న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇరుపార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చైనా.. తైవాన్ జోలికి వెళ్లితే ఆ దేశంపై అదనపు సుంకాలను విధిస్తానన్నారు.
‘‘నేను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే చైనా.. తైవాన్ జోలికి వెళితే. నేను మీకు 150 శాతం నుంచి 200 శాతం వరకు పన్ను విధిస్తాను’’ అని అన్నారు. తైవాన్‌పై చైనా చేసే.. ఆక్రమణకు వ్యతిరేకంగా సైనిక శక్తిని ఉపయోగిస్తారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ఇప్పటివరకు అయితే.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తనను గౌరవిస్తున్నారని, అటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు.
Republican presidential candidate Donald Trump said he would impose additional tariffs on #China if China were to "go into #Taiwan," the Wall Street Journal reported. https://t.co/muSDebjnxH
— William Yang (@WilliamYang120) October 19, 2024
ఇటీవల ట్రంప్ దిగుమతి సుంకాల విషయంపై స్పందిస్తూ.. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి సుంకాలు విధించే దేశమని అన్నారు. తాను అధ్యక్షుడిగా గెలిస్తే అమెరికాకు భారత్ ఎగుమతులపై తానూ సమానస్థాయిలో పన్నులు విధిస్తానని స్పష్టం చేశారు. విదేశీ వస్తువులపై భారత్‌లోనే దిగుమతి సుంకాలు అత్యధికమని అన్నారు.
చదవండి: తైవాన్‌ను దిగ్బంధించిన డ్రాగన్
Comments
Please login to add a commentAdd a comment