సాక్షి, హైదరాబాద్: డెంగీ జ్వరాన్ని ఆరోగ్య శ్రీ పరిధిలోనికి తీసుకురావాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజానీకాన్ని డెంగీ పట్టిపీడిస్తోందని ఆవే దన వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా హాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ స్పందించి డెంగీను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా పేదల ఆరోగ్యాన్ని, వారి ఖర్చును కాపాడాలని కోరారు. కేన్సర్ చికిత్సకు కూడా రూ.లక్షలు ఖర్చవుతోందని, కేన్సర్ రోగుల కోసం ధనిక భక్తుల సాయంతో చినజీయర్ స్వామి చికిత్స చేయించాలని కోరారు.
ఇందుకోసం ఓ ట్రస్టు పెట్టి పేదలకు సేవ చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు, చినజీయర్ స్వామికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జగ్గారెడ్డి సీఎంను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment