
కంపాలా: కొత్త ఏడాది సెలబ్రేషన్స్ కోసం షాపింగ్‌కి వెళ్లి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉగాండాలో ఆదివారం జరిగింది. దేశ రాజధాని కంపాలా ప్రాంతంలోని ఫ్రీడమ్ సిటీ షాపింగ్ మాల్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద సంఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో వినియోగదారులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియో వెల్లడించింది.
ఫ్రీడమ్ సిటీలో ఏర్పాటు చేసిన బాణసంచా కొనుగోలు చేసేందుకు భారీగా జనం ఎకబడడంతో తొక్కిసలాట జరిగినట్లు మీడియా పేర్కొంది. దీంతో షాపింగ్ కోసం వచ్చిన పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: కాబూల్ ఆర్మీ ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment