బీజింగ్: తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్ అమెరికాలో పర్యటించడాన్ని సహించని చైనా ఆగ్రహంతో రగిలిపోతోంది. ఎనిమిది యుద్ధనౌకలు, 71 యుద్ధవిమానాలను మోహరించి తైవాన్ సముద్రజల్లాల్లో ఉద్రిక్తత ను మరింత పెంచింది. తమ అధ్యక్షురాలు అమెరికాలో పర్యటించడంతో అక్కసుతో చైనా ఇలాంటి బెదిరింపు చర్యలకు దిగుతోందని తైవాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
45 యుద్ధవిమానాలు ‘మిడిల్‌లైన్’ను దాటి మరీ తమ ప్రాదేశిక జలాలపై చక్కర్లు కొడుతున్నాయని తైవాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘యుద్ధ సన్నద్ధత గస్తీ’ మాటున మూడ్రోజులపాటు నౌకాదళ సంపత్తిని చైనా రంగంలోకి దించింది. అమెరికా పర్యటనలో భాగంగా తైవాన్ అధ్యక్షురాలు త్సాయి గురువారం కాలిఫోర్నియాలో అమెరికా పార్లమెంట్ ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీతో భేటీ అయ్యారు. దీంతో కోపం తెచ్చుకున్న చైనా పలు అమెరికన్ సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment