మాల్‌ ఓపెనింగ్‌లో విషాదం | Man Dies in Dulquer Salmaan Event | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 6 2018 8:02 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

Man Dies in Dulquer Salmaan Event - Sakshi

సాక్షి, తిరువనంతపురం: ఓ మాల్‌ ఓపెనింగ్‌ ఈవెంట్‌లో విషాదం చోటు చేసుకుంది. తన ఫేవరెట్‌ స్టార్‌ను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో అతను మృతి చెందాడని చెబుతున్నప్పటికీ.. స్థానికులు మాత్రం తొక్కిసలాటలోనే ప్రాణాలు విడిచాడని అంటున్నారు. శనివారం సాయంత్రం కొల్లాంలోని కొట్టారక్కరలో ఎంసీ రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

మళయాళ యంగ్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరై దాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ప్రవచబలం(తిరువనంతపురం)కు చెందిన హరి(45) కూడా వారిలో ఉన్నారు. దుల్కర్‌ అక్కడికి చేరుకోగానే అతన్ని చూసేందుకు ఒక్కసారిగా జనం తోసుకోవటం ప్రారంభించారు. ఈ క్రమంలో హరి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పోలీసులు తమ వాహనంలో అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించి నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మీడియాలో వస్తున్న తొక్కిసలాట కథనాలను పోలీసులు ఖండిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement