Tsai Ing-wen
-
స్వదేశీ జలాంతర్గామిని తయారుచేసిన తైవాన్
కవోసియంగ్(తైవాన్): తరచూ నావికాదళాలతో తమ వైపు దూసుకొస్తూ కవి్వంపు చర్యలకు పాల్పడే చైనాను అడ్డుకునేందుకు తైవాన్ తొలిసారిగా జలాంతర్గామిని తయారుచేసుకుంది. ప్రస్తుతం ఈ సబ్‌మెరైన్ పరీక్ష దశలో ఉంది. పరీక్షల్లో విజయవంతమై తైవాన్ అమ్ములపొదిలో చేరితే ఆ దేశ సైనిక స్థైర్యం మరింత ఇనుమడించనుంది. ‘గతంలో దేశీయంగా జలాంతర్గాముల తయారీ అనేది అసాధ్యం. కానీ ఈరోజు స్వదేశీ జలాంతర్గామి మీ కళ్ల ముందు ఉంది’ అని నౌకాతయారీకేంద్రంలో నూతన జలాంతర్గామి ఆవిష్కరణ కార్యక్రమంలో తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్–వెన్ వ్యాఖ్యానించారు. ‘ దేశ పరిరక్షణకు ప్రతినబూనిన మా సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం ఈ సబ్‌మెరైన్. వ్యూహాలు, యుద్ధతంత్రాల్లో నావికాదళం సన్నద్థతలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది’ అని ఆమె అన్నారు. కొత్త జలాంతర్గామికి హైకున్ అని పేరుపెట్టారు. చైనా ప్రాచీనగాథల్లో హైకు అంటే అది్వతీయమైన శక్తులు గలది అని అర్ధం. హార్బర్, సముద్ర పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక నావికాదళానికి అప్పగిస్తారు. 2027 ఏడాదికల్లా రెండు సబ్మెరైన్లను నిర్మించి దళాలకు ఇవ్వాలని తైవాన్ యోచిస్తోంది. తైవాన్ సమీప సముద్ర జలాల్లో తరచూ నేవీ, ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిన్యాసాలు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులను కల్పిస్తున్న చైనాకు ఈ పరిణామం మింగుడుపడనిదే. -
తైవాన్‌పై మళ్లీ చైనా ఆగ్రహజ్వాల
బీజింగ్: తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్ అమెరికాలో పర్యటించడాన్ని సహించని చైనా ఆగ్రహంతో రగిలిపోతోంది. ఎనిమిది యుద్ధనౌకలు, 71 యుద్ధవిమానాలను మోహరించి తైవాన్ సముద్రజల్లాల్లో ఉద్రిక్తత ను మరింత పెంచింది. తమ అధ్యక్షురాలు అమెరికాలో పర్యటించడంతో అక్కసుతో చైనా ఇలాంటి బెదిరింపు చర్యలకు దిగుతోందని తైవాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. 45 యుద్ధవిమానాలు ‘మిడిల్లైన్’ను దాటి మరీ తమ ప్రాదేశిక జలాలపై చక్కర్లు కొడుతున్నాయని తైవాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘యుద్ధ సన్నద్ధత గస్తీ’ మాటున మూడ్రోజులపాటు నౌకాదళ సంపత్తిని చైనా రంగంలోకి దించింది. అమెరికా పర్యటనలో భాగంగా తైవాన్ అధ్యక్షురాలు త్సాయి గురువారం కాలిఫోర్నియాలో అమెరికా పార్లమెంట్ ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీతో భేటీ అయ్యారు. దీంతో కోపం తెచ్చుకున్న చైనా పలు అమెరికన్ సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించింది. -
తైవాన్‌లో చైనా అనుకూల పార్టీ ప్రభంజనం!
తైపేయి: తైవాన్‌లో శనివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. చైనా వ్యతిరేక నినాదం.. ప్రజల నుంచి ఓట్లు విదిలించలేకపోయింది. విశేషం ఏంటంటే.. చైనా నుంచి మద్ధతు ఉన్న ప్రతిపక్ష పార్టీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(DPP)ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారామె. అయితే.. ఈ ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీ ఘన విజయం సాధించింది. ‘‘ఎన్నికల ఫలితాలు మేం ఆశించినట్లు రాలేదు. తైవాన్ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం. ఓటమికి అంతా నాదే బాధ్యత. డీపీపీ చైర్ఉమెన్ బాధ్యతల నుంచి ఇప్పటికిప్పుడే తప్పుకుంటున్నా’’ అని సాయ్ ఇంగ్-వెన్ మీడియాకు తెలియజేశారు. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకునప్పటికీ 2024 వరకు ఆమె తైవాన్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. మేయర్లు, కౌంటీ చీఫ్‌లు, లోకల్ కౌన్సిలర్లు.. ఇలా జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలే అయినా ఈ ఎలక్షన్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారామె. చైనా విధానాలకు, మిలిటరీ ఉద్రిక్తతల పట్ల తైవాన్ ప్రజల నుంచి ఏమేర వ్యతిరేకత ఉందో ప్రపంచానికి తెలియజేసేందుకు.. ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సాయ్ ఇంగ్-వెన్ భావించారు. కానీ, ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. చైనా వ్యతిరేకత ప్రచారం వర్కవుట్ కాలేదు. ఇక చైనా నుంచి పరోక్ష మద్దతు ఉన్న కోమింటాంగ్ (KMT)పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రచార సమయంలో డీపీపీ చైనా వ్యతిరేక గళం వినిపించగా.. కేఎంటీ మాత్రం చైనాతో డీపీపీ ప్రభుత్వ వైరం శ్రుతి మించుతోందని, అది దేశానికి ప్రమాదకరమని ప్రచారం చేసింది. అయినప్పటికీ తాము చైనాకు కొమ్ము కాయబోమని.. తైవాన్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం సంప్రదింపులు జరుపుతామన్న ప్రచారంతో జనాల్లోకి దూసుకెళ్లింది. ఇక శనివారం వెలువడిన తైవాన్ స్థానిక ఎన్నికల ఫలితాల్లో.. 21 నగర మేయర్ స్థానాలకు గానూ పదమూడింటిని కైవసం చేసుకుంది కేఎంటీ. అందులో రాజధాని తైపేయి కూడా ఉంది. కౌంటీ చీఫ్ సీట్ల సంఖ్యను సైతం పెంచుకుంది. అయితే.. గత ఎన్నికల్లో మాదిరే ఈ దఫా ఎన్నికల్లోనూ సైతం డీపీపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. 2018లో డీపీపీ కేవలం ఐదు స్థానాలే దక్కించుకోగా.. చైనాను ఎదుర్కొంటున్న పరిణామాలు జనాల నుంచి సానుకూల ఫలితాలు తెప్పిస్తాయని భావించింది. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ ఐదు స్థానాలే కైవసం చేసుకుంది. అందులో పెద్దగా ప్రభావితం చూపని ప్రాంతాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఫలితంపై చైనా ఇంకా స్పందించలేదు. కానీ, జిన్హువా వార్తా సంస్థ మాత్రం తైవాన్ స్థానిక ఎన్నికల్లో పార్టీ పనితీరుకు బాధ్యత వహిస్తూ సాయ్ రాజీనామా చేశారంటూ ఓ కథనం ప్రచురించింది. ఇదిలాఉంటే.. కరోనా సమయంలో తైవాన్ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. అందరికంటే ముందే మేల్కొని లాక్డౌన్ విధించకుండా.. కేసుల ట్రేసింగ్‌పై దృష్టి సారించారు ఆమె. తద్వారా తైవాన్‌లో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. ఈ ఘనతకు గానూ 2020 ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో సాయ్ ఇంగ్-వెన్కి చోటు దక్కింది. ఇప్పటికీ తైవాన్ ప్రయాణాలకు కరోనా నెగెటివ్ ఫలితం.. అదీ ప్రయాణానికి మూడు రోజుల ముందు తీసుకున్న సర్టిఫికెట్‌ను ఎయిర్పోర్ట్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: పుతిన్‌కి భంగపాటు.. అస్సలు ఊహించి ఉండడు! -
తైవాన్‌కు మద్దతు తెలిపిన అమెరికా ప్రజాప్రతినిధులు
తైపీ: తైవాన్ను దురాక్రమణ చేయాలని చైనా రంకెలు వేస్తున్న నేపథ్యంలో అయిదుగురు అమెరికా ప్రజాప్రతినిధులు ఆకస్మికంగా ఆదేశానికి వెళ్లారు. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ను శుక్రవారం కలుసుకున్నారు. తైవాన్ స్వయం పాలనకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా తైవాన్, చైనా మధ్య ఘర్షణలు తారాస్థాయికి వెళ్లాయి. తైవాన్ స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా అధినేత బైడెన్‌కు ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. -
"మేం ఒత్తిడికి తలొగ్గుతామని భ్రమపడొద్దు"
తైవాన్: బీజింగ్ ఎంత ఒత్తిడికి గురి చేసిన తైవాన్ తలొగ్గదని ప్రజాస్వామ్య జీవన విధానాన్ని రక్షించుకోగలదంటూ తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ తన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తైవాన్ ప్రజలు నిరంతరం తమ దేశంపై చైనా ఎప్పుడు దాడి చేసి ఆక్రమించేస్తోందేమో అన్న భయంతోనే జీవిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ కూడా తాము ఏదో ఒక రోజు తైవాన్‌ని ఆక్రమించుకుంటామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: బుడిబుడి నడకల బుడతడు డ్యాన్స్ చేసి అదరగొడుతున్నాడు) ఈ మేరకు తైవాన్ అధ్యక్షురాలు మాట్లాడుతూ..."మనం ఎంత ఎక్కువ సాధిస్తే చైనా నుంచి మనం అంత ఒత్తిడి ఎదుర్కొంటాం. చైనా నిర్దేశించిన మార్గంలో పయనించమని మనల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. తైవాన్ ఎప్పుడూ ప్రజాస్వామ్య రక్షణకే మొదటి ప్రాధాన్యతనిస్తుంది. అంతేకాదు బీజింగ్‌తో సంబంధాలను సడలించుకోవాలని నిర్ణయించుకున్నాం. తైవాన్ ప్రజలు ఒత్తిడికి తలొగ్గుతారని భ్రమపడొద్దు" అంటూ ఛైనాకు హెచ్చరికలు జారీ చేశారు. (చదవండి: సైక్లోథాన్‌తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు") -
పంది మాంసంతో పార్లమెంటులో రచ్చ
తైపీ: పంది మాంసం, బీఫ్ దిగుమతి విషయంలో విధానాల రూపకల్పన గురించి చర్చించే క్రమంలో తైవాన్ పార్లమెంటులో రసాభాస చోటుచేసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షం పంది అవయాలు, మాంసాన్ని అధికార పార్టీ నాయకులపై విసిరారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాలు... చైనాకు కంటిలో నలుసులా తయారైన తైవాన్ గత కొన్ని రోజులుగా అగ్రరాజ్యం అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. దౌత్యపరంగా ఇరు దేశాల మధ్య అధికారికంగా ఎలాంటి ఒప్పందాలు లేనప్పటికీ డబ్ల్యూహెచ్ఓలో సభ్యత్వం, రక్షణ రంగం తదితర అంశాల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తైవాన్‌కు అండగా నిలిచింది. ఈ క్రమంలో అధ్యక్షురాలు త్సాయి ఇంగ్- వెన్ అమెరికాతో వాణిజ్య బంధం ఏర్పరచుకునేందుకు సంకల్పించారు. ఇందులో భాగంగా పంది మాంసాన్ని దిగుమతి చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే తైవాన్‌లో పోర్క్‌పై గత కొన్నేళ్లుగా నిషేధం ఉంది. దీనిని ఎత్తివేస్తూ ఆగష్టులో నిర్ణయం తీసుకున్న త్సాయి సర్కారు, జనవరి నుంచి అమల్లోకి వచ్చేలా విధానాలు రూపొందించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రీమియర్ సూ త్సెంగ్- చాంగ్ శుక్రవారం పార్లమెంటు ఎదుట ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేషనలిస్టు పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంది మాంసాన్ని సభలోకి తీసుకువచ్చి, అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పా(డీపీపీ) నాయకుల ముందు విసిరికొట్టగా.. వారు సైతం దీటుగానే బదులిచ్చారు. (చదవండి: తైవాన్‌పై దాడికి చైనా కుట్ర!) అధికారంలోకి రాగానే మద్దతు! ఈ ఘర్షణలో సహనం కోల్పోయిన డీపీపీ నేత ప్రతిపక్ష నేతతో మల్లయుద్ధానికి దిగారు. ఈ విషయం గురించి నిరసనకు నాయకత్వం వహించిన నేషనలిస్ట్ పార్టీ నేత లిన్ వే- చౌ మాట్లాడుతూ.. ‘‘మీరు ప్రతిపక్షంలో ఉన్నపుడు అమెరికా పోర్క్‌ను వ్యతిరేకించారు. అధికారంలోకి రాగానే మాటమార్చారు. యూఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు’’ అంటూ త్సాయి ఇంగ్-వెన్ పార్టీని విమర్శించారు. అయితే డీపీపీ నేతలు మాత్రం ప్రీమియర్‌ను అడ్డుకోవడం సరికాదని, శాంతియుత వాతావరణంలో ఈ విషయం గురించి చర్చించాలంటూ విజ్ఞప్తి చేయడం విశేషం. కాగా పోర్క్, బీఫ్ వినియోగంపై నిషేధాన్ని ఎత్తివేయడం పట్ల ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.(చదవండి: అమెరికాపై డ్రాగన్ ఫైర్.. తైవాన్ కౌంటర్!) -
నిజంగా మా అదృష్టం: తైవాన్ అధ్యక్షురాలు
తైపీ: భారతీయ వంటకాలంటే తమ ప్రజలకు ఎంతో ఇష్టమని, తాను కూడా అందుకు అతీతం కాదని తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్-వెన్ అన్నారు. భారత రెస్టారెంట్లు తమ దేశంలో ఉండటం నిజంగా అదృష్టం అంటూ కొనియాడారు. ఛాయ్ తాగినపుడు భారత్‌లో తనకు ఉన్న అందమైన జ్ఞాపకాలన్నీ గుర్తుకువస్తాయంటూ అభిమానం చాటుకున్నారు. ఈ మేరకు.. ‘‘ఎన్నెన్నో ఇండియన్ రెస్టారెంట్లకు తైవాన్ నివాసంగా ఉండటం అదృష్టం. తైవాన్ ప్రజలు వాటిని ఎంతగానో ఇష్టపడతారు. నేనైతే ఎల్లప్పుడూ చనా మసాలా, నాన్ తీసుకుంటాను. ఇక ఛాయ్ తాగితనప్పుడల్లా, ఇండియా ప్రయాణం తాలూకు విశేషాలన్నీ జ్ఞాపకం వస్తాయి. విభిన్నమైన, రంగులతో కూడిన దేశం’’ అని ట్వీట్ చేశారు. అంతేగాక.. ‘‘మీకిష్టమైన భారతీయ వంటకాలు ఏమిటి?’’ అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. ఇక త్సాయి ఇంగ్- వెన్ ట్వీట్‌కు స్పందించిన భారత నెటిజన్లు.. ఆమెకు ధన్యవాదాలు చెబుతూనే, ఇండియన్ ఫుడ్ నచ్చనివారు ఎవరూ ఉండరు అంటూ తమ స్పందన తెలియజేస్తున్నారు. (చదవండి: తైవాన్ ప్రజలకు భారత నెటిజన్ల విషెస్) అదే విధంగా, తైవాన్ ప్రజలు సైతం ప్రెసిడెంట్‌కు ఇష్టమైన భోజనం తమకు కూడా నచ్చుతుందని, వారానికి రెండుసార్లైనా ఇండియన్ రెస్టారెంట్లను సందర్శిస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా తైవాన్ నేషనల్ డే సందర్భంగా కూడా అత్యధిక సంఖ్యలో భారత ప్రజలు సోషల్ మీడియా వేదికగా త్సాయి ఇంగ్- వెన్, తైవాన్ పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక గత నాలుగేళ్లుగా చైనా పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, తన ఉనికి చాటుకుంటున్న తైవాన్ ప్రభుత్వం, ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికా అండతో విమర్శలకు పదునుపెడుతూ, డ్రాగన్ దేశానికి కంటిలో నలుసులా తయారైంది. (చదవండి: చైనా లేఖ; గెట్ లాస్ట్ అన్న తైవాన్!) సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న చైనాకు దీటుగా బదులిస్తున్న తైవాన్, అక్టోబరు 10న నేషనల్ డే సందర్భంగా డ్రాగన్‌తో ఉపయుక్తమైన చర్చలకు సిద్ధమని చెబుతూనే, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని, ప్రజాస్వామ్య విలువలకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. అటు అమెరికాతోనూ, ఇటు భారత్‌తోనూ స్నేహ బంధాన్ని పెంపొందించుకుంటూ చైనాకు సవాల్ విసురుతోంది. #Taiwan is lucky to be home to many Indian restaurants, & Taiwanese people love them. I always go for chana masala and naan, while #chai always takes me back to my travels in #India, and memories of a vibrant, diverse & colourful country. What are your favourite Indian dishes? pic.twitter.com/IJbf5yZFLY — 蔡英文 Tsai Ing-wen (@iingwen) October 15, 2020 -
ట్రంప్ పై ప్రతీకారం తీర్చుకుంటాం: చైనా
బీజింగ్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు చైనా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. వన్-చైనా పాలసీపై జోక్యం చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు చైనీస్ ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్ టైమ్స్ లో కథనం ప్రచురించింది. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ ఆదివారం అమెరికాలో ప్రత్యక్షం కావడంతో చైనా మరోసారి మండిపడింది. మధ్య అమెరికాలు దేశాలు హోండురస్, నికారాగువా, గ్వటెమాలా, ఈఐ సాల్వడార్ పర్యటనకు వెళుతూ సాయ్ ఇంగ్ వెన్.. ఫ్లోరిడాలో ఆగారు. రిపబ్లికన్ పార్టీ నాయకులతో ఆమె భేటీ అయ్యారు. సాయ్ ఇంగ్ వెన్ తో సమావేశమైన ఫొటోను టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ట్విటర్ లో ఫోస్ట్ చేశారు. టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ తోనూ ఆమె చర్చలు జరిపారు. సాయ్ ఇంగ్ వెన్ ను అమెరికాలో అడుగుపెట్టనీయరాదని వాషింగ్టన్ ను చైనా కోరింది. వన్-చైనా పాలసీ కింద ఎటువంటి అధికారిక సమావేశాలు జరిపే అధికారం తైవాన్ అధ్యక్షురాలికి లేదని చైనా పేర్కొంది. ‘అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వన్-చైనా పాలసీపై ట్రంప్ జోక్యం చేసుకుంటే ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని చైనా ప్రజలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎటువంటి బేరసారాలకు తావులేద’ని గ్లోబల్ టైమ్స్ రాసింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తైవాన్ తో దౌత్యసంబంధాలు పునరుద్ధరిస్తానని ట్రంప్ సూచనప్రాయంగా వెల్లడించడంతో చైనా ఉలిక్కిపడుతోంది. తైవాన్ తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తోంది.