తాడికొండ: చంద్రబాబుకు మతిభ్రమించి రోడ్లపై సభలు పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 829వ రోజుకు చేరాయి. పలువురు మాట్లాడుతూ పేద ప్రజల మాన ప్రాణాలు పోతుంటే చంద్రబాబు ఇంకా రోడ్‌షోలు అంటూ రోడ్లపై సంచారం చేయడం సిగ్గుచేటని, ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్న బాబును ప్రజలు నమ్మే పరిస్థితి ఎప్పటికీ ఉండదన్నారు.
ప్రజల ప్రాణాలపై స్పందించని ప్యాకేజీ పార్టీలు, ఎల్లో మీడియాలో లేనిది ఉన్నట్లు ప్రచారం చేసేందుకు డిబేట్‌లలో గగ్గోలు పెడుతుండడం దేనికి నిదర్శనమో చెప్పాలని డిమాండ్ చేశారు. బహుజనుల హక్కుల కోసం 829 రోజులుగా ఆకలి దప్పులతో పోరాటం చేస్తుంటే కనీసం తొంగి చూడని ఎల్లో మీడియా, కులవాదులు, కులగజ్జి పార్టీలు, బాబు కోసం బారులు తీరడం వెనుక ఆంతర్యమేమిటో అందరికీ అర్థమవుతుందని తెలిపారు. నేడు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధికి అన్ని విధాలా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాటుపడుతున్నారనడంలో సందేహం లేదన్నారు. నాయకులు మాదిగాని గురునాథం, పెరికే వరప్రసాద్, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రోడ్లపై సభలు వద్దంటే రభసా?
Comments
Please login to add a commentAdd a comment