Rele hunger strike
-
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు
తాడికొండ: చంద్రబాబుకు మతిభ్రమించి రోడ్లపై సభలు పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 829వ రోజుకు చేరాయి. పలువురు మాట్లాడుతూ పేద ప్రజల మాన ప్రాణాలు పోతుంటే చంద్రబాబు ఇంకా రోడ్‌షోలు అంటూ రోడ్లపై సంచారం చేయడం సిగ్గుచేటని, ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్న బాబును ప్రజలు నమ్మే పరిస్థితి ఎప్పటికీ ఉండదన్నారు. ప్రజల ప్రాణాలపై స్పందించని ప్యాకేజీ పార్టీలు, ఎల్లో మీడియాలో లేనిది ఉన్నట్లు ప్రచారం చేసేందుకు డిబేట్లలో గగ్గోలు పెడుతుండడం దేనికి నిదర్శనమో చెప్పాలని డిమాండ్ చేశారు. బహుజనుల హక్కుల కోసం 829 రోజులుగా ఆకలి దప్పులతో పోరాటం చేస్తుంటే కనీసం తొంగి చూడని ఎల్లో మీడియా, కులవాదులు, కులగజ్జి పార్టీలు, బాబు కోసం బారులు తీరడం వెనుక ఆంతర్యమేమిటో అందరికీ అర్థమవుతుందని తెలిపారు. నేడు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధికి అన్ని విధాలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటుపడుతున్నారనడంలో సందేహం లేదన్నారు. నాయకులు మాదిగాని గురునాథం, పెరికే వరప్రసాద్, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రోడ్లపై సభలు వద్దంటే రభసా? -
కదం తొక్కిన అగ్రిగోల్డ్ బాధితులు..
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారికి మద్దతుగా నిలిచాయి. బాధితులకు అండగా ఉంటూ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నాయి. వైఎస్సార్ జిల్లా : ఏపీ ప్రభుత్వం తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల అగ్రిగోల్డ్ ఏజెంట్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి వైఎస్సార్ సీపీ మద్దతుగా నిలిచింది. ప్రొద్దుటూరులో సైతం అగ్రిగోల్డ్ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారికి అండగా వైఎస్సార్ సీపీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ విభాగం ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు సంఘీభావం తెలుపుతూ నంద్యాలలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అగ్రిగోల్డ్ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలలో కర్ర హర్షవర్ధన్ రెడ్డి, గంగుల బిజేంద్ర రెడ్డి (నాని), మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగన్నూరు సోమప్ప కూడలిలో అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, రుద్రగౌడ్, జగన్మోహన్ రెడ్డిలు మద్దతుగా నిలిచారు. ప్రకాశం : అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఒంగోలు ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ అగ్రిగోల్డ్ బాసట కమిటీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు భారీగా పాల్గొన్నారు. విజయనగరం : చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థ బారిన పడి తీవ్రంగా నష్టపోయిన బాధితులకు న్యాయం జరపాలన్న డిమాండ్‌తో కురుపాం నియోజకవర్గ కేంద్రంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు పరీక్షీత్ రాజు ఆధ్వర్యంలో రెండు రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గుంటూరు : అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. కమిటీ రాష్ట్ర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి కలెక్టరేట్ ఎదుట దీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఏసురత్నం శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. శ్రీకాకుళం : గాంధీ విగ్రహం వద్ద అగ్రిగోల్డ్ బాధితులు నిరసన చేపట్టారు. కాశీబుగ్గ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ శ్రీకాకుళం వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ కన్వీనర్ దువ్వాడ శ్రీకాంత్, వైఎస్సార్ సీపీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల నిరసనలు చేపట్టారు. -
'ఒక్కో మహిళ ఒక్కో మమతా బెనర్జీ కావాలి'
విజయనగరం(భోగాపురం): ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల్లో ఒక్కో మహిళ ఒక్కో మమతాబెనర్జీ కావాలని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. భోగాపురం మండలంలో విమానాశ్రయ బాధిత గ్రామాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అభివృద్ధి పేరిట లక్షల ఎకరాలు లాక్కునేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. గ్రామాలకు ఎర్ర బస్సు వేయలేరు కానీ ఎయిర్‌పోర్టు, మెట్రో రైలు అంటూ విదేశీ కంపెనీలకు ఆంధ్ర రాష్ట్రాన్ని ధారాదత్తం చేసేందుకు బాబు ప్రయత్నించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. గూడెపువలసలో 13వ రోజు రిలేనిరాహార దీక్షలో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ..పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రైతుల తరఫున రాజీ లేని పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఓడించారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో మీ గ్రామాలు, భూములు కాజేసేందుకు కుట్ర పన్నుతున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మొక్కవోని ధైర్యంతో ఉద్యమించాలని అన్నారు. వృద్ధ మహిళలు సైతం రిలేనిరాహారదీక్షలో పాల్గొనడం గర్వంగా ఉందని, ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న వారందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు.