public interest
-
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: చదువు – లోకహితం కోసమే
రామాయణంలో ఒక చోట ‘‘సర్వే వేద విదః శూరః సర్వే లోకహితే రతః /సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః’’ అని ఉంటుంది. రామలక్ష్మణ భరత శతృఘ్నులకు గురువులు ఎన్నో విషయాలు నేర్పారు.ఎన్ని నేర్పినా, వాళ్ళకు నేర్పుతున్నప్పుడే అంతర్లీనంగా ఒక బోధ చే శారు. ‘‘ఈ చదువు మీకు ఒక కొత్త విభూతిని కట్టబెడుతుంది. ఈ చదువు మీకు ఒక కొత్త అధికారాన్ని తీసుకొస్తుంది. మీకున్న ఏ విభూతిని కూడా స్వార్థ ప్రయోజనానికి వాడుకోకుండా కేవలం ప్రజాహితానికి మాత్రమే వాడాలి.’’–అని.చదువు లేనివాడు మోసం చేయడానికి సంతకం కూడా పెట్టలేడు. చదువుకున్నవాడు వాడిని పిలిచి నిలదీస్తే వాడు భయపడి ‘ఇంకెప్పుడూ ఇలా చేయనండీ ...’ అంటాడు. కానీ బాగా చదువుకున్నవాడు అందరికీ నియమనిష్టలు చెప్పగలిగినవాడు తప్పు చేసినప్పుడు.. ... తన తప్పును అంగీకరించక΄ోగా అదే ఒప్పు అని సమర్థించుకోవడానికి సవాలక్ష వాదనలు ముందు పెడతాడు. రావణాసురుడికి ఏ విద్యలు తెలియవని!!! అయినా ‘‘స్వధర్మో రక్షసాం భీరు సర్వథైన న సంశయః! గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా!!’’ అని వాదించాడు. ‘నా తప్పేముంది కనుక. నేను రాక్షసుడిని.నా జాతి ధర్మం ప్రకారం నాకు కావలసిన స్త్రీలను అవహరిస్తాను, అనుభవిస్తాను. నేను చూడు ఎంత ధర్మాత్ముడినో’’ అని సమర్ధించుకునే ప్రయత్నం చేసాడు. అంత చదువుకున్నవాడు అంత మూర్ఖంగా వాదిస్తే అటువంటివాడిని అభిశంసించగలిగిన వాడెవడుంటాడు!!! చదువు సంస్కారవంతమై ఉండాలి.సామాజిక నిష్ఠతో ఉండాలి. అందరి మేలు కోరేదై ఉండాలి. విశ్వామిత్రుడుకానీ, వశిష్టుడు కానీ రామలక్ష్మణులకు విద్యను నేర్పించేటప్పుడు ‘ఇంత ధనుర్వేదాన్ని వీళ్లకు అందచేస్తున్నాం. వీళ్ళు తలచుకుంటే ముల్లోకాలను లయం చేయగలరు. అంత శక్తిమంతులవుతారు..’ అన్న ఆలోచనతో దానిని ఎక్కడా దుర్వినియోగపరచకుండా ఉండేవిధంగా విద్యాబోధనలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. నిజానికి రామచంద్రమూర్తి నేర్చుకున్న ధనుర్విద్యా΄ాటవం అటువంటిది. ఆచరణలో ఆయన దానికి పూనుకుంటే ఆపడం ఎవరితరం కాదు. ఆయన బాణ ప్రయోగం చేస్తే అగ్నిహోత్రం కప్పేస్తుంది సమస్త భూమండలాన్ని... అది ప్రళయాన్ని సృష్టించగలదు. కానీ అంత బలాఢ్యుడై ఉండి కూడా రాముడు ఒక్కసారి కూడా స్వార్థం కోసం హద్దుదాటి ఎవరినీ శిక్షించలేదు. అంటే గురువులు ఇచ్చిన విద్య లోకప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగపడాలన్న స్పృహతో ఉండడమే కాదు, అందరికీ తన నడవడిక ద్వారా ఒక సందేశం ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు.రుషులు లోకహితం కోరి మనకు అందించిన పురాణాలు మనల్ని వారికి రుణగ్రస్థుల్ని చేసాయి. ఎప్పుడో వయసు మీరిన తరువాత, పదవీవిరమణ తరువాత చదవాల్సినవి కావు అవి. చిన్నప్పటినుంచి వాటిని చదువుకుంటే, అవగాహన చేసుకుంటే మన జీవితాలు చక్కబడతాయి. అదీకాక రుషిరుణం తీరదు కూడా. ఇది తీరడానికి బ్రహ్మచర్య ఆశ్రమం చాలు. బ్రహ్మచారిగా ఉండగా రామాయణ భారత భాగవతాదులు, ఇతర పురాణాలు, వేదాలు ఏవయినా చదువుకోవచ్చు. కానీ మిగిలిన రెండు రుణాలు–పితృరుణం, దేవరుణం మాత్రం గృహస్థాశ్రమ స్వీకారంతోనే తీరతాయి.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఉచిత ప్రయాణంపై పిల్.. ప్రయోజనం లేదన్న కోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. బస్సులన్ని మహిళలతోనే నిండిపోతున్నాయని టికెట్ తీసుకున్నా సీటు ఉండటం లేదని నాగోలుకు చెందిన హరిందర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్ర రద్దీ పెరిగిందని పిటీషన్లో పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదని హైకోర్టుకు తెలిపారు. ఉచిత ప్రయాణం కోసం జారీ జారీ చేసిన జీఓ 47ను రద్దు చేయాలని హరిందర్ పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ తెలంగాణ హైకోర్టు హరిందర్ దాఖలు చేసిన పిటీషన్లో ఎటువంటి ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొంది. పిటిషనర్ బస్సులో ఇబ్బంది ఎదుర్కొని పిల్ దాఖలు చేశారని ధర్మాసనం తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్‌గా మార్చాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. -
ప్రభుత్వం ఏ బహిరంగ సభను అడ్డుకోలేదు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా.. వాద ప్రతివాదనల తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలను ఓసారి పరిశీలిస్తే.. ‘‘ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించినది.పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని న్యాయస్థానం భావిస్తోంది. అలాగే.. నడి రోడ్డుపై మీటింగ్ పెట్టడానికి ఎవరికీ హక్కు లేదు. నిజానికి ప్రభుత్వం ఏ బహిరంగ సభను అడ్డుకోలేదు. నడి రోడ్డు మీద కాదు, సౌకర్యమున్న చోట సభ పెట్టుకోమని చెప్పింది అని చీఫ్ జస్టిస్ గుర్తు చేశారు. రోడ్‌షోల మీద, ర్యాలీల మీద సర్కార్ ఎలాంటి నిషేధం విధించలేదని, నడి రోడ్డు మీద భారీగా జనాన్ని సమీకరించవద్దని మాత్రమే చెప్పిందని, ప్రజా రక్షణకు సంబంధించి ప్రభుత్వానికే పూర్తి అధికారమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు సీజే గుర్తు చేశారు. అలాగే.. చంద్రబాబు సభల్లో 8 మంది చనిపోయిన దృష్ట్యా సర్కారు జీవో తెచ్చిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ వేసిన వ్యక్తిలో దురుద్ధేశమేదో కనిపిస్తోందన్న హైకోర్టు సీజే.. ఎనిమిది మంది చనిపోయిన దుర్ఘటనపై విచారణ కమిటీ నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. జీవో నెంబర్ 1ని నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్‌కు సహేతుక కారణాలు లేవని, అలా చేయడమంటే ప్రజల హక్కులు కాలరాసినట్టేనని హైకోర్టు పిటిషనర్‌కు స్పష్టం చేసింది. అది సుప్రీం రూల్స్‌కు విరుద్ధం జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో వాద, ప్రతివాదనలు వాడీవేడిగానే సాగాయి. ప్రభుత్వం తెచ్చిన జీవోను పిటిషన్ సవాల్ చేయగా.. ఆ వాదనలను అంతే సమర్థవంతంగా తోసిపుచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలను పరిశీలిస్తే.. ‘‘పిటిషన్‌ను అత్యవసరంగా వెకేషన్ బెంచ్ ముందుకు తేవడాన్ని వ్యతిరేకించాం. చీఫ్ జస్టిస్ వేసిన రోస్టర్‌ను వెకేషన్ బెంచ్ మార్చింది. రోస్టర్‌ను జనవరి 5వ తేదీన రూపొందించి, 6వ తేదీన హడావిడిగా మార్చారు. రోస్టర్‌ను సరైన కారణం లేకుండా మార్చడం సుప్రీంకోర్టు నియామవళికి విరుద్ధం. రోస్టర్ మార్చిన విషయం ప్రతివాదులకు కనీసం చెప్పలేదు. ఈ పిటిషన్లో అత్యవసరం కూడా ఏమీ లేదు. సెలవులు పూర్తయ్యేవరకు వేచి ఉండకుండా ముందే విచారించారు. జనవరి 12న వెకేషన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను మార్చాలి అని వాదనలు వినిపించారు. -
ప్రజా ప్రయోజనాలకు అడ్డుపడితే సహించేది లేదు
తాడికొండ: కులవాదంతో కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలకు అడ్డుపడితే సహించేది లేదని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో 3 రాజధానులకు మద్దతుగా సమితి ఆధ్వర్యంలో 826వ రోజు కొనసాగుతోన్న రిలే నిరాహార దీక్షలకు ఆదివారం పలువురు హాజరయ్యారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కార్యకలాపాలను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి బొత్స ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు సమావేశాలు నిర్వహిస్తూ వారి ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడని నేతలు మండిపడ్డారు. కందుకూరు ఘటన జరిగిన తరువాత అయినా కనీస జాగ్రత్తలు పాటించకుండా గుంటూరులో సమావేశం నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న చంద్రబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం, పులి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ప్రయోజనాల కోసమే ఆస్తానా నియామకం
న్యూఢిల్లీ: ఢిల్లీ నగర పోలీసు కమిషనర్‌గా గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్తానాను నియమించడాన్ని కేంద్రం మళ్లీ సమర్థించుకుంది. ఢిల్లీలో భిన్నమైన శాంతి భద్రతల సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రయోజనాల కోసమే ఆయనను నియమించినట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆస్తానా పెద్ద రాష్ట్రమైన గుజరాత్లో పనిచేశారని, భారీ స్థాయిలో పోలీసు బలగాలను నేతృత్వం వహించిన అనుభవజ్ఞుడని, కేంద్ర దర్యాప్తు సంస్థలు, పారా మిలటరీ దళాల్లో పని చేశారని వెల్లడించారు. అలాంటి అపార అనుభవం ఉన్న అధికారి సేవలు ఢిల్లీలో అవసరమని భావించామని, అందుకే నగర పోలీసు కమిషనర్‌గా నియమించినట్లు అఫిడవిట్లో స్పష్టం చేశారు. ఆస్తానా సర్వీసు గడువును సైతం పొడిగించినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా నియమించడానికి కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) కేడర్‌లో ప్రస్తుతం నిర్దేశిత అనుభవం ఉన్న అధికారులెవరూ అందుబాటులో లేరని వివరించారు. అందుకే తగిన అనుభవం కలిగిన గుజరాత్ క్యాడర్‌కు చెందిన రాకేశ్ ఆస్తానాను నియమించినట్లు పేర్కొన్నారు. ఆస్తానాను ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా అపాయింట్ చేస్తూ కేంద్ర హోంశాఖ జూలై 27న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. -
క్షేత్రస్థాయిలో బలపడాలి
= బూత్ కమిటీల ఏర్పాటు అవశ్యం = పొత్తులపై తొందర వద్దు = బీజేపీ శ్రేణులకు మోడీ దిశానిర్దేశం క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం అయ్యే దిశగా కార్యక్రమాలు సాగాలని నేతలకు నరేంద్రమోడీ సూచించారు. పొత్తుల ప్రస్తావన ఇప్పుడు వద్దంటూ హితవు పలికారు. మరోవైపు మోడీ పర్యటనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం చెన్నై నగరానికి వచ్చారు. టీ నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుచ్చిలో ఇటీవల నిర్వహించిన సభ విజయవంతం కావడం దేశమంతా చర్చనీయాంశంగా మారిందన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా తిరుచ్చి సభ గురించే అడుగుతున్నారని చెప్పారు. ఈ విజయం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి నిదర్శనమన్నారు. అన్ని లోక్‌సభ స్థానాల్లో పార్టీ స్థితిగతుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా, మండల, పోలింగ్, బూత్ కమిటీల ఏర్పాటు గురించి ప్రశ్నించారు. కమిటీల ఏర్పాటు ఇప్పటికే 90 శాతం పూర్తయిందని నేతలు తెలియజేశారు. తమిళనాడులో ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తామనే విషయాన్ని ఆలోచించకుండా రాష్ర్టంలోని 45 వేల బూత్ కమిటీలను పటిష్టం చేయాలని ఆదేశించారు. కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించాలని, స్థాయినిబట్టి ఈ కమిటీల్లో చేర్చుకోవాలని సూచించారు. బూత్ కమిటీలు పటిష్టంగా ఉన్నప్పుడే పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కాగలదని పేర్కొన్నారు. పొత్తుల ప్రస్తావన వద్దు మోడీ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు లేచి పొత్తులపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కొందరు డీఎంకేతో పొత్తు వద్దంటే, మరికొందరు అన్నాడీఎంకేతో జతకట్టరాదని సూచించారు. మరికొందరు ఒంటరిగా పోటీచేసే సత్తా పార్టీకి ఉందని తెలిపారు. మోడీ స్పందిస్తూ పొత్తుల అంశం ఇప్పుడు అప్రస్తుతమని అన్నారు. పొత్తులపై మీ అభిప్రాయాలు ఏవైనా ఉంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి, పార్లమెంటు ఎన్నికల కమిటీకి తెలియజేయూలని సూచించారు. సుమారు అర్ధగంట సేపు నేతలు, కార్యకర్తలతో మోడీ సంభాషించడం పార్టీలో నూతనోత్సాహం నింపింది. పిల్ కొట్టివేత గుజరాత్లో ముస్లింల మారణహోమానికి కారకుడైన మోడీని మద్రాసు వర్సిటీలో జరిగే సభకు అనుమతించరాదంటూ తమిళనాడు మక్కల్ కట్చి అధ్యక్షులు తంగ తమిళ్ ఓ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. దీనిని కోర్టు శుక్రవారం కొట్టేసింది. ఒక పార్టీ నేత మరో పార్టీనేతపై వేసే పిటిషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం పరిధిలోకి రాదని కోర్టు వ్యాఖ్యానించింది. మోడీ రాకపై యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయలేదని తన తీర్పులో పేర్కొంది. ఇదిలావుండగా మోడీ రాకను నిరసిస్తూ ఇండియా జననాయక వాలిబర్ సంఘం, ఇండియా మానవర్ సంఘం, అఖిలభారత జననాయక సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు చెన్నైలో రాస్తారోకో చేపట్టారు. పోలీ సులు స్వల్పంగా లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పోటెత్తిన జనం నరేంద్రమోడీ రాక సందర్భంగా ఆయన పర్యటించిన ప్రతిచోటా జనం పోటెత్తారు. చెన్నై విమానాశ్రయం, పార్టీ రాష్ట్ర కార్యాలయం, సెంటినరీ ఆడిటోరియం అన్నిచోట్లా భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. బీజేపీ యువజన, వర్తక విభాగం వారు పెద్ద సంఖ్యలో వాహనాలతో నగరానికి చేరుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీసులకు జనాన్ని అదుపుచేయడం కష్టమైంది. అదే సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. మోడీ పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.