Bahujana Parirakshana Samithi
-
మూడు రాజధానులకు మద్దతుగా బహుజనుల దీక్షకు 1200 రోజులు
-
బహుజనుల పోరాటానికి 951 రోజులు
తాడికొండ: అమరావతిలో అందరికీ సమాన హక్కులు.. అన్ని కులాల వారికీ సమాంతర జీవన హక్కులు కల్పించాలని కోరుతూ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం శనివారం 951వ రోజుకు చేరింది. బహుజనుల హక్కులను హరిస్తూ.. కులవాదంతో చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా 2020 మార్చి 9న రిలే దీక్షలు చేపట్టిన ఉద్యమం ఇప్పటికీ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం నుంచి అసెంబ్లీకి వెళ్లే సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. మూడు రాజధానులు వద్దంటూ న్యాయస్థానం నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చిన కులవాదుల ఆట కట్టించేందుకు బహుజన పరిరక్షణ పేరుతో 266 దళిత సంఘాలు, ప్రజాసంఘాలు పోరాటానికి దిగాయి. ఇందులో 70 సంఘాలు ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యమం నిర్వహిస్తుండగా.. 194 సంఘాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పక్క రాష్ట్రాల నుంచి మద్దతు తెలిపాయి. ఒకే అంశంపై సుదీర్ఘంగా పోరాటం చేసిన ఏకైక ఉద్యమం బహుజన పరిరక్షణ సమితి ఉద్యమంగా ఈ ఉద్యమం చరిత్రకెక్కింది. బహిరంగ నిరసనతో కడకంటూ పోరాటం.. అమరావతిలో 54 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలతోపాటు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. కులవాదులు కోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు తెచ్చారు. సీఆర్డీయే చట్టంలో పొందుపరచిన ప్రకారం 5 శాతం భూమిని పేదలకు కేటాయించి.. శాటిలైట్ సిటీ కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. పేదలు ఈ ప్రాంతంలో ఉంటే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందంటూ కులవాదంతో అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య అందకుండా చేసేందుకు కుట్ర పన్నిన కులవాదులు కార్పొరేట్ స్కూళ్లతో కుమ్మక్కై తప్పుడు కేసులు వేయించారు. పూలింగ్ పేరిట ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా.. రైతుల ముసుగులో కులవాదులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేవ్ అమరావతి పేరిట దొంగ ఉద్యమం చేపట్టారు. ఇలాంటి ఆగడాలపై బహుజన పరిరక్షణ ఉద్యమం కన్నెర్ర చేసింది. వారి ఆగడాలను ఎండగడుతూ బహుజనుల కలలు సాకరమయ్యే వరకు కడకంటూ పోరాటం కొనసాగిస్తోంది. అడ్డంకులు ఎదురైనా.. 2020 నవంబర్‌లో ఉద్దండరాయుని పాలెంలో ఎంపీ నందిగం సురేష్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు బహుజన పరిరక్షణ సమితి నాయకులు వెళితే అమరావతి శిబిరంలో ఉన్న కులవాదులు రాళ్లతో దాడి చేశారు. బహుజనులపై కవ్వింపు చర్యలకు పాల్పడి దుర్భాషలాడుతూ దాడులకు తెగబడ్డారు. దీనిపై కూడా పోలీసు కేసులు నమోదయ్యాయి. కాగా, 2021 ఫిబ్రవరి 21న కులవాదులంతా కలిసి ఆటోలలో ఉద్యమానికి వస్తున్న మహిళలపై దాడులకు తెగబడ్డారు. రైతుల ముసుగులో ఉన్న విచక్షణ రహితంగా దాడులు చేయడంతో మహిళలు సైతం దెబ్బలు తిని ఇబ్బందులకు గురయ్యారు. వీటన్నింటిని తట్టుకుని నిలబడి ఉద్యమం చేస్తున్న వారిపై బెదిరింపులకు పాల్పడినా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. ‘ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటే బాబుకు మంచిది’ శనివారం నాటి 951వ రోజు దీక్షలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుతో అయినా చంద్రబాబు తన తప్పుడు విధానాలను మార్చుకోవాలని.. కోర్టు తీర్పును స్వాగతించి పేదలకు ఈ ప్రాంతంలో అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. అలా కాదని వ్యవస్థలను ప్రలోభాలకు గురిచేసి బహుజనుల్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇస్తే వామపక్షాలు, ఇతర పార్టీలు స్వాగతించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం, న్యాయవాది పెరికే వరప్రసాద్, వివిధ సంఘాల నాయకులు నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, ఈపూరి ఆదాం, పులి దాసు, బొలిమేర శ్యామ్యూల్, పల్లె బాబు, కారుమూరి పుష్పరాజ్ తదితరులు ఉన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పేదల పక్షపాతి అని మరోసారి రుజువు
-
సిసలైన సైకో చంద్రబాబు నాయుడే
తాడికొండ: ఓట్ల కోసం తోక పార్టీలతో కలిసి కులవాదులు డ్రామాలాడుతున్నారని బహుజన పరిరక్షణ సమితి నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 832వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో శనివారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. పేదలకు ఇంగ్లిషు మీడియం విద్య అందకుండా కోర్టుల్లో కేసులు వేయడంతో పాటు, వికేంద్రీకరణ జరగనీయకుండా అడ్డుకుంటున్న చంద్రబాబును జనం తరిమికొట్టడం ఖాయమన్నారు. మామ దగ్గర సైకిల్‌ను దొంగిలించి.. సైకో రాజకీయాలు చేస్తూ జనంలో తిరుగుతున్న సిసలైన సైకో చంద్రబాబేనని ధ్వజమెత్తారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో ప్రజలు చనిపోతే కనీసం చలించకుండా ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ కుప్పంలో పర్యటనలు చేయడమంటే ప్రజలను రెచ్చగొట్టడం కాదా.. అని ప్రశ్నించారు. బహుజనులను బలిచేస్తున్న దొంగ సభలను రద్దుచేయకుంటే ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. ప్రచారార్భాటాల కోసం చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అధికారమే పరమావధిగా బాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరనేది గుర్తుంచుకుంటే మంచిదని, ఇకనైనా కళ్లు తెరిచి పేదల పక్షాన నిలువకపోతే ఆయనను ప్రజల్లో తిరగకుండా అడ్డకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నేతలు మాదిగాని గురునాథం, బొలిమేర శామ్యూల్, పెరికే వరప్రసాద్, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం, కారుమూరి పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: కందుకూరు, గుంటూరు ఘటనలపై విచారణ కమిషన్ -
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు
తాడికొండ: చంద్రబాబుకు మతిభ్రమించి రోడ్లపై సభలు పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 829వ రోజుకు చేరాయి. పలువురు మాట్లాడుతూ పేద ప్రజల మాన ప్రాణాలు పోతుంటే చంద్రబాబు ఇంకా రోడ్‌షోలు అంటూ రోడ్లపై సంచారం చేయడం సిగ్గుచేటని, ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్న బాబును ప్రజలు నమ్మే పరిస్థితి ఎప్పటికీ ఉండదన్నారు. ప్రజల ప్రాణాలపై స్పందించని ప్యాకేజీ పార్టీలు, ఎల్లో మీడియాలో లేనిది ఉన్నట్లు ప్రచారం చేసేందుకు డిబేట్లలో గగ్గోలు పెడుతుండడం దేనికి నిదర్శనమో చెప్పాలని డిమాండ్ చేశారు. బహుజనుల హక్కుల కోసం 829 రోజులుగా ఆకలి దప్పులతో పోరాటం చేస్తుంటే కనీసం తొంగి చూడని ఎల్లో మీడియా, కులవాదులు, కులగజ్జి పార్టీలు, బాబు కోసం బారులు తీరడం వెనుక ఆంతర్యమేమిటో అందరికీ అర్థమవుతుందని తెలిపారు. నేడు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధికి అన్ని విధాలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటుపడుతున్నారనడంలో సందేహం లేదన్నారు. నాయకులు మాదిగాని గురునాథం, పెరికే వరప్రసాద్, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రోడ్లపై సభలు వద్దంటే రభసా? -
పేదలను బలిగొంటున్న బాబు ప్రచారార్భాటం
తాడికొండ: తన ప్రచారార్భాటంతో పేదల ప్రాణాలను బలిగొంటున్న చంద్రబాబును తక్షణమే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల 827వ రోజు సోమవారం పలువురు మాట్లాడారు. పబ్లిసిటీ పిచ్చితో పేదలకు తాయిలాలు ఇస్తామని ఆశపెడుతూ చంద్రబాబు పెడుతున్న మీటింగులకు వెళ్లిన పేద ప్రజలు అమాయకంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం సీఆర్డీయేకు భూములు అమ్ముకుని రిటర్నబుల్ ప్లాట్లు పొందిన కులవాదులు.. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములిచ్చామని చెప్పడం మోసపూరితం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చంద్రబాబు శనిలా తయారయ్యాడన్నారు. బహుజనులు 827 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే తమ పచ్చ పత్రికల్లో ప్రచురించకుండా రాష్ట్రంలో కులవాదాన్ని రెచ్చగొడుతున్న మీడియాపై చర్యల కోసం త్వరలో ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బాబు ఆయన ఎల్లో మీడియా, బినామీలు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి సత్తా చాటుతామని హెచ్చరించారు. నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం -
ప్రజా ప్రయోజనాలకు అడ్డుపడితే సహించేది లేదు
తాడికొండ: కులవాదంతో కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలకు అడ్డుపడితే సహించేది లేదని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో 3 రాజధానులకు మద్దతుగా సమితి ఆధ్వర్యంలో 826వ రోజు కొనసాగుతోన్న రిలే నిరాహార దీక్షలకు ఆదివారం పలువురు హాజరయ్యారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కార్యకలాపాలను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి బొత్స ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు సమావేశాలు నిర్వహిస్తూ వారి ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడని నేతలు మండిపడ్డారు. కందుకూరు ఘటన జరిగిన తరువాత అయినా కనీస జాగ్రత్తలు పాటించకుండా గుంటూరులో సమావేశం నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న చంద్రబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం, పులి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. -
ముంపు ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని ఎవరు చెప్పారు బాబు?
తాడికొండ : ఏపీలో రాజధాని ఏర్పాటుకు వేసిన జీఎన్‌రావు, బోస్టన్, శివరామకృష్ణన్ నిపుణుల కమిటీల నివేదికలు అమరావతిలో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకం కాదా చంద్రబాబూ.. అని బహుజన పరిరక్షణ సమితి నేతలు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 798వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆదివారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఆ నాడు నిపుణుల కమిటీలు అటవీ భూములు లేదా, దొనకొండ ప్రాంతం, అభివృద్ధి చెందిన విశాఖ నగరం, ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న మరేదైనా ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు ప్రతిపాదించాయనేది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. మూడు పంటలు పండే భూములను నాశనం చేసి ముంపు ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని ఎవరైనా చెప్పారేమో.. బాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. కులపిచ్చి, కులగజ్జితో నిండిన బాబు ఆయన వత్తాసుదారులు.. సీఎంగా వైఎస్ జగన్‌ను చూడలేక తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు సిద్ధమయ్యారని, ఇందుకోసం అమరావతి పేరుతో రైతులను అడ్డుగా పెట్టి దొంగ ఉద్యమం చేయించారని ఆరోపించారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్న చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ నమ్మరని హెచ్చరించారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నేతలు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, పులి దాసు, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. -
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు 12 నుంచి గ్రామసభలు
తాడికొండ: రాజధానిలో 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గతంలో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని రాజధాని పూలింగ్‌కు భూములిచ్చిన 29 గ్రామాలతో అమరావతి మెట్రోపాలిటన్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించగా తుళ్ళూరు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటూ రాజధాని అభివృద్ధికి అడుగులు వేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని నాన్ పూలింగ్ గ్రామాల ప్రజలు తమను కూడా మున్సిపాలిటీలో చేర్చాలని కోరిన నేపథ్యంలో ఆయా గ్రామాలను కూడా మున్సిపాలిటీలో కలిపేందుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా తుళ్ళూరు మండలంలోని పూలింగ్‌కు భూములిచ్చిన 16 గ్రామాలతో పాటు నాన్ పూలింగ్ గ్రామాలైన పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు గ్రామ పంచాయతీలను కలుపుతూ 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా శుక్రవారం గ్రామసభల షెడ్యూల్ ప్రకటించారు. ఈ గ్రామసభల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, వివరణలు సేకరించి తీర్మానం చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. తుళ్ళూరు ఎంపీడీవో శ్రీనివాసరావు శుక్రవారం ఈవోఆర్డీ సత్యకుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు సమావేశమై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12వ తేదీ సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. గ్రామసభల షెడ్యూల్ 12వ తేదీ లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రపురం, 13వ తేదీ దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, 14వ తేదీ వెంకటపాలెం, మందడం, ఐనవోలు, 15వ తేదీ నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, రాయపూడి, 16వ తేదీ మల్కాపురం, వెలగపూడి, పెదపరిమి, 17వ తేదీ శాఖమూరు, నేలపాడు, తుళ్ళూరు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల ప్రజలు గ్రామసభలకు హాజరై వారి అభిప్రాయాలను తెలపాలని ఎంపీడీవో కోరారు. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం 712వ రోజు రిలే నిరాహార దీక్షల్లో బహుజన పరిరక్షణ సమితి నాయకులు అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 712వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహర దీక్షల్లో శుక్రవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అమరావతి రైతులను మోసగించి మూడుపంటలు పండే 33 వేల ఎకరాలను పూలింగ్‌కు తీసుకున్న చంద్రబాబు వారికి ఏం న్యాయం చేశాడో చెప్పాలన్నారు. (క్లిక్ చేయండి: టీడీపీ నేత అనితకు బ్యాంకు నోటీసులు) రాష్ట్రంలోని 5 కోట్లమంది ప్రజల సంపదను ఒక ప్రాంతంలోనే కుమ్మరిస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహా నగరాల సరసన అమరావతిని చేరుస్తానంటూ మోసపూరిత హామీలతో చంద్రబాబు 29 గ్రామాల రైతులతో పాటు రాష్ట్ర ప్రజలను నమ్మించి భారీ అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలు వడివడిగా కొనసాగుతున్నాయని చెప్పారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
కులవాదులకు తగిన శాస్తి తప్పదు
తాడికొండ: తమకు హక్కులు అందకుండా కుట్ర పన్నుతున్న కులవాదులకు తగిన శాస్తి తప్పదని, కోర్టులో వేసిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోపోతే బాబు అండ్ కోను రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. మూడు రాజధానులకు మద్దతుగా వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 691వ రోజుకు చేరుకున్నాయి. పలువురు ప్రసంగిస్తూ, కులవాదమే అజెండాగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమంలో టీడీపీ నాయకులు, ప్యాకేజీ పార్టీలు, దళిత దళారులు మినహా ప్రజల మద్దతు లేదన్నారు. అధికారంలో ఉండి భూములిచ్చిన రైతులకు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా నట్టేట ముంచిన చంద్రబాబును నిలదీయకుండా ఉండేందుకు ముందస్తు ఎత్తుగడతో అమరావతి ఉద్యమం పేరుతో దొంగ దీక్షలకు శ్రీకారం చుట్టడం సిగ్గుచేటన్నారు. అరసవెల్లి పేరుతో చందాల యాత్రలకు శ్రీకారం చుట్టిన అమరావతి జేఏసీ నాయకులకు కోట్లాది రూపాయలు ఎక్కడనుంచి అందుతున్నాయో నిఘా వేసి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఎత్తుగడలు వేస్తున్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో సమితి నాయకులు గురునాథం, సాంబయ్య, జోషి, ఈపూరి ఆదాం, దాసు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం)