న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి గన్‌లతో సంచరించటం కలకలం రేపింది.
కాలిఫోర్నియాలోని కోచెల్లాలో నిర్వహించిన ట్రంప్ ర్యాలీ సందర్భంగా ఓ వ్యక్తి రెండు గన్‌లతో సంచరించాడని ట్రంప్ రక్షణ సహాయకుల బృందం షెరీఫ్ తెలిపింది. అక్రమ షాట్‌గన్ , లోడ్ చేసిన తుపాకీని స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రివర్‌సైడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఆదివారం ప్రకటించింది.
A man was arrested near Trump's rally in Coachella, California, on Saturday and charged with illegal possession of a loaded firearm and high-capacity magazine, according to the Riverside County Sheriff. pic.twitter.com/xFPVdUyMeo
— ANI (@ANI) October 14, 2024
ఈ విషయంపై తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. తాము వెంటనే అప్రమత్తమయ్యాయని, ట్రంప్‌నకు, ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించారు. గన్‌లను పట్టుకొని సంచరించిన నిందితుడిని లాస్‌వెగాస్‌కు చెందిన వెమ్ మిల్లర్‌గా పోలీసులు గుర్తించారు. ట్రంప్‌పై ఇది మూడో హత్యాయత్నంగా అధికారులు అనుమానిస్తున్నారు.
‘‘ఈ ఘటనలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది’ అని అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులను రక్షించే కల్పించే ఎఫ్‌బీఐ, యూఎస్ అటార్నీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. లాస్ వెగాస్‌కు చెందిన 49 ఏళ్ల వెమ్ మిల్లర్ బెయిల్‌పై విడుదలయ్యాడని, జనవరి 2న కోర్టు విచారణను ఎదుర్కొంటాడని షెరీఫ్ బృందం తెలిపింది.
జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ ట్రంప్ చెవికి తగులుతూ పక్కకు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ట్రంప్ తృటిలో హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. అదేవిధంగా సెప్టెంబరులో ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన పామ్ బీచ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర ఆయన్ను హత్య చేయడానికి 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ వ్యక్తి రైఫిల్‌తో సంచరించినట్లు గుర్తించి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment