తాడికొండ: కులవాదంతో కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలకు అడ్డుపడితే సహించేది లేదని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో 3 రాజధానులకు మద్దతుగా సమితి ఆధ్వర్యంలో 826వ రోజు కొనసాగుతోన్న రిలే నిరాహార దీక్షలకు ఆదివారం పలువురు హాజరయ్యారు.
విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కార్యకలాపాలను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి బొత్స ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు సమావేశాలు నిర్వహిస్తూ వారి ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడని నేతలు మండిపడ్డారు. కందుకూరు ఘటన జరిగిన తరువాత అయినా కనీస జాగ్రత్తలు పాటించకుండా గుంటూరులో సమావేశం నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న చంద్రబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం, పులి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment