది. అంతేకాదు బీజింగ్‌తో సంబంధాలను సడలించుకోవాలని నిర్ణయించుకున్నాం. తైవాన్ ప్రజలు ఒత్తిడికి తలొగ్గుతారని భ్రమపడొద్దు" అంటూ ఛైనాకు హెచ్చరికలు జారీ చేశారు.
(చదవండి: సైక్లోథాన్‌తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు")
Comments
Please login to add a commentAdd a comment